Prema Entha Madhuram Serial Today January 10th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: అకి, అభయ్ మధ్య గొడవ – ఇద్దరికి సారీ చెప్పించిన శంకర్
Prema Entha Madhuram Today Episode: రవి, అభయ్ ల మధ్య గొడవ జరుగుతుంది. శంకర్ ఇన్వాల్వ్ అవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: రవి, అభయ్‌ల మధ్య గొడవ అవుతుంది. ఒకరి గల్లా ఒకరు పట్టుకుని కొట్టుకుంటుంటారు. ఇంతలో యాదగిరి వచ్చి రవిని కొడతాడు. నిన్ను చంపేయాలిరా అంటూ ఆవేశంతో ఊగిపోతూ మళ్లీ కొట్టబోతుంటే.. శంకర్ వచ్చి ఆపి బాబాయ్ ఏం చేస్తున్నావు.. రవి ఏమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నావా..? అంటాడు. చిన్న పిల్లాడు సార్ వీణ్ని చంపేయాలి అంటాడు. నువ్వు ఇటురా బాబాయ్ అంటూ యాదగిరిని పక్కకు తీసుకెళ్తాడు శంకర్. రవిని ఓదార్చాలని పైకి వెళ్తుంది మాయ.
మాయ: ఏం రవి ఎందుకు అంత కోపం మనం అనుకున్నట్టుగానే గొడవ జరిగింది కదా..? కాకపోతే గొడవ మధ్యలో ఆగిపోయింది. ఇంకా ఎందుకు బాధపడుతున్నావు.
రవి: నేను కోపం చేసేది అందుకు కాదు. నేను మీకు సాయం చేస్తున్నానని మా నాన్నకు తెలిసిపోయింది.
మాయ: ఎలా తెలుస్తుంది. శంకర్ కానీ జెండే కానీ చెప్పరు కదా..?
రవి: ఏమో కానీ మా నాన్న కళ్లల్లో నా మీద కోపం కన్నా నేను ద్రోహం చేస్తున్నవాడిలా కనబడుతున్నాను
అని చెప్పగానే తెలియలే తెలిస్తే ఏంటి అంటుంది మాయ. మరోవైపు పక్కకు తీసుకెళ్లిన యాదగిరి నువ్వెందుకు చేయి చేసుకున్నావు అని అడుగుతారు.
యాదగిరి: నేను కొట్టింది అందుకు కాదు సార్. వాడు వర్ధన్ కుటుంబానికి ద్రోహం చేస్తున్నందుకు.. మీకు ద్రోహం చేస్తున్నందుకు.
శంకర్: బాబాయ్ ఏం మాట్లాడుతున్నారు మీరు..
జెండే: అవును యాదగిరి నువ్వేదో పొరపాటు పడుతున్నావు.
యాదగిరి: ఇంకా ఎందుకు సార్ నా దగ్గర నిజం దాస్తున్నారు. నాకు అంతా తెలుసు. వాణ్ని ప్రాణాలతో వదలను వాడు నా కడుపున చెడ పుట్టాడు వెధవ.
జెండే: ఇదిగో ఇలా ఆవేశ పడతావనే నీతో చెప్పలేదు.
యాదగిరి: ఆవేశం కాదు సార్… వాణ్ని..
శంకర్: ఈ విషయం నీకు తెలుసు అన్న విషయం కూడా రవికి తెలియకూడదు.
యాదగిరి: నాకు ఎదురు వస్తే ఏం జరుగుతుందో వాడికి తెలుసు సార్.
అంటూ యాదగిరి ఆవేశపడుతుంటే.. శంకర్, జెండే యాదగిరి కన్వీన్స్ చేస్తారు. రవిని మాయ కన్వీన్స్ చేస్తుంది. మీ నాన్నకు నిజం తెలియదు. నువ్వు అభయ్ మీద గొడవ పడ్డావనే మీ నాన్న నిన్ను కొట్టాడంతే.. అభయ్ సారీ చెప్పే వరకు నువ్వు వదలకు అని రెచ్చగొడుతుంది. మరోవైపు గౌరి, అభయ్‌ని తిడుతుంది. శంకర్ వచ్చి కూడా అదే విషయం చెప్తాడు. అభయ్ ని వచ్చి రవికి సారీ చెప్పమంటాడు. నేను సారీ చెప్పడం ఏంటని అనగానే నువ్వు చెప్పే సారీ రవికి కాదు అకి భర్త స్థానానికి అని కన్వీన్స్ చేస్తాడు. మరోవైపు రవి, మాయ మాట్లాడుకోవడం జెండే వింటాడు. రూంలో అకి ఏడుస్తుంటే.. శంకర్ వచ్చి ఓదారుస్తాడు. అకిని బయటకు తీసుకెళ్తాడు. హాల్లోకి వచ్చిన అందరూ సైలెంట్‌గా ఉంటారు.
శంకర్: ఏంటి ఎవరికి వారే సైలెంట్‌గా ఉంటే ఎలా.. రవి నువ్వు అభయ్ తో అలా మాట్లాడొచ్చా.. అభయ్ నువ్వేంటి తను ఈ ఇంటి అల్లుడు.. తనకు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా..? సారీ చెప్పు రవికి..
మాయ: చచ్చినా చెప్పడు ( మనసులో అనుకుంటుంది.)
అభయ్: ఐ యామ్ సారీ రవి..
రవి: అభయ్ సారీ చెప్పాడు ఇప్పుడు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి ( మనసులో అనుకుంటాడు.)
యాదగిరి: అభయ్ బాబు సారీ చెప్పింది వినబడలేదా..? సారీ చెప్పే సంస్కారం లేదా..?
రవి: ఇట్స్ ఓకే..
యాదగిరి: ఇట్స్ ఓకే ఏంట్రా.. తిరిగి చెప్పే సంస్కారం లేదా..?
రవి: నేను కూడా సారీ.. అలా మాట్లాడకుండా ఉండాల్సింది.
శంకర్: ఆ జెండే సార్ ఇంకా ఎవరెవరికి ఎవరు సారీ చెప్పాలి.
జెండే: ఇంకా యాదగిరి, రవికి చెప్పాలి.
అని జెండే చెప్పగానే.. యాదగిరి, రవి షాక్ అవుతారు. ఇంతలో అందరూ కలిసిపోతారు. అకి కూడా అభయ్‌కి సారీ చెప్తుంది. మన మధ్య సారీ ఎందుకు అకి అంటాడు అభయ్. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!