Prema Entha Madhuram Serial Today March 26th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఇంట్లొంచి వెళ్లనని అమ్మకు మాటిచ్చిన ఆర్య – సెక్యూరిటీతో ఆర్యను అవమానించిన మీరా
Prema Entha Madhuram Today Episode: ఇంట్లోకి వస్తున్న ఆర్యను గేటు దగ్గరే సెక్యూరిటీతో అవమానిస్తుంది మీరా.. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆర్య, అను ఇంట్లోంచి వెళ్లిపోతుంటే శారదాదేవి వెళ్లి అడ్డుకుంటుంది. నువ్వు ఇంట్లోంచి వెళితే నేను తట్టుకోలేను అంటూ ఏడుస్తుంది. ఎంత చెప్పినా మీరు వినకుండా వెళ్లిపోతే నేను చచ్చినంత ఒట్టు అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
ఆర్య: అమ్మా నాకు ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు నీ మనసు తెలుసు. ఏది జరిగినా అది మన మంచికే నేనెప్పుడూ నీతోనే ఉంటానమ్మా?
అనడంతో శారదాదేవి ఏడుస్తూ ఆర్యను హగ్ చేసుకుంటుంది. తర్వాత ఆర్య, ఆజయ్ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటే కేశవ వస్తాడు.
కేశవ: ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు ఆర్య. నువ్వు ఎంత దాచాలని చూసినా నీ కళ్లెప్పుడు నిజమే చెప్తాయి ఆర్య.
అనడంతో ఆర్య బాధపడుతూ కేశవను హగ్ చేసుకుంటాడు. ఏమైందని కేశవ అడుగుతాడు. అమ్మకు నువ్వెందుకు అడ్డు చెప్పవు.. ఆస్థి ఆజయ్‌కి అప్పగిస్తే మీ ఫీచర్ ఏం కావాలి అంటూ కేశవ అడగ్గానే..
ఆర్య: కన్నతల్లికి ఏ కొడుకు ఎక్కువ కాకుండా పోతాడు జెండే..
కేశవ: కన్నకొడుకా.. ఏమంటున్నావు ఆర్య.
అను: మీరు విన్నది నిజమే సార్. అజయ్ అత్తమ్మ కన్నకొడుకు.
కేశవ: మీరిద్దరు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు.
అంటూ కేశవ అడగ్గానే అను మొత్తం చెప్పేస్తుంది. సూర్యవర్థన్ గారికి అత్తమ్మ రెండో భార్య అంటూ చెప్పేస్తుంది.
కేశవ: అంటే నీరజ్ సార్, అజయ్ సొంత అన్నదమ్ముల్లా..
అను: అవును సార్. కానీ ఈ విషయం నీరజ్ సార్‌కు తెలియదు.
కేశవ: ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలియకపోవడమే మంచిది అను. అజయ్ మీరా చాలా డేంజరస్ అమ్మ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని ఆర్యను అన్ని రకాలుగా దెబ్బ తీయాలని చూస్తారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఆర్య: నేను ఆస్థి గురించో అధికారం గురించో బాధపడటం లేదు జెండే.. అమ్మను ఇంకా ఎంత బాధపెడతాడో అని ఆలోచిస్తున్నాను.
కేశవ: పోయిన ఆస్థుల గురించి కాకుండా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు చూడు ఇదే నీ మంచితనం. ఎవరైనా నీ ఆస్థులు దొచుకోవచ్చు కానీ నీ మంచితనాన్ని దోచుకోలేరు.
ఆర్య: నా భార్య పిల్లలను ఎలా రక్షించుకోవాలో నాకు తెలుసు. నా ప్రాణం ఉండగా వాళ్లకు ఏ కష్టం రానివ్వను. ఇప్పుడు మనం చేయాల్సింది కంపెనీ ఎంప్లాయీస్ ను కాపాడుకోవడం.
కేశవ: నువ్వు చెప్పినట్టే అందరం ఒక్క మాట మీద ఉండి ఈ ఎంపైర్ ను కాపాడుకుందాం.
అంటూ అందరూ మాట్లాడుకుంటారు తర్వాత మీరా సర్‌ప్రైజ్ అంటూ అజయ్‌ని పైకి తీసుకెళ్తుంది. కింద బయటకు వెళ్లిన ఆర్య వస్తాడు. గేట్ దగ్గర సెక్యూరిటీ ఆర్యను ఆపేస్తాడు. మీరా మేడం పర్మిషన్ తీసుకున్నాకే మిమ్మల్ని లోపలికి అలో చేస్తానని చెప్తాడు. ఇదంతా గమనించిన అను వచ్చి సెక్యూరిటీని తిడుతుంది. నిన్ను కొత్తగా ఎవరు తీసుకున్నారని అడుగుతుంది. తనను మీరా మేడం అపాయింట్ చేసిందని తన పర్మిషన్ లేకుండా ఎవ్వరినీ లోపలికి పంపించనని చెప్పడంతో ఆర్య మీరా పర్మిషన్ తీసుకో అని చెప్పగానే సెక్యూరిటీ మీరాకు ఫోన్ చేసి పర్మిషన్ తీసుకుని ఆర్యను లోపలికి పంపిస్తాడు.
అజయ్: సారీ బ్రదర్ మీరా గురించి మీకు తెలిసిందే కదా.. తను చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. పాపం బాగా హర్ట్ అయ్యారనుకుంటా?
ఆర్య: నో అజయ్ లైఫ్‌లో చాలా చూశాను. ఈరోజు పైనున్న వాళ్లు రేపు కింద పడొచ్చు. కింద పడ్డారు అనుకున్నవాళ్లు పైకి ఎదగొచ్చు.
అంటూ ఆర్య చెప్పి అనుతో కలిసి వెళ్లిపోతాడు. మరోవైపు మాన్షి పక్కకు వెళ్లి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అనుకు బాగా జరిగిందని సంతోషిస్తుంది. ఇంతలో మీరా వస్తుంది. ఇద్దరూ కలిసి అనుపై రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం నీరజ్ చూస్తాడు. నీరజ్ దగ్గరకు రాగానే మీరా పక్కకు వెళ్లి దాక్కుంటుంది. మాన్షి తన ఫ్రెండ్ తో ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. నీరజ్ మాత్రం మాన్షి దగ్గరకు వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు అను రూంలో ఆలోచిస్తూ ఉంటుంది.
ఆర్య: అను ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా?
అను: ఇక ముందు ముందు ఏం చేస్తారోనన్న భయంతో ఆలోచిస్తున్నాను సార్.
అంటూ ఆసలు ఇదంతా మనకు అవసరమా? అంటూ ఆర్యను అడగడంతో అమ్మకు ఇచ్చిన మాట తప్పమంటావా? అంటాడు. అయితే నిజం మీకు తెలుసని అత్తమ్మకు చెప్పమంటుంది అను. వద్దని ఆర్య చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: శృతితో లోకేశ్ రొమాన్స్, చివరిలో చిన్న ట్విస్ట్ - ‘ఇనిమేల్’ ఫుల్ సాంగ్ వచ్చేసింది, చూశారా?