Prema Entha Madhuram Serial Today September 10th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: గౌరికి ఐ లవ్ యూ చెప్పిన శంకర్ – గౌరి, శంకర్ లను కలిపేందుకు జ్యోతి ప్లాన్
Prema Entha Madhuram Today Episode: శంకర్, గౌరి చేతికి గోరింటాకు పెట్టి భోజనం తినిపించి ఐ లవ్ యూ చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: వినాయక చవితికి ఏర్పాట్లు చేసుకుంటూ శంకర్ తన టెన్త్ క్లాస్ లవ్ స్టోరీ గురించి చెప్తుంటే గౌరి వచ్చి ఆపుతుంది. ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారని అరుస్తుంది. పెద్దొడిని చిన్నొడిని అక్కడి నుంచి లేపి తాను కూర్చుని పనులు చేయిస్తుంది. ఇంతలో గౌరి చేయి రుబ్బురోలులో పడగానే శంకర్, గౌరి చేయి తన నోటిలో పెట్టుకుంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. తర్వాత అందరూ కలిసి గోరింటాకు పెట్టుకుంటుంటే పెద్దొడు, చిన్నోడు చూస్తుంటారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండని గౌరి చెప్పగానే శంకర్ వచ్చి పదండిరా వెళ్దాం అని అనగానే శంకర్ ను ఉండమని గౌరి చెప్తుంది. దీంతో శంకర్ అక్కడే ఉండిపోతాడు. ఇంతలో శ్రావణి, సంధ్య అక్కా మాకు నువ్వు గోరింటాకు పెట్టావు. మరి నీకెవరు పెడతారు అని అడగ్గానే దీనికి మరీ ఇంత మెహమాటం ఎందుకండి అని గౌరికి శంకర్ గోరింటాకు పెడతాడు. దీంతో గౌరి ఏడుస్తుంది.
శంకర్: ఇంత అందంగా గోరింటాకు పెడితే ఎందుకు ఏడుస్తున్నారు.
శ్రావణి: మా అక్కా ఇంకా భోజనం చేయలేదు.
శంకర్: అయ్యో మీరింకా భోజనం చేయలేదా? ఆ విషయం ముందే చెప్పాలి కదండి.
గౌరి: ఎక్కడ చెప్పనిచ్చారు. గోరింటాకు మీద ఏదో రిసెర్చ్ చేసినట్టు ఓ ఏదో చెప్పుకుంటూ పోతున్నారు. మమ్మళ్లీ ఎక్కడ మట్లాడనిచ్చారు.
శ్రావణి: అయ్యో రాత్రంతా ఆకలితో ఎలా నిద్రపోతావు అక్కా.. ఓ పని చేయ్ కడిగేసుకుని తినేయ్.
సంధ్య: వద్దే సరిగ్గా పండక పోతే మన ఓనరు లాంటి టాంకర్ గాడు మొగుడిగా వస్తాడని శంకర్ గారు చెప్పారు కదా!
గౌరి: చీ చీ అయితే నేను గోరింటాకు అసలు కడగను.
శ్రావణి: మరి ఫుడ్డు ఎలా..?
శంకర్: మీ అక్క ఆకలితో పడుకోకుండా చూసుకునేది బాధ్యత నాది. మీరు బాగా తిన్నారు కదా వెళ్లండి వెళ్లి పడుకోండి
అని చెప్పగానే శ్రావణి, సంధ్య వెళ్లిపోతారు. చేసిందంతా చేసి ఇప్పుడేం చేస్తారు అని గౌరి అడగ్గానే అయ్యో అలా మట్లాడతారేంటి ఎవరైనా వింటే బాగోదు అని శంకర్ స్పూన్ తీసుకొచ్చి గౌరికి అన్నం తినిపిస్తాడు. శంకర్ వేలు గౌరి కొరుకుతుంది. ఎందుకు కొరికారు అని అడగ్గానే ఇందాక నా వేలు నలిగింది కదా దానికి ఇది రివేంజ్ అంటుంది గౌరి. అయితే చూడండి అంటూ శంకర్ కూర ఎక్కువ కలిపి పెద్ద పెద్ద ముద్దలు కలిపి బలవంతంగా తినిపిస్తాడు. మరునాడు ఉదయం యాదగిరి, జ్యోతి వస్తారు. గౌరి చేతికి ఉన్న గోరింటాకు చూసి జ్యోతి చాలా బాగా పండిందని అంటుంది. ఇంతలో శంకర్ వచ్చి అది పెట్టింది నేనే అంటాడు. మరోవైపు గౌరి, శంకర్ లను కనిపెట్టలేకపోతున్నామని రాకేష్ ఇరిటేటింగ్ గా ఫీలవుతుంటాడు. పనిమనిషి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని.. అభయ్ గౌరిని కలుస్తానన్న మాటలు గుర్తు చేసుకుని పిచ్చిగా అరుస్తుంటాడు. మరోవైపు గౌరి, శంకర్ లను కలపడానికి జ్యోతి ప్లాన్ చేస్తుంది. గౌరి కంట్లో డస్ట్ పడేలా చేస్తుంది. గౌరి బాధపడుతుంటే అందరూ వస్తారు.
జ్యోతి: కంట్లో నలక పడినట్లు ఉంది బాబు..
శ్రావణి: అవునా..? అక్కా ఏది చూడని..
జ్యోతి: అయ్యో వద్దమ్మా నీ వల్ల కాదు. కంట్లో నలక తీయడం అంత ఈజీ కాదు. చాలా చాకచక్యంగా తీయాలి. లేదంటే కళ్లకే ప్రమాదం.
సంధ్య: ఉండండి నేను చూస్తాను..
జ్యోతి: అబ్బా శ్రావణి వల్లే కాలేదంటే ఇక నీ వల్ల ఏమౌతుంది.
అని అన్నయ్య ఇంకా రాలేదేంటి? అని మనసులో అనుకుంటుంది. ఇంతలో శంకర్ వచ్చి ఏంటని అడిగి గౌరి దగ్గరకు వెళ్ళి కళ్లల్లో పడిన నలక తీస్తూ.. ఉంటే సరదాగా, రొమాంటిక్ గా ఉంటుంది. ఇంతలో యాదగిరి, జ్యోతికి సైగ చేస్తాడు. జ్యోతి నేనే చేశాను అన్నట్లు సైగ చేస్తుంది. గౌరి కళ్లు తెరవడం లేదని శంకర్ ఐ లవ్ యూ అంటూ చెప్పడంతో గౌరి షాకింగ్ కళ్లు తెరిచి చూస్తుంది. అప్పుడు వెంటనే శంకర్ కళ్లల్లో పడిన నలకను తీస్తాడు. దీంతో అందరూ షాక్ అయి గౌరి గారికి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావని అడుగుతారు. దీంతో శంకర్ నిన్ను పెళ్లి చేసుకుందామని చెప్పాను అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘మేఘసందేశం’ సీరియల్: భూమికి నిజం చెప్పిన చెర్రీ – గగన్ కు గతం గుర్తు చేసిన భూమి