Prema Entha Madhuram Serial Today September 14th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరి కోసం ఇంటికి వచ్చిన అభయ్ – నాటకం ఆడి అభయ్ ను అక్కడి నుంచి వెళ్లేలా చేసిన రాకేష్
Prema Entha Madhuram Today Episode: రాకేష్ నాటకం ఆడి అభయ్ , గౌరిని కలవకుండా చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: అభయ్ గౌరి వాళ్ల ఇంటికి వెళ్లగానే సంధ్య, శ్రావణి వచ్చి జెండే, అకి భోజనం చేసి వెళ్లిపోయారు అని చెప్తారు. దీంతో అభయ్ నేను గౌరి గారికి థాంక్స్ చెప్పాలని వచ్చాను అంటాడు. దీంతో సంధ్య, శ్రావణి లోపలికి రండి అని పిలవగానే... గౌరి గారినే ఇక్కడకు పిలవండి అని అభయ్ చెప్పగానే సరేనని సంధ్య, శ్రావణి లోపలికి వెళ్తారు. అభయ్ వచ్చాడని గౌరి, శంకర్ కు చెప్తారు. అయితే గౌరి, శంకర్‌ను వెళ్దాం పద అనగానే ఆ అబ్బాయి నిన్ను కలవడానికే వచ్చాడంట కదా నేనెందుకులే అంటాడు. దీంతో ఇద్దరు వాదులాడుకుంటుటారు. మరోవైపు బయట ఉన్న అభయ్ రాకేష్ కు ఫోన్ చేసి తాను గౌరి వాళ్ల ఇంటికి వచ్చానని చెప్పడంతో రాకేష్ షాక్ అవుతాడు.
రాకేష్: అక్కడికి వెళ్లావా? ఎందుకు?
అభయ్: అవును అకికి సర్‌ప్రైజ్ ఇద్దామని వచ్చి నేనే సర్‌ప్రైజ్ అయ్యాను.
రాకేష్: సర్‌ప్రైజ్ అయ్యావా? ఎందుకు ఎవరినైనా కలిశావా?
అభయ్: లేదు తీరా నేను ఇక్కడికి వచ్చే సరికి అకి, ఫ్రెండు ఇద్దరూ వెళ్లిపోయారంట. నేను కూడా గౌరి గారిని కలిసి స్టార్ట్ అవుతాను.
అని అభయ్ చెప్పగానే రాకేష్ తనను ఎవరో కొడుతున్నట్లు అరుస్తాడు. అభయ్ వెంటనే విజయ్‌నగర్ కాలనీకి రా అంటూ ఫోన్ కట్ చేస్తాడు. లోపల గౌరి, శంకర్ లు గొడవ ఆపేసి వెళ్దాం పదండి అని బయటకు వెళ్తుటారు. బయట ఉన్న అభయ్, రాకేష్ ఏదో ప్రమాదంలో ఉన్నట్లున్నాడు. నేను వెళ్లాలి అని వెళ్లిపోతాడు. బయటకు వచ్చిన
శంకర్: గౌరి గారు మనల్ని రమ్మని చెప్పి అతను వెళ్లిపోతున్నాడేంటి?
గౌరి: అదే నాకు అర్థం కావడం లేదు. పాపం ఏదో కంగారులో ఉన్నట్లున్నాడు.
శంకర్: కంగారులో ఉండటం కాదు. అతనికి కూడా మీలాగే మైండ్ సరిగ్గా లేనట్లుంది.
శ్రావణి: నువ్వు చేసిన వంకాయ కూర తినగానే వాళ్ల అమ్మగారు గుర్తుకొచ్చారంట. అందుకే థాంక్స్ చెప్పడానికి వచ్చారుట.
అని చెప్పగానే మళ్ళీ శంకర్, గౌరి గొడవ పడతారు. మరోవైపు పాండుకు రాకేష్ ఫోన్ చేసి నాకు నీతో పనుంది. నిన్ను కలవాలి. అని అడగ్గానే ఎవరని ఒకసారి నీ ఫోన్ చెక్ చేసుకో అని చెప్పగానే ఫోన్ లో తన అకౌంట్ లో పడిన ఐదు లక్షల రూపాయలు చూసి షాక్ అవుతూ ఎవరు నువ్వు అని అడగ్గానే సాయంత్రం ఎయిర్ ఫోర్ట్ రోడ్డుకు వస్తే అన్ని విషయాలు మాట్లాడదామని రాకేష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో అక్కడికి అభయ్ రాగానే రాకేష్ నాటకం మొదలుపెడతాడు. తర్వాత పాండు రాకేష్ చెప్పిన ప్లేస్‌కు వెళ్తాడు. రాకేష్‌న చూసి నువ్వా అంటాడు.
రాకేష్: శత్రువుకి శత్రువు ఫ్రెండ్. ఆ శంకర్ నాకు ఒకరకంగా శత్రువే సో మనం ఫ్రెండ్స్.
పాండు: నువ్వు ఘటికుడివే.. ఇప్పుడు చెప్పు మనం ఏం చేద్దాం.
రాకేష్: అంతకన్నా ముందు మీ ఇంట్లో ఉన్న గౌరిని నేను చెప్పిన ప్లేస్ కు పంపించాలి.
పాండు: మనం డైరెక్టుగా శంకర్ నే అటాక్ చేయోచ్చు కదా మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు.
అనగానే నేను చెప్పిందే చేయ్ లేదంటే నీకు ఇస్తానని డబ్బుల ఇవ్వను అంటూ బ్లాక్ మెయిల్ చేస్తాడు. దీంతో సరే ఓకే అంటాడు పాండు. దీంతో తన ప్లాన్ పాండుకు చెప్తాడు రాకేష్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: అపూర్వకు వార్నింగ్ ఇచ్చిన శోభ – చెర్రికి నిజం చెప్పిన భూమి