Prema Entha Madhuram Serial Today March 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: ఆస్థి కోసం అజయ్ కొత్త డ్రామా – అజయ్ కాలర్ పట్టుకున్న నీరజ్
Prema Entha Madhuram Today Episode: ఆస్థి కోసం అజయ్ కొత్త డ్రామా ఆడటంతో నీరజ్ కోపంగా అజయ్ కాలర్ పట్టుకుంటాడు దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: ఆనంది వచ్చి తనకు గదిలో కంపర్ట్ గా లేదని చెప్పడంతో రేపు నీకు నచ్చిన గదిలో పడుకుందువులే అని చెప్తారు అజయ్, మీరా. అలాగే తనను అకి, అభయ్ కోపంగా చూస్తున్నారని చెప్పడంతో వాళ్లు త్వరలోనే ఇక్కడి నుంచి వెళ్లిపోతారని.. లేదంటే మనకు సర్వెంట్స్ గా మారిపోతారని చెప్పి అనందిని రూంలోకి పంపిస్తారు. తర్వాత ఆనందికి చెప్పడమే కాదు అది వీలైనంత త్వరగా నిజం చేయాలని మీరా అజయ్‌కి చెప్తుంది. ఆస్థి అధికారం మన సొంతం కావాలని చెప్పడంతో వెయిట్ అండ్ సీ మీరా అంటూ మా అమ్మ ద్వారానే అన్నీ జరుగుతాయని... జరిపిస్తానని అజయ్ చెప్తాడు. మరోవైపు శారదాదేవి అజయ్ మాటలు గుర్తుచేసుకుంటూ బాధపడుతుంది. ఆర్యకి నిజం ఎప్పటికీ తెలియకూడదని మనసులో అనుకుంటుంది. ఇంతలో అజయ్ అక్కడికి వస్తాడు.
అజయ్: అమ్మా నేను ఎవరిని.. చెప్పమ్మా.. నేను నీ కన్నకొడుకునే కదా
శారదాదేవి: అవును నాన్నా ఇప్పుడు ఏమైంది?
అజయ్: మూడు పూటలా ఇంత తిని ఇంట్లో ఓ మూలన పడుకుంటాననుకున్నావా? లేకపోతే ఇంట్లో సర్వెంట్స్ తక్కువయ్యారని తీసుకొచ్చావా?
శారదాదేవి: అయ్యో అజయ్ ఆవేశపడకు నాన్నా ఈ ఇంట్లో నీ గౌరవానికి ఏ లోటు ఉండదు నాన్నా..
అజయ్: అవునా.. అయితే ఇందాకా మీరాకి జరిగిన అవమానం సంగతి ఏంటి? ఈ ఇంట్లో వాళ్ల పర్మిషన్ లేకుండా ఏదీ జరగకూడదనా?
శారదాదేవి: అజయ్.. నాన్నా అను అటువంటిది కాదు నాన్నా..
అజయ్: ఓహో అను అలాంటిది కాదు.. అంటే నేను నా భార్య మంచివాళ్లం కాదు అంతేనా..? వాళ్లే అనుకున్నాను అమ్మా కానీ ఇప్పుడు నువ్వు కూడా అదే మాట అంటున్నావు.
అంటూ అజయ్ కోపంగా శారదాదేవితో మాట్లాడతాడు. నేను అమ్మ ప్రేమ కోసం ఇక్కడికి వచ్చాకా నన్ను నా తొడబుట్టిన తమ్ముడే అవమానించాడు. నన్ను ఇంట్లోంచి వెళ్లిపోమ్మన్నాడు అంటూ నేనిప్పుడే నేనే నీ కన్నకొడుకుని అన్న నిజం చెప్పేస్తాను అని వెళ్లిపోతుంటే శారదాదేవి ఆపుతుంది. ఈ నిజం ఎవ్వరికీ తెలియకూడదని.. ఆర్యకు తెలిస్తే తట్టుకోలేడని ఏడుస్తుంది. ఈ ఇంట్లో నీ గౌరవం నిలబెట్టడానికి నీకేం కావాలో చెప్పు అంటుంది.
అజయ్: ఏం అడిగినా చేస్తావా అమ్మా..
శారదాదేవి: చేస్తాను నాన్నా..
అజయ్: అయితే వర్థన్ ఫ్యామిలీకి చెందిన ఆస్థులన్నీ నా పేరుమీద రాయమని చెప్పు.
శారద: ఏం మాట్లాడుతున్నావు అజయ్. ఇదంతా ఆర్య కష్టార్జితం దాన్ని నీకెలా రాయమని చెప్తాను.
అనగానే అయితే నాకు ఈ ఇంట్లో నీ కొడుకుగా గుర్తింపు లేదా ఆస్థి కావాలి.. లేదంటే నా ప్రాణమే త్యాగం చేస్తాను అంటూ అజయ్ కిందకు దూకబోతుంటే ఆర్య వచ్చి ఆజయ్‌ని లాగుతాడు. ఆర్య కోపంగా తిట్టడంతో నాకు ఇంత అవమానం జరిగాక ఇక్కడ ఉండను చేయాల్సిందేదో చేసే వెళ్లిపోతాను. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. శారదాదేవి ఏడుస్తుంటే ఆర్య ఓదారుస్తాడు. అజయ్ ఏమైనా అడిగాడా? అని అడుగుతాడు. దీంతో శారదాదేవి అజయ్‌కి ఆస్థి అధికారం కావాలంటున్నాడు అనగానే ఇచ్చేద్దాం అంటాడు ఆర్య. మరోవైపు అజయ్ మీరా, ఆనందిని తీసుకుని బయటకు వెళ్లిపోతుంటే శారదాదేవి వచ్చి ఆపుతుంది.
అజయ్: ఎందుకమ్మా నేను ఇక్కడ ఎందుకుండాలి.
శారదాదేవి: అయ్యో అజయ్ నీకెలా చెప్పాలి.. ఈ ఇంట్లో ఉండే హక్కు నీకుందనే కదరా నిన్ను ఈ ఇంటికి తీసుకొచ్చాను.
మీరా: హక్కు ఉంటే సరిపోదు అత్తయ్యా గారు. నాది అనే అధికారం కూడా ఉండాలి.
అనగానే అజయ్ మీరా వెళ్లిపోతుంటే శారదాదేవి నీకు ఏది కావాలంటే అది ఇస్తాను ఏం కావాలో చెప్పరా అని అడగడంతో నీరజ్ కోపంగా వచ్చి శారదను వారించి అజయ్‌ని తిడతాడు. దీంతో అజయ్ కోపంగా నీరజ్ కాలర్ పట్టుకుంటాడు. ఇద్దరూ గొడవ పడుతుంటే ఇంతలో ఆర్య వచ్చి ఇద్దర్ని వారిస్తాడు అయినా ఇద్దరూ గొడవపడుతుంటే శారదాదేవి నీరజ్‌ను కొడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.