అన్వేషించండి

Prabhakar Podakandla: దూరదర్శన్‌తో కెరీర్ స్టార్ట్.. బుల్లితెర మెగాస్టార్ స్థాయికి.. యాక్టర్, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

Prabhakar Podakandla: బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ పొడకండ్ల. తన విలక్షణమైన యాక్టింగ్, వాయిస్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రభాకర్ ఖమ్మం హోమ్‌గార్డ్‌గా పనిచేసి, గోల్డ్ మెడల్ సాధించారు.
  • ఈటీవీ క్రియేటివ్ మేనేజర్‌గా, హోస్ట్‌గా కెరీర్ మలుపు తిరిగింది.
  • అనేక సీరియల్స్, సినిమాలలో నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించారు.
  • ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకుంటూ ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నారు.

Prabhakar Podakandla: తెలుగు బుల్లితెరపై విలక్షణమైన యాక్టింగ్‌తో దశాబ్దాలుగా అలరిస్తూ "బుల్లితెర మెగాస్టార్" గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాకర్ పొడకండ్ల అలియాస్ ఈటీవీ ప్రభాకర్. ఆయన రియల్ లైఫ్, కెరీర్, రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

రియల్ లైఫ్  

ప్రభాకర్ తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. ఆయన ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చారు. పదో తరగతి కంప్లీట్ అయ్యాక ఖమ్మంలో హోమ్ గార్డ్‌గా పనిచేశారు. ఆ తర్వాత వచ్చిన సంపాదనతో చదువుకుని నిజాం కాలేజీలో థియేటర్ ఆర్ట్స్ చేసి, అప్పటి గవర్నర్ సి. రంగరాజన్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. ప్రభాకర్ భార్య పేరు మలయజ. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రభాకర్ కుమారుడు శ్రీరామ్ కూడా హీరోగా పరిచయమయ్యాడు.

కెరీర్ 

దూరదర్శన్‌లో వచ్చిన 'చాణక్య' సీరియల్‌లో చిన్న పాత్రతో ఆయన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన 'రుతురాగాలు' సీరియల్ ఆయన కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈటీవీ అధినేత సుమన్ ప్రోత్సాహంతో ప్రభాకర్ ఈటీవీలో క్రియేటివ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టారు. 'యాహూ', 'స్టార్ వార్', 'స్మైల్ రాజా స్మైల్' వంటి ఎన్నో సూపర్ హిట్ గేమ్ షోలను డిజైన్ చేసి, హోస్ట్‌గా కూడా అలరించారు. అందుకే ఈయనను ఇప్పటికీ చాలామంది "ఈటీవీ ప్రభాకర్" అని పిలుస్తారు.

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ భద్రావతి.. దుర్గాదేవి గురించి ఆసక్తికర విషయాలు

జీ తెలుగులో వచ్చిన 'ముద్దు బిడ్డ' సీరియల్ ఆయనకు నటుడిగా, నిర్మాతగా భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత 'అన్నా చెల్లెలు', 'వదినమ్మ', 'దీపారాధన', ఇటీవల వచ్చిన 'చామంతి' వంటి ఎన్నో విజయవంతమైన సీరియల్స్‌లో నటించారు. మాటీవీలో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌లో రామరాజుగా నటిస్తున్నారు. టీఆర్పీ పరంగా ఈ సీరియల్ టాప్‌లో నిలిచింది. 

ప్రభాకర్ కేవలం బుల్లితెరకే పరిమితం కాలేదు. వెండితెరపై దాదాపు 120కి పైగా సినిమాల్లో నటించారు. అలాగే ఉదయ్ కిరణ్, ఆర్యన్ రాజేష్, అబ్బాస్, ప్రభుదేవా వంటి వారికి సుమారు 60 మంది హీరోలకు సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు.

సోషల్ మీడియా

ప్రభాకర్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ముఖ్యంగా ఆయన భార్య మలయజ, పిల్లలతో కలిసి చేసే ఫ్యామిలీ రీల్స్, యూట్యూబ్ వ్లాగ్స్, టీవీ షోల ప్రమోషన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటూ తన వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ అప్‌డేట్స్‌ పంచుకుంటారు. 

Also Read: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 8 నెలల తర్వాత మళ్లీ మోపిదేవికి ప్రేమ! చిక్కుల్లో పడుతుందా! వల్లీకి దొరికిపోతుందా!

రెమ్యూనరేషన్  

బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ప్రభాకర్ ఒకరు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, ఆయన సీరియల్స్‌లో నటించడానికి రోజుకు రూ.25,000 నుండి రూ.35,000 వరకు పారితోషికం అందుకుంటారని అంచనా. ఆయనకున్న సీనియారిటీ, క్రేజ్ దృష్ట్యా ఈ స్థాయి రెమ్యూనరేషన్ లభిస్తుంది.

ఆసక్తికర విషయాలు

ఒక ఇంటర్వ్యూలో ప్రభాకర్ మాట్లాడుతూ.. తాను నిర్మించిన సీరియల్స్ అన్నీ రేటింగ్స్ పరంగా సూపర్ హిట్ అయినప్పటికీ, నిర్మాతగా ఆర్థికంగా తాను పెద్దగా సక్సెస్ కాలేకపోయానని, ఇప్పటికీ ఇతర నిర్మాతల నుంచి డబ్బు ఎలా ఆదా చేయాలో నేర్చుకోవాలని నిజాయితీగా అంగీకరించారు. ప్రభాకర్ కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొని, హోమ్ గార్డ్ స్థాయి నుంచి టీవీ ఇండస్ట్రీని ఏలే స్థాయికి ఎదగడం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.

Also Read: గుడిలో రాధను చంపేందుకు దమయంతి ప్రయత్నాలు... విక్కీతో కలిసి అమ్మవారికి ముడుపు చెల్లించిన రాధ

Frequently Asked Questions

ప్రభాకర్ పొడకండ్ల నేపథ్యం ఏమిటి?

ఆయన తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందినవారు. పదో తరగతి తర్వాత హోమ్ గార్డ్‌గా పనిచేసి, నిజాం కాలేజీలో థియేటర్ ఆర్ట్స్ చేసి గవర్నర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ అందుకున్నారు.

ప్రభాకర్ కెరీర్‌కు మలుపు తిప్పిన సీరియల్ ఏది?

దూరదర్శన్‌లో వచ్చిన 'చాణక్య' సీరియల్‌తో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాకర్ కు, 'రుతురాగాలు' సీరియల్ మలుపు తిప్పింది. ఈ సీరియల్ ఆయనకు విశేష గుర్తింపు తెచ్చింది.

ప్రభాకర్ ఒక సీరియల్ ఎపిసోడ్‌కు ఎంత పారితోషికం తీసుకుంటారు?

పరిశ్రమ వర్గాల ప్రకారం, ప్రభాకర్ సీరియల్స్‌లో నటించడానికి రోజుకు రూ.25,000 నుండి రూ.35,000 వరకు పారితోషికం అందుకుంటారు. ఆయన సీనియారిటీ, క్రేజ్ దృష్ట్యా ఈ మొత్తం లభిస్తుంది.

ప్రభాకర్ కేవలం నటుడిగానే కాకుండా ఇంకా ఏ బాధ్యతలు నిర్వర్తించారు?

ఆయన ఈటీవీలో క్రియేటివ్ మేనేజర్‌గా బాధ్యతలు చేపట్టి, 'యాహూ' వంటి ఎన్నో సూపర్ హిట్ గేమ్ షోలను డిజైన్ చేసి, హోస్ట్‌గా కూడా అలరించారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 20th: 'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
'గోదావరి' సీరియల్: కిన్నెర సర్జరీకి 25 లక్షలు! సూర్యని గెంటేసిన మురళీ, జాను!
Nindu Manasulu Serial Today August 20th: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ప్రేరణ! చితక్కొట్టిన సిద్ధూ!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 20th:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
నువ్వులేక నేను లేను:రాధపై హత్యాయత్నం చేసినా సుందరి...విక్కీకి దొరికిన ఆధారం ఏంటి..?
Podarillu Serial Today August 20th: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
పొదరిల్లు: శైలూకు కడుపుచేసిన కేశవ్‌పై చేయిచేసుకున్న మాధవ్‌...నారాణయను దుర్గాప్రసాద్‌ ఏం చేశాడు..?
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget