Prema Entha Madhuram Serial Today December 23rd: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్‌కు ఫోన్ చేసి నిజం చెప్పిన రాకేష్ – తానే భూపతిరాజా అంటూ బిల్డప్ కొట్టిన ఓనరు
Prema Entha Madhuram Today Episode: ఇంట్లో సెలబ్రేషన్స్ చేస్తున్న శంకర్‌కు రాకేష్ ఫోన్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
Prema Entha Madhuram Serial Today Episode: జెండే దివాన్ జీ లాగా వేషం వేసుకుని వస్తాడు. జెండేకు కూడా పునర్జన్మ ఉందన్నమాట అనుకుంటాడు ఓనరు. దివాన్ జీ నాకు భవిష్యత్తు కూడా తెలుసు.. వచ్చే జన్మలో కూడా నువ్వు నా ఇంటి చుట్టే తిరిగెదవు. ఈ సేవకుడు కూడా నా చుట్టే తిరుగును అని చెప్పగానే ఇంతలో జెండే మీ వారసులు మీతో ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారా పిలిచెదను అంటూ ఆర్యవర్దన్ గారు విచ్చేయండి అని పిలవగానే శంకర్ వస్తాడు.
ఓనరు: ఏమిటి మనవడు గారు ఇలా వచ్చారు.
శంకర్: అది తాతగారు నేను ఏ నిర్ణయం తీసుకున్నా మీతో చెప్పకుండా చేయను కదా..?
ఓనరు: ఆహా రౌడీలా విరుచుకుపడే శంకర్ ఇంత కూల్ గా ఉన్నాడేంటి..? ( అని మనసులో అనుకుంటాడు.) అదేమిటో చెప్పండి.
శంకర్: అది నేను ఒక అమ్మాయి మీద మనసు పడ్డాను తాతగారు. మీరు అంగీకరిస్తే నేను ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాను. తన వివరాలు చెప్పమంటారా తాతగారు.
ఓనరు: నాకు తెలుసు.. పేరు అనురాధ.
శంకర్: ఆమె వివరాలు మీరెలా చెప్పగలిగారు తాతగారు.
జెండే: మీ తాత గారికి భూత, భవిష్య, వర్తమానాలు చూడగలుగుతున్నారు.
శంకర్: తాతగారు మీరు చాలా అంటే చాలా గొప్పవారు.
అని శంకర్ చెప్పగానే మంచిది నేను ఇప్పుడు ఆ అమ్మాయిని చూడాలి అనగానే సరే తాతగారు అంటాడు. అది ఉంటేనే కదరా కిడ్నాప్ అయింది అనుకుంటూ మళ్లీ కళ్లు తిరిగి కింద పడిపోతాడు. దీంతో మనకు ఇదంతా అవసరమా శంకర్ అని జెండే అడగ్గానే ఇప్పుడు వీడు మన ఫ్యామిలీ అని పూర్తిగా నమ్మేశాడు ఇక గౌరి దొరికినట్టే అని మనం సెలబ్రేషన్స్ స్టార్ట్ చేయాలి. అసలు గేమ్ ఇప్పుడే స్టార్ట్ కాబోతుంది అని శంకర్ చెప్తాడు. మరోవైపు గౌరిని బంధించిన రాకేష్ కిటికీలోంచి గౌరిని చూసి తను ఏమైనా తినిందా..? అని అడుగుతాడు. లేదని రౌడీ చెప్తాడు. ఈ అమ్మాయిని చంపేద్దాం అంటాడు. ఇది ప్రాణాలతో ఉంటేనే మనం బతికి ఉంటాం. లేదంటే ఆ శంకర్ గాడు మనల్ని బతకనివ్వడు అని శంకర్‌కు ఫోన్ చేస్తాడు రాకేష్.
శంకర్: హాయ్ రాకేష్ నీ నుంచి ఫోన్ వస్తుందని నేను గెస్ చేశాను. విషయం ఏంటో చెప్తావా..? ఎందుకంటే ఇంట్లో సెలబ్రేషన్స్ జరగుతున్నాయి.
రాకేష్: అరేయ్ శంకర్ నేను గౌరిని కిడ్నాప్ చేశాను. తీసుకొచ్చి బంధించాను. అది తిండి కూడా తినకుండా మొండి పట్టు పట్టుకుని కూర్చుంది. తిండి లేక నిద్ర లేక కృంగి కృషించిపోతుంది.
శంకర్: అబ్బా రాకేష్ నీకు చాదస్తం చాలా ఎక్కువైంది. గౌరి గారు నీ దగ్గర బంధీగా ఉంది. అయితే ఏంటి..?
రాకేష్: అయితే ఏంటా..? రేయ్ నీకు గౌరి గురించి దిగులే లేదా.?
శంకర్: ఇదిగో రాకేష్ నీ మీద నేను ఎప్పుడో గెలిచాను. ఇప్పుడు నువ్వు గౌరి గారిని కిడ్నాప్ చేస్తే నాకేంటి..? ఆవిడ ఏమైనా నా చుట్టమా…? లేక నా పెళ్లామా..?
రాకేష్: అవును అది నీ పెళ్లామే.. అసలు నువ్వు ఎవరో తెలుసా..? గత జన్మలో నువ్వు ఆర్యవర్ధన్. ఈ గౌరి ఎవరో కాదు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న అనురాధ. మీరిద్దరూ అకి, అభయ్‌లకు తల్లిదండ్రులు. అప్పటి అనురాధే ఇప్పటి గౌరిరా ఇది. నీ ప్రాణంరా అది.
జెండే: శంకర్ ఏమైంది..
శంకర్: ఆ రాకేష్ గాడు ఫోన్ చేశాడు సార్. ఇక్కడ జరగుతున్నదంతా తెలుసుకుంటున్నాడు.
అని చెప్పగానే జెండే వెంటనే నువ్వు వాడిని అలాగే మాటల్లో పెట్టు నేను వాడి లోకేషన్ ట్రాప్ చేస్తాను అంటాడు. రాకేష్ అ విషయం పసిగట్టి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో కంగారు పడకండి సార్ నా అంచనా కరెక్టు అవుతుంది. అందుకే వాడు నాకు ఫోన్ చేశాడు అని చెప్తాడు. మరోవైపు ఓనరును నిద్ర లేపిన యాదగిరి తిడుతుంటే.. జెండే, శంకర వచ్చి చూసి ఓనరు ట్రాప్‌లో పడ్డాడని అనుకుంటారు. సెలబ్రేషన్స్ ఏర్పాట్లు జరుగుతుంటే అకి బాధ పడుతుంది. నాన్న మాట కాదనలేక రెడీ అయ్యాను అన్నయ్య అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!