Prema Entha Madhuram Serial Today September 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: తమ్ముళ్ల ను అనుమానించిన శంకర్ - అకిని ఇంటి కోడలిగా తీసుకురమ్మన్న జ్యోతి
Prema Entha Madhuram Today Episode: గౌరి తనలో తాను సిగ్గుపడుతూ నవ్వుకుంటుంటే సంధ్య, శ్రావణి చూసి అక్కా ఎవరా అబ్బాయి అని అడుగుతారు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today September 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: తమ్ముళ్ల ను అనుమానించిన శంకర్ - అకిని ఇంటి కోడలిగా తీసుకురమ్మన్న జ్యోతి Prema Entha Madhuram serial today episode September 21st written update Prema Entha Madhuram Serial Today September 21st: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: తమ్ముళ్ల ను అనుమానించిన శంకర్ - అకిని ఇంటి కోడలిగా తీసుకురమ్మన్న జ్యోతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/09/21/316a406a0c1f6e40be841882930935831726881243012879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Serial Today Episode: ఇంటికి వచ్చిన పాండును శంకర్ బెదిరిస్తాడు. గౌరికి పనికిమాలిన ఐడియాలు ఇచ్చావనుకో అని వార్నింగ్ ఇస్తాడు. సరే అని పాండు వెళ్లిపోతాడు. జెండే, యాదగిరి వెళ్లిపోతారు. అకి అక్కడే ఉండిపోతుంది. లోపలికి వెళ్లిన పాండు ఇంత అమాయకంగా ఉంటే ఎలా అమ్మా అంటూ ఇంకో జాబ్ ఆఫర్ చూడమంటావా? అని అడగ్గానే శంకర్ వచ్చి ప్లేటుతో కొడతాడు. దీంతో గౌరి ఇంటికి వచ్చింది ఎవడైనా అతిథి మర్యాదలు చేయాలని చెప్తుంది. దీంతో శంకర్ అకిని మీరు తాగినదాంట్లో కొంచెం మిగిలించి ఉంట ఈ ట్యాంకర్ కు ఇచ్చేవాణ్ని కదా అంటాడు. మరోవైపు జ్యోతి బట్టలు ఐరన్ చేస్తుంటుంది.
జ్యోతి: అరేయ్ రవి అకి చాలా మంచి అమ్మాయిరా..
రవి: నాకేం తెలుసు అమ్మా.. పరిచయం అయ్యింది ఇపుడేగా..
జ్యోతి: తనను నువ్వు జాగ్రత్తగా చూసుకో తనకు నచ్చినట్టుగా ఉండు.
రవి: సరే అమ్మా..
జ్యోతి: అరేయ్ ఆగరా ఇటురా.. నాకు అకి అంటే చాలా ఇష్టం రా తను చాలా తెలివైంది. మంచిది. అందంగా ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యంగా నా అన్న కూతురు రా తను.
రవి: నాకు తెలుసు అమ్మ..
జ్యోతి: నీకేం తెలియదు నేను చెప్పేది విను.
రవి: సరే చెప్పమ్మా..
జ్యోతి: నాకు అలాంటి కోడలే కావాలి.
రవి: ఇప్పుడే కదమ్మా జాబులో జాయిన్ అయ్యాను నేను. ఇంతలోపే పెళ్లి కోడలు దాకా వెళ్లిపోయావా? నువ్వు. అలాంటి అమ్మాయినే అది కూడా నువ్వు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటా
జ్యోతి: అలాంటి అమ్మాయినే కాదురా..? అకినే కోడలుగా వచ్చినా నాకు ఇష్టమే
అనగానే బయట నుంచి మొత్తం వింటున్న యాదగిరి కోపంగా లోపలికి వస్తాడు. జ్యోతిని తిడతాడు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తర్వాత యాదగిరి రిక్వెస్టుగా తాను తలదించుకునే పరిస్థితి తీసుకురావొద్దని చెప్పి వెళ్లిపోతాడు. జ్యోతి మీనాన్న మాటలేం పట్టించుకోకు అని చెప్పగానే రవి నాన్న మాట కాదనను అని వెళ్లిపోతాడు. మరోవైపు గౌరి, శంకర్ ను గుర్తు చేసుకుని తనలో తానే నవ్వుకుంటుంది.
శ్రావణి: అక్కా ఏమైంది నీ ఒంట్లో బాగానే ఉందా?
గౌరి: అదేంటే అలా అడిగావు. నేను బాగానే ఉన్నానుగా..
సంధ్య: మరి ఎందుకు అక్కా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు. పిచ్చిదానిలాగా?
గౌరి: నేనా నవ్వుకున్నానా? అదేం లేదే..
శ్రావని: నిజం చెప్పు అక్కా ఎవరా? అబ్బాయి.
గౌరి: అబ్బాయా.. ఎవరే..
శ్రావణి: నువ్వు ఎవరి గురించైతే ఆలొచిస్తూ మురిసిపోతున్నావో ఆ అబ్బాయి.
గౌరి: ఏం మాట్లాడుతున్నావే.. పిచ్చి నాకు కాదు మీకు పట్టింది. నేనెందుక అబ్బయి గురించి ఆలోచిస్తాను. పదండి వెళ్లి భోజనం చేద్దాం అంటుంది.
సరే అని ఇద్దరూ వెళ్లిపోయాకా.. వీళ్లతో నేను జాగ్రత్తగా ఉండాలి. అయినా శంకర్ గారిని చూస్తే నా ముఖంలో నవ్వొస్తుందా? అయినా నేను శంకర్ కు పడటం ఏంటి అనుకుంటుంది గౌరి. తర్వాత సంధ్య బట్టల కోసం పైకి వెళ్లి చిన్నొడితో మాట్లాడుతుంది. ఇంతలో ఫోన్ మాట్లాడుతూ శంకర్ రావడంతో ఇద్దరూ కంగారుగా దాక్కుంటారు. కింద నుంచి గౌరి, సంధ్య పిలుస్తుంది. దీంతో ఇక్కడ ఎవరూ లేరని చెప్తుంది. ఇంతలో సంధ్య కంగారుగా మాట్లాడుతూ రావడంతో గౌరి పైకి వెళ్తుంది. గౌరి కంగారుగా వెళ్లడం చూసిన శ్రావణి కూడా పైకి వెళ్తుంది. ఇంతలో చెట్టు మీదకు దూకి కిందకు వెళ్లిపోయిన చిన్నొడు తాపీగా పైకి వచ్చి అందరూ ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్లావు అని శంకర్ అడుగుతే పక్కవీధిలో ఫ్రెండుకు సబ్జెక్టులో డౌట్ ఉందంటే క్లియర్ చేసి వస్తున్నాను అని చెప్తాడు చిన్నొడు. దీంతో శంకర్ తమ్ముణ్ని అనుమానించినందుకు గిల్టీగా ఫీలవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణకు నిజం చెప్పిన రుద్రాణి – రాజ్ కు ఆర్డర్ వేసిన అపర్ణ
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)