Prema Entha Madhuram December 6th Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: ఆర్య చంపేస్తాడంటూ భయపడుతున్న మాన్సీ - మళ్ళీ అతడికి దూరం అవ్వనున్న అను!
Prema Entha Madhuram Today Episode: ఆర్య దంపతులని చంపటానికి ఛాయాదేవి వాళ్ళు బయలుదేరడంతో కథలో కొత్త మలుపులు చోటు చేసుకుంటాయి.
Prema Entha Madhuram December 6th Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఆర్య దంపతులు స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఆనందపడతారు ఛాయాదేవి, మాన్సీ. అంతలోనే రౌడీలు ఫోన్ చేస్తారు.
ఛాయాదేవి : మీకు రావలసిన డబ్బు మీకు అందుతుంది.
మాన్సీ: వాళ్ళ డెడ్ బాడీస్ ఏం చేశారు.
రౌడీలు: వాళ్లు కొన ప్రాణంతో కొట్టుకుంటున్నారు వాళ్ళని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు.
ఆ మాటలకి మాన్సీ, ఛాయాదేవి ఇద్దరూ టెన్షన్ పడిపోతారు. పూర్తిగా చంపమంటే అలా చేశారేంటి అని రౌడీలపై కోప్పడతారు. వాళ్లు బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పి రౌడీలు ఫోన్ పెట్టేస్తారు.
ఛాయాదేవి: భయంతో వణికిపోతున్న మాన్సీని ఎందుకు అలా భయపడిపోతున్నావు వాళ్లు కచ్చితంగా చస్తారని రౌడీలు చెప్తున్నారు కదా.
మాన్సీ: లేదు వాళ్లకి ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమ వాళ్ళని బ్రతికించేస్తుంది. ఈ హత్యయత్నం మనమే చేయించామని మా బ్రో ఇన్ లాకి ఏమాత్రం తెలిసినా మనల్ని బ్రతకనివ్వడు అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
సరే ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది ఛాయాదేవి.
మాన్సీ : వాళ్లు ఆ గుడి చుట్టుపక్కల ఉండే హాస్పిటల్ లోనే జాయిన్ అయి ఉండి ఉంటారు. పద మనం వెళ్లి వాళ్లని చంపేద్దాం అని అక్కడ నుంచి బయలుదేరుతారు.
మరోవైపు తెల్లవారినా తల్లి రాకపోవడంతో బాధతో కూర్చుంటారు అభయ్, అక్కి.
సుగుణ: పిల్లల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు, అలాంటిది ఇంకా రాకపోవడమేంటి.
ఉష: వారం రోజుల నుంచి ఇక్కడే ఉంది కదా వాళ్ళ ఇంటికి వెళ్లిందేమో.
సుగుణ: నేను వెళ్లి చూసి వస్తాను పిల్లలిద్దరికీ స్నానం చేయించి రెడీ చెయ్యు అని ఉషకు చెప్పి బయటకు వెళ్తుంది.
మరోవైపు ఆర్య ఫోన్ కలవకపోవడంతో జెండే, నీరజ్ ఇద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అసలు గుడిలో ఏం జరిగిందో ఏంటో కనుక్కోవడానికి అక్కడికి వెళ్తారు.
మరోవైపు ఆర్యని అతని రూమ్ కి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్లు. అప్పుడే అనుకి మెలకువ వచ్చి ఆర్యని వెతుక్కుంటూ వస్తుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆర్యని చూసి ఏడుస్తుంది.
అను: నా నమ్మకమే నిజమైంది సార్, మీరు మాకు ఎంత దగ్గర అయితే మీకు ప్రమాదం అంత దగ్గరవుతుంది. అందుకే మీకు దూరంగా ఉండాలని అనుకున్నాను. కానీ విధి ఎందుకో మనల్ని దగ్గర చేస్తుంది అని ఏడుస్తుంది.
ఇంతలోనే తనకి తెలిసిన సిస్టర్ అక్కడ కనిపించడంతో ఆమెకి తన కథంతా చెప్పి నన్ను ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించు అని రిక్వెస్ట్ చేస్తుంది. సిస్టర్ అందుకు ఒప్పుకుంటుంది.
హాస్పిటల్ కి వచ్చిన జెండే వాళ్ళు ఆర్య దగ్గరికి వస్తారు. అప్పుడే ఆర్య అను దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాడు.
నీరజ్: అంటే వదినమ్మ దొరికిందా, వదినమ్మని చూశారా? అని అడుగుతాడు..
జరిగిందంతా చెప్తాడు ఆర్య. జెండే, నీరజ్ సాయంతో అను రూమ్ కి వెళ్తాడు. అక్కడ అను కనిపించకపోవడంతో తన వల్లే నాకు ప్రమాదం ఎదురైందని మరింత భయపడి పోయి ఉంటుంది. అందుకే నేను ఈ పరిస్థితుల్లో ఉన్నా కూడా వదిలేసి వెళ్లిపోయింది అని ఎమోషనల్ అవుతాడు.
డాక్టర్: ఈ రూములో పేషెంట్ ఉండాలి కదా ఏమైంది అని అడుగుతాడు.
సిస్టర్: తెలియదు డాక్టర్ నేను పొద్దున్న వచ్చేటప్పటికే ఆమె ఇక్కడ లేదు అని అబద్ధం చెప్పేస్తుంది.
మరోవైపు చెల్లెలికి భోజనం తినిపించడానికి ప్రయత్నిస్తాడు అభయ్. ఆమె అమ్మ కావాలి అనడంతో కబుర్లలో పెట్టి భోజనం తినిపించడానికి ప్రయత్నిస్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read : 'త్రినయని' సీరియల్: పెద్దబొట్టమ్మకు విష భోజనం పెట్టిన సుమన - అన్నంలో పడ్డ కుభసం!