అన్వేషించండి

Prema Entha Madhuram December 1st Episode: 'ప్రేమ ఎంత మధురం' సీరియల్: అనుకి శుభవార్త చెప్పిన జోగమ్మ, ఉష ప్లాన్ వర్కౌట్ అవుతుందా! 

Prema Entha Madhuram December 1st Episode: అనుని ఆర్యని కలపటం కోసం ఉష ప్లాన్ వేసి ఇంట్లో వాళ్ళందరినీ బయటకు తీసుకువెళ్లిపోవడంతో కథలో కీలక మలుపులు చోటుచేసుకున్నాయి.

Prema Entha Madhuram December 1st Episode : ఈరోజు ఎపిసోడ్ లో బస్ స్టాప్ లో బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అను. అప్పుడే అటుగా వస్తున్న జోగమ్మ దారులు వేరు కావచ్చు కానీ దరిచేరే సమయం ఆసన్నమైంది అనుకుంటుంది. ఇంతలో అను కళ్ళు తిరిగి పడిపోవడంతో ఆమెని ఒడిలో పడుకోబెట్టుకుంటుంది జోగమ్మ. అక్కడ చుట్టూ జనాలు మూగడంతో అటుగా వస్తున్న ఆర్య ఏం జరిగింది అని ఒక ఆవిడని అడుగుతాడు. ఒక ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయింది మీ దగ్గర మంచి నీళ్లు ఉన్నాయా అని అడుగుతుంది ఆవిడ.

ఆర్య : నేను వెళ్లి తీసుకు వస్తాను అని చెప్పి వాటర్ బాటిల్ తీసుకొని వచ్చి అక్కడున్న వాళ్ళకి ఇస్తాడు.

కళ్ళు తిరిగి పడిపోయిన ఆవిడ మొఖం చూడడానికి ప్రయత్నిస్తాడు కానీ అతనికి కనిపించదు. ఈలోపు ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి అక్కడ అందర్నీ పంపించేస్తాడు. అక్కడున్న వాళ్లు అనుని ఒక చెట్టు కింద కూర్చోబెట్టి వెళ్ళిపోతారు.

జోగమ్మ: అనుని దీవిస్తూ కాలం కళ్ళకి మాయ పొరలను కమ్మేలాగా చేస్తుంది కానీ అదే కాలం కమ్మినపొరలు తొలగిపోయేలాగా చేస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

మరోవైపు అటుగా వస్తున్న ఒక మంత్రి ఆర్యని చూసి కారు ఆపుతాడు. ఒక ప్రాజెక్టు విషయంగా మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ మీరు అవైలబుల్ గా లేరు అంటాడు.

ఆర్య : వీలు చూసుకుని నేనే వస్తాను ఇప్పుడేమీ మాట్లాడొద్దు అని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మినిస్టర్. వెనక్కి తిరిగేసరికి జోగమ్మ ఉంటుంది.

జోగమ్మ : దూరమైన బంధాలు దగ్గర అయ్యే సమయం ఆసన్నమైంది, ఈ కార్తీక పౌర్ణమి జగమంతా వెలుగులతో నిండిపోతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత ఆర్యని కలవడానికి నీరజ్, జెండే వస్తారు.

జెండే : మీరు ఇంత ఆనందంగా ఉన్నారంటే అనుకు సంబంధించిన విషయం తెలిసే ఉంటుంది.

ఆర్య: అవును, జోగమ్మ చాలా రోజుల తర్వాత కనిపించింది కార్తీక పౌర్ణమి రోజు మేమిద్దరం కలుస్తామని చెప్పింది. గుడిలో పంతులు గారు కూడా అదే చెప్పారు అని ఆనందంగా చెప్తాడు.

జెండే : ఈసారి అను తప్పించుకోకుండా జాగ్రత్తలు తీసుకుందాం.

ఆర్య : వద్దు మనం ప్రతిసారి అదే తప్పు చేస్తున్నాము ఈసారి నేను ఒక్కడినే వెళ్తాను.

నీరజ్ : బాగా ఎమోషనల్ అవుతూ వదినమ్మ మీ దగ్గరికి వచ్చేస్తే మీకు ఎలాంటి కష్టాలు ఉండవు అంటాడు.

మరోవైపు చిల్డ్రన్స్ పార్క్ ఓపెనింగ్ అని పేపర్లో చదువుతుంది ఉష. అది చదివిన తర్వాత ఆమెకి ఒక ఆలోచన వస్తుంది. ఇంట్లో అందర్నీ తీసుకుని పార్క్ కి వెళ్ళిపోతే అన్నయ్య, రాధ గారు మాట్లాడుకునే ఛాన్స్ వస్తుంది అనుకొని పిల్లల్ని పిలుస్తుంది.

ఉష: పిల్లలు చిల్డ్రన్స్ పార్క్ కి వెళ్దామా

పిల్లలు: అమ్మ వచ్చాక వెళ్దాం.

ఉష: అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది.

పిల్లలు: అయితే నానమ్మ పర్మిషన్ అడుగుదాము.

ఉష: నానమ్మని డైరెక్ట్ గా అడిగితే ఒప్పుకోదు అంటూ చిన్న ట్రిక్ ప్లే చేసి మొత్తం ఇంట్లో అందరినీ పార్క్ కి రెడీ చేస్తుంది. ఆర్య దగ్గరికి వెళ్లి మేము పార్కుకి వెళ్తున్నాము రాధ గారు వచ్చేసరికి లేట్ అవుతుంది. మేము బయట భోజనం చేసి వచ్చేస్తాము వచ్చేటప్పుడు నీకు కూడా పార్సల్ తీసుకువస్తాము.

ఆర్య : వద్దు నేను ఏదైనా ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పి ఉషకి డబ్బులు ఇస్తాడు.

ఉష: అయితే రాధ గారికి కూడా వంట చేసేయ్ అంటూ ఆర్య చెప్తున్నది వినిపించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది.

తర్వాత ఆర్య వంట చేస్తూ ఉంటాడు. విషయం తెలియని అను డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తుంది. నార్మల్ గా పిల్లల్ని పిలవటంతో ఆర్య ఆమె ముఖం చూడకుండానే విషమంతా చెప్పి మీరు ఫ్రెష్ అయి రండి నేను వంట చేసి పెట్టేస్తాను అని చెప్తాడు. అను ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి ఆమె రూమ్లో భోజనం పెట్టేస్తాడు ఆర్య.

ఆర్య: ఆ భోజనం మీకోసమే, ఇక్కడైతే మీరు కంఫర్ట్ గా తినలేరు కదా అందుకే ఉంటాడు.

అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఆర్య మీ వారు మీకు ఎందుకు దూరంగా ఉంటున్నారు, మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా?

అను : ఆయన చాలా మంచివారు, నన్ను మహారాణిలా చూసుకుంటారు. పరిస్థితుల ప్రభావం అంతే.

ఆర్య : పిల్లల కోసమైనా ఆలోచించాలి కదా ఈ వయసులో వాళ్ళకి తండ్రి ప్రేమ ఎంతో అవసరం కదా అంటాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget