Prema Entha Madhuram Serial Today June 6th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: వర్థన్ ఫ్యామిలీని ఊరొదిలి వెళ్లిపోమ్మన్న స్వామి – వంటలు చెడగొట్టిన నీలకంఠం
Prema Entha Madhuram Today Episode : వ్రతం కోసం చేసిన వంటలు చెడగొట్టాలని నీలకంఠం విశ్వ ప్రయత్నం చేస్తాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ కొంచెం ఫన్నీగానూ మరికొంత ఆసక్తిగానూ జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode : వర్దన్ కుటుంబంలో వ్రతం చేయడానిని అన్ని ఏర్పట్లు చేస్తారు. ఊరి జనం కూడా వ్రతానికి వస్తుంటారు. అంతా హడావిడిగా ఉంటుంది. ఇంట్లో వ్రతానికి రెడీ అవుతున్న ఆర్య పంచె కట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇంతలో అను వచ్చి ఆర్యకు పంచె కడుతుంది. దీంతో ఆర్య అనుకు థాంక్స్ చెబుతాడు.
ఆర్య: మన ఇంట్లో ఎప్పుడు వ్రతం జరిగినా నువ్వు మహాలక్ష్మిలా నగలు వేసుకుని వ్రతంలో కూర్చునే దానివి. కానీ ఇప్పుడు
అను: సార్ నువ్వు పక్కన ఉండటమే నాకు పెద్ద అలంకారం ఇక నగలతో నాకేం పని రండి సార్.
భానుకు తాకట్టు పెట్టమని ఇచ్చిన నగలు టేబుల్ మీద కనిపిస్తాయి. సార్ ఈ నగలు తాకట్టుపెట్టమని భానుకు ఇచ్చాము కదా అని అందులో ఉన్న లెటర్ చదువుతుంది. అందులో మా అక్క ఎప్పడు లక్ష్మీదేవిలా ఉండాలి అని రాసి ఉంటుంది. సరే అని ఇద్దరూ వ్రతానికి వెళ్తారు. వర్థన్ ఇంటి దగ్గరకు నీలకంఠం వస్తాడు. అటు ఇటు తిరుగుతుంటే.. అమ్మాయి కోసం చూస్తున్నారా? అని కోటి అడిగితే తల్లీకూతుళ్లను ఇంట్లో పెట్టి తాళం వేసి వచ్చానని మనం పెరట్లోకి వెళ్దాం పద అని వెళ్లిపోతారు. మరోవైపు లోపల వ్రతం జరుగుతుంటే దీపం ఆరిపోతుంది. అందరూ షాక్ అవుతారు. ఇంతలో అక్కడ కిటికీ ఓపెన్ గా ఉంది అందుకే గాలి వచ్చి దీపం ఆరిపోయిందని కిటికి క్లోజ్ చేస్తాడు అజయ్. తర్వాత పూజ జరుగుతుంది. మరోవైపు వంటల దగ్గరకు వెళ్లిన నీలకంఠాన్ని వంటలు చేసే వ్యక్తి ఇక్కడికి ఎందుకొచ్చారని అడుగుతాడు.
నీలకంఠం: అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూడటానికి వచ్చాము. ఇంతకీ ఏంమేం చేస్తున్నారు.
వంటల వ్యక్తి: పాయసం, పులిహోర, సాంబారు, పప్పు అన్నం. వ్రతానికి ఇంకేం చేస్తామండి.
నీలకంఠం: మంచిది మంచిది నువ్వు త్వరగా చేసుకో..
కోటి: భోజనాల కోసం ఇక్కడే గోతికాడ నక్కల్లా కాచుకుని కూర్చున్నట్లు ఉంది వెళ్లిపోదాం పదండి అయ్యగారు.
నీలకంఠం: ఎక్కడికిరా వెళ్లేది. అసలు మనం చెడగొట్టాల్సింది వంటలనే. ఈ భోజనాలు కల్తీ అయిపోవాలి. ఊరి జనాలు మొత్తం పస్తులుండాలి. ఆ ఆర్యను అందరూ దుమ్మెత్తిపోయాలి. నువ్వు వెళ్లి నేను చెప్పినట్లు చేయ్.
కోటి: దేవుడి కోసం చేసిన పూజల్లో జనాలకు తిండి లేకుండా చేస్తే పాపం అండి.
అనగానే నువ్వు నేను చెప్పింది మాత్రమే చేయ్ అంటూ నీలకంఠం వంటలు ఎలా చెడగొట్టాలో కోటికి చెప్తాడు. కోటి చెయ్యనని చెప్పినా బలవంతంగా చెయ్యమంటాడు. కోటి చేయడు. దీంతో నీలకంఠం వంటలు చెడగొట్టబోయి చేతులు కాల్చుకుంటాడు. మరోవైపు అవధూత స్వామి ఇంటి బయట నిలబడి కిటికీలోంచి వ్రతం చూస్తూ ఏదేదో మాట్లాడుతుంటే శారదాదేవి వచ్చి ఆయన కాళ్లు మొక్కుతుంది.
శారద: నిన్న మీరు వచ్చి మా ఆర్యను హెచ్చరించారు. అప్పటి నుంచి నా మనసు ఏం బాగాలేదయ్యా. ఇప్పుడు కూడా మా ఆర్య, అనులను చూసి మీరు ఏదో అంటున్నారు. ఏదైనా సమస్య ఉందా? ఉంటే ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చెప్పండయ్యా?
స్వామి: వెళ్లిపోండి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోండి. ఈ పూజలు వ్రతాలు అన్ని వృథా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. దేవుడున్నాడే పెద్ద మాయగాడు. అంతా మాయ చేస్తాడు. నాటకం జరగుతుంది. జగన్నాటకం కాలం దాని మాయ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కానీ ప్రయత్నించు కాలానికి ఎదురీదు. కాపాడుకో.. వెళ్లిపోండి..
అని స్వామి వెళ్లిపోతాడు. ఆయన దేని గురించి హెచ్చరిస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఒక్కటీ అను, ఆర్యలను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి అనుకుంటుంది శారదాదేవి. మరోవైపు వంటల దగ్గర నీలకంఠం వంటలు చేసేవాళ్లను అందర్నీ అక్కడి నుంచి పంపించి వంటలన్నీ చెడగొడతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: 'మనమే' ఫస్ట్ రివ్యూ... ఒక్క బోర్ మూమెంట్ లేదు, పక్కా హిట్ - శర్వా సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?