![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Prema Entha Madhuram Serial Today March 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: బోర్డు మీటింగ్‌కు వస్తానన్న ఆర్య – ఆర్యను చంపేందుకు అజయ్ కొత్త ప్లాన్
Prema Entha Madhuram Today Episode: ఆర్య ఐసీయూలోంచి వీడియో కాల్ మాట్లాడటంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
![Prema Entha Madhuram Serial Today March 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: బోర్డు మీటింగ్‌కు వస్తానన్న ఆర్య – ఆర్యను చంపేందుకు అజయ్ కొత్త ప్లాన్ Prema Entha Madhuram serial today episode March 12th written update Prema Entha Madhuram Serial Today March 12th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: బోర్డు మీటింగ్‌కు వస్తానన్న ఆర్య – ఆర్యను చంపేందుకు అజయ్ కొత్త ప్లాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/11/9a0b5dd52d39ee751f4c9149ddb2d2831710175099562879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Prema Entha Madhuram Telugu Serial Today Episode: అజయ్, మీరా కలిసి ఆఫీసులో బోర్డు మీటింగ్ ఏర్పాటు చేశారని తెలిసి నీరజ్, కేశవ ఆఫీసుకు వస్తారు. నీరజ్ కోపంగా అజయ్‌ని మా ఆఫీసుకు వచ్చి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తావా అంటూ నిలదీస్తాడు. దీంతో అజయ్ మీ ఆఫీసు కాదు మన ఆఫీసు. ఇందులో నాకు 35 పర్సెంట్ షేర్స్ ఉన్నాయి అంటాడు. అయితే నువ్వు బోర్డు మెంబర్ వి కావొచ్చు కానీ చైర్మన్‌వి కావు అంటాడు కేశవ. అయితే బోర్డు మెంబర్స్ ఒప్పుకుంటే అజయ్ చైర్మన్ కావొచ్చని మీరా చెప్తుంది. దీంతో నీరజ్ బోర్డ్ మెంబర్స్ ను చైర్మన్ ఎవరు కావాలని అడుగుతే ఇద్దరు తప్ప అందరూ ఆర్యవర్ధన్ చైర్మన్ కావాలని చెప్తారు.
కేశవ: వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్
బోర్డు మెంబర్: సార్ మీరు తప్పుగా అనుకోకండి. ఒకవేళ ఆర్య సార్‌కు ఏదైనా..
కేశవ: నో.. నెవర్.. ఆర్యవర్ధన్ అంటే ఓటమి కాదు గెలుపు. ఆర్యవర్థన్‌కు నిలదొక్కుకోవడం. తనతో పాటు నలుగురిని నిలబెట్టడం మాత్రమే తెలుసు. గాలికి ఊగిసలాడటానికి, పడిపోవడానికి ఆర్యవర్థన్ గడ్డిపోచ కాదు. అగ్నిశిఖరం. లుక్ ఎట్ దేర్
అంటూ వీడియో కాల్ చూపిస్తాడు. అందులో అను ఆర్యను పట్టకుని ఉంటుంది. ఆర్య చూస్తుంటాడు. ఆక్సిజన్ తీసేసి..
ఆర్య: అక్కడ ఏం జరుగుతుందో.. మీ అందరి మనస్సుల్లో ఏం ఆలోచనలు ఉన్నాయో ఏ భయాలు ఉన్నాయో నాకు తెలుసు. మీ భయాలు పొగొట్టడానికి మీ ఆలోచనలు సరిచేయడానికి నేను రేపు ఆఫీసుకు వస్తున్నాను.
అని ఆర్య చెప్పగానే నీరజ్, కేశవ హ్యాపీగా ఫీలవుతారు. మీరా, అజయ్ షాక్ అవుతారు. బోర్డు మెంబర్స్ అందరూ చర్చించుకుంటారు. నీరజ్, కేశవ అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత అను, పద్దు, మాన్షి గుడికి వెళ్తారు. అను దేవుడికి మొక్కుతుంది. ఇంతలో మాన్షికి ఫోన్ కాల్ వస్తుంది. ఇదేదో కొత్త నెంబర్ లా ఉంది అని మాన్షి గుడిలోంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేస్తుంది. ఎవరని అడుగుతుంది.
మీరా: నేను మీరాను నీతో అవసరం ఉండి ఫోన్ చేశాను.
మాన్షి: లేకపోతే నాకెందుకు కాల్ చేస్తారులే చెప్పు. ఏంటి విషయం.
మీరా: చూడు గతంలో నీకు నాకు పడేది కాదు. ఒకరికొకరం చాలా అపోజ్ చేసుకున్నాం. అదంతా గతం. ఇప్పుడు మనం ఒకరికొకరం సపోర్టు చేసుకుందాం
అని మీరా అడగ్గానే సరే నేను చేస్తాను. తర్వాత నాకు కూడా మీరు సపోర్టు చేయాలి. అని ఇప్పుడు నేనేం చేయాలో చెప్పు అనగానే రేపు ఆర్య బోర్డు మీటింగ్‌కు రాకుండా చేయాలని మీరా అడుగుతుంది. మాన్షి సరే అంటుంది. ఇంతలో అజయ్ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావని అడిగితే మాన్షితో అని మీరా చెప్పగానే ఆర్యను క్లోజ్ చేయడానికి నేను ప్లాన్ చేశానని మాన్షితో అవసరం లేదని అజయ్ చెప్తాడు. మరోవైపు గుడిలో ఉన్న అను పొర్లు దండాలు పెడుతుంది. అది చూసి మాన్షి ఫీలవుతుంది. ఈ అను చేసే పూజల వల్ల ఆర్యకు నయమవుతుందేమోనని అనును ఎలాగైనా ఆపాలనుకుంటుంది. పగిలిపోయిన గాజు ముక్కలు వేస్తుంది. అవి గుచ్చుకోగానే అను ఏడుస్తుంది. మాన్షి వచ్చి ప్రదిక్షణలు ఆపమని చెప్తుంది. అయినా అను వినకుండా పొర్లు దండాలు పెడుతుంది. మరోవైపు అజయ్ పంపించిన కిరాయి రౌడీలు డాక్టర్ల వేషం వేసుకుని అర్యను కిడ్నాప్ చేయడానికి హాస్పిటల్‌కు వెళ్తారు. అక్కడ నీరజ్, శారదాదేవి ఉండటం చూసి దాక్కుంటారు. ఇంతలో సిస్టర్ వచ్చి ఇంజక్షన్ మా దగ్గర దొరకదు బయట తీసుకురావాలని చెప్తుంది. దీంతో నీరజ్ బయటకు వెళ్లిపోతాడు. ఫ్లోర్ క్లీనింగ్ వాళ్లు వస్తారు. మీరు హాల్ లో కూర్చోండి అని చెప్పగానే శారదాదేవి వెళ్లిపోతుంది. దీంతో సిస్టర్ రౌడీలకు ఫోన్ చేసి రండి అని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: రష్మిక, విజయ్‌ల ‘పింక్ క్యాప్’ సీక్రెట్ - మళ్లీ దొరికిపోయారంటున్న అభిమానులు, ఇదిగో ఫ్రూఫ్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)