అన్వేషించండి

Prema Entha Madhuram Serial Today June 4th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: భానును ఇంట్లోంచి గెంటివేస్తానన్న నీలకంఠం - తన గోల్డ్ అమ్మేయమని భానుకు ఇచ్చిన అను

Prema Entha Madhuram Today Episode: ఊరిలో తన పరువు తీసిదని భానును ఇంట్లోంచి గెంటివేస్తానని నీలకంఠం అనడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode: వర్థన్‌ ఫ్యామిలీ మొత్తం చెరువు దగ్గర బట్టలు ఉతుకుతుంటే భాను అందరూ త్వరగా ఉతకండి లేటు అయితే ఇక్కడ బర్రెలు కడగడానికి వస్తారు అని చెప్పడంతో అందరూ నామోషీగా ఫీలవుతారు. మా బట్టలు ఇక్కడ ఉతుక్కోవడం ఏంటని భాను క్లారిటీగా అడిగితే ఒక్క బర్రెలే కాదు ఆవులు, దున్నలు, పందులు కూడా ఇక్కడే కడుగుతారని చెప్పడంలో అందరూ షాక్‌ అవుతారు. మరోవైపు నీలకంఠం కోపగా ఇంటికి వచ్చి ఇంట్లో సామాన్లు పగులగొడుతుంటాడు. ఇంతలో ఆయన భార్య వస్తుంది.

నీలకంఠం భార్య: ఏమైందండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు. ఏం జరిగింది.

నీలకంఠం: ఏం జరిగిందా? నా పరువు మొత్తం గంగలో కలిసింది. లాభం లేదు ఇంట్లో ఉంటే నేనన్నా ఉండాలి నా కూతురన్నా ఉండాలి.

భార్య: ఇప్పుడు ఉన్నపళంగా మీరు ఎక్కడికి వెళ్తారండి.

నీలకంఠం: అంటే ఏంటే నీ ఉద్దేశం నన్ను ఇంట్లోంచి పొమ్మంటావా?

భార్య: అసలు ఇప్పుడేం జరిగిందని మీరు ఇంతలా అరుస్తున్నారు.

అని అడగ్గానే భాను, ఆర్య వాళ్లతో కలిసి బట్టలుతకడానికి చెరువుకు పోయిందని ఊరిలో నా పరువు పోయిందని కోపంగా చెప్తాడు. ఇంట్లోంచి వెళ్లి భాను సూట్‌కేసు బయటకు పడేస్తాడు. మరోవైపు చెరువు దగ్గర అను బట్టలు ఆరేస్తుంది. ఇంతలో మాన్షి, మీరా అను దగ్గరుకు వస్తారు.

మాన్షి: అను నువ్వు బట్టలు ఉతకడం త్వరగానే అయిపోయిందే..?

మీరా: తనకంటే అలవాటు పైగా హెల్పింగ్‌కు చెల్లెలు కూడా వచ్చింది కదా

మాన్షి: అయినా నువ్వేంటి అను అసలు ఆ అమ్మాయికి అంత చనువు ఇచ్చేశావు. బ్రోయిల్లా మంచివారే కావొచ్చు. కానీ పరిస్థితులు ఎలా అయినా మారొచ్చు కదా? కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చేజారిపోతారు.

మీరా: ఆల్‌ రెడీ సగం జారినట్టే ఉన్నారు ఒకసారి అక్కడ చూడు.

అనగానే ఆర్య ఫోన్‌ మాట్లాడుతుంటే వెనకే నిలబడ్డ భాను ఆర్యను అనుకరిస్తుంది. ఫోన్‌ కట్‌ చేసిన ఆర్య భానును చూసి ఏంటి నన్ను ఇమిటేట్‌ చేస్తున్నావా? అని చెవ్వు పట్టుకుంటాడు. నెత్తిమీద మొట్టికాయ వేస్తాడు. దీంతో కోపంగా  అను దగ్గరకు వెళ్లి ఇక చాలు ఇంటికి వెళ్దామా అంటుంది. సరే వెళ్దాం పద భాను అంటాడు ఆర్య దీంతో మరింత కోపంగా అను సార్‌ నేను అను అనగానే ఆర్య కన్‌ఫ్యూజ్‌ అవుతుంటాడు. మరోవైపు శారదాదేవి దగ్గరకు పంతులు వచ్చి మీరు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించండి అని చెప్తాడు. ఇంతలో ఆర్య వాళ్లు వస్తారు. వ్రతం చేయాలని డిసైడ్‌ అవుతారు. అయితే డబ్బుల లేవని ఆలోచిస్తుంటారు. తర్వాత అను, ఆర్య దగ్గరుకు వస్తుంది.

అను: సార్‌ ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఏర్పాటు కావు . అందుకే నా బంగారు నగలు అమ్మేద్దాం సార్‌.

అని తన నగలు తీసి ఆర్యకు ఇస్తుంది అను. మరోవైపు మీరా తన గోల్డ్‌ ఇవ్వడానికి ఒప్పుకోదు. ఇంకోవైపు నీరజ్‌ తన దగ్గరున్న  గోల్డ్‌ రింగ్‌ సరిపోదని మాన్షి దగ్గరున్న వెడ్డిగ్‌ రింగ్‌ ఇవ్వమని అడిగితే  ఇవ్వదు. ఇంతలో నీరజ్‌ మనం ఎక్కువ డబ్బులు ఇస్తే దేవుడు మనకు ఎక్కువ ఆస్థి ఇవ్వొచ్చు కదా అని చెప్పగానే రింగ్‌ ఇస్తుంది మాన్షి. తర్వాత భానును పిలిచి అను బంగారు ఇచ్చి తాకట్టు పెట్టి తీసుకురా అని చెప్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: నటి హేమకు రిమాండ్, జైలుకు తరలింపు - కోర్టు బయట హైడ్రామా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
CM Revanth Reddy: తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
తెలంగాణలో హరిత విప్లవం దిశగా సంస్కరణలు - సీఎం రేవంత్ పాలనలో విప్లవాత్మక నిర్ణయాలు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Lava Blaze Duo 5G: రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
రూ.15 వేలలోపే రెండు డిస్‌ప్లేల ఫోన్ - లావా బ్లేజ్ డ్యుయో 5జీ వచ్చేసింది!
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
KTR: 'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
'భూములు ఇవ్వని రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు' - రైతుల తరఫున పోరాడతామన్న కేటీఆర్
Embed widget