అన్వేషించండి

Podharillu Serial Today Feb 18th: బృందావనంలో ముగ్గులు వేసి దీపం పెట్టి కళకళలాడేలా చేసిన మహాలక్ష్మీ...ఉప్పుతో చేసిన టీ చప్పరించుకుంటున్న తాగిన చక్రి

Podharillu Serial Today Episode February 18th:బృందావనంలో ముగ్గులు వేసి దీపం పెట్టి కళకళలాడేలా చేసిన మహాలక్ష్మీ...ఉప్పుతో చేసిన టీ చప్పరించుకుంటున్న తాగిన చక్రి

Podharillu Serial Today Episode: మహావాళ్ల ఇంట్లో వాళ్లు తిట్టడంతో చాలా మూడీగా ఉంటుంది. దీంతో ఆమె మూడ్‌ మార్చేందుకు  చక్రి బయటకు తీసుకెళ్తానని అంటాడు. ఇంట్లోనే ఉంటే ఇదే ఆలోచిస్తూ బాధపడతారని...సరదాగా  బయటకు వెళ్తే కాస్త రిలాక్స్‌గా ఉంటుందని చెప్పడంతో ఆమె సరేనని అంటుంది. దీంతో చక్రి ఆమెను బైక్‌మీద ఎక్కించుకుని  హైదరాబాద్‌లోని  అన్నిప్రాంతాలు తిప్పుతుంటాడు. ట్యాంక్‌బండ్‌పై  కూర్చున్న వీరిని చూసి పోలీసులు ప్రశ్నించగా...మహానే తన తాళిబొట్టు తీసి చూపిస్తుంది. ఓహో మీరిద్దరూ భార్యాభర్తలా అని అనుకుని ఆ పోలీసు అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత చక్రి మహాను  ఐటీ ఏరియా, ఛార్మినార్‌తో సహా అన్ని ప్రాంతాలు తిప్పి ఇంటికి తీసుకొస్తాడు. మహా,చక్రి బైక్‌పై బయటకు వెళ్లడం చూసి మాధవ్ చాలా సంతోషపడతాడు.
                         ఉదయం నిద్రలేచేసరికి మాధవ్‌ ఒక్కడే అన్ని పనులు చేసుకోవడం చూసి మహాకు కోపం వస్తుంది. అన్నయ్య ఒక్కడే పనులు చేస్తుంటే  వీళ్లంతా నిద్రపోతున్నారని  మండిపడుతుంది. మాధవ్‌ చెబుతున్నా వినకుండా  వాళ్లను నిద్రలేపుతుంది. రేపటి నుంచి 7గంటల కల్లా ఇంట్లో అందరూ నిద్రలేవాల్సిందేనని  హెచ్చరిస్తుంది. ఎవరికి వాళ్లు లేచి వెళ్లిపోతుంటే....పక్కబట్టలు చాప ఎవరు తీస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో చేసేదిలేక అందరూ తాము కప్పుకున్న బట్టలను తీసి మడపతపెట్టుకుని వెళ్లిపోతారు.  ఆ తర్వాత మహా ఇంటి ముందుకు రాగా...అంతా చెత్తాచెదారం ఉండటం చూసి చీపురుపట్టుకుని వెళ్లి మొత్తం ఊడుస్తుంది. మాధవ్‌ అక్కడికి వచ్చి ఈ పనులన్నీ నీకెందుకమ్మా...నేను చేస్తానులే అని చెప్పగా నాకు ముగ్గులు వేయడం వచ్చని చెబుతుంది. ఆమె ఊడ్చగా...కన్నా వెళ్లి నీళ్లు తీసుకొస్తాడు. ఆమె ఊడ్చి, చల్లి ముగ్గులు పెడుతుంది. తొలిసారి వాళ్ల ఇంటి ముందు ముగ్గులు వేయడం చూసి ఇంట్లో ఉన్న అందరూ ఎంతో సంతోషపడతారు.  తొలిసారి మా ఇంటికి కళ వచ్చిందంటూ  కన్నా పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఆ తర్వాత  స్నానం చేసి వచ్చిన మహా దేవుడి పటాలు ముందు దుమ్ము చూసి ఇంట్లో అందరిపై మండిపడుతుంది. రోజూ దీపం పెట్టరా అని అడిగితే....పండుగలకు మాత్రమే పెడతామని చెబుతారు. ఇంతలో ఫోన్‌లో ఆడుకుంటున్న చక్రిని పిలిచి దేవుడి ప్రమిదలు, గంటా అన్నీ శుభ్రంగా కడుక్కుని రమ్మని చెబుతుంది.  నాకు రాదని చక్రి చెప్పగా...ఇప్పటి నుంచి నేర్చుకోమని హెచ్చరిస్తుంది.ఇంతలో మాధవ్ కలుగజేసుకుని నేను వెళ్తానని చెప్పగా...అవసరం లేదు అన్నీ నేర్చుకుంటారని  అంటుంది. కన్నా, మహా  ఇద్దరూ  దేవుడి ఫొటోలన్నీ శుభ్రంగా తుడిచి బోట్లుపెట్టగా...ఇంతలో కేశవ్ బయటకు వెళ్లి పూలు కొనుక్కుని వస్తాడు.  చక్రి పూజాసామాగ్రి శుభ్రం చేసుకుని రాగా....మహా ఇంట్లో దీపం పెట్టి దూపం వేస్తుంది. అది చూసిన కన్నా ఎక్కిఎక్కి ఏడుస్తాడు. తొలిసారి ఈ బృందావనానికి  మహాలక్ష్మీలాంటి  కళ వచ్చిందని కన్నీరు పెట్టుకుంటాడు.  ఆ తర్వాత మాధవ్‌ టీ పెడుతుండగా...ఈరోజు నేను పెడతానని మహా గొడవ చేస్తుంది. నీకు రాదని చెప్పినా వినకుండా  నేను నేర్చుకుంటానని చెప్పి అందరినీ బయటకు పంపి స్వయంగా  టీ పెట్టి అందరికీ ఇస్తుంది. కానీ దానిలో పొరపాటుగా  పంచదారకు బదులుగా ఉప్పు వేయడంతో  అందరూ చాలా ఇబ్బందిగానే  టీ తాగుతారు. మరోసారి ఇలా జరగకుండా  జాగ్రత్తగా టీ చేస్తానని మహా చెబుతుంది.

 

టాప్ హెడ్ లైన్స్

Karthika Deepam 2 Serial Today July 18th: కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
కార్తీకదీపం 2 సీరియల్: అత్తని ఓడించడానికి పోటీకి దిగిన అక్కాచెల్లెళ్లు! దీప, జ్యోత్స్న ఒకటిగా వంటలు చేస్తారా!
Nindu Noorella Saavasam Serial Today July 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చేయడానికి వచ్చిన స్వామిజీ – స్వామిజీని చూసి భయపడ్డ మనోహరి
Nuvvu leka Neanu Lenu Serial Today July 18th:రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
నువ్వులేక నేను లేను: రాధపై దాడి చేసిన వారిని కనిపెడతానని విక్కీ శపథం...మేనల్లుడికి మాటలకు అదిరిపడిన దమయంతి
Illu Illalu Pillalu Serial Today July 18th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: భద్రావతికి వీడియో చూపించి నిజం చెప్పేసిన వల్లీ! ధీరజ్‌ని కత్తితో పొడిచేసిన రౌడీ!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sonam Wangchuk:సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష విరమణ- జంతర్‌మంతర్‌ వద్ద హైటెనషన్
US Iran War Updates 2026: ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
ఏడో రోజూ ఇరాన్‌కు కాళరాత్రి! అమెరికా బాంబుల వర్షం! హోర్మూజ్‌ జలసంధిలో హైటెన్షన్!
The Odyssey Box Office Collection Day 1: ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
ది ఒడిస్సీ ఓపెనింగ్ డే కలెక్షన్స్... తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము దుమారమే... ఇండియాలో ఫస్ట్ డే ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
What Is Stair Test For Heart Blockage: మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసమా? సాధారణ అలసట అనుకుంటే ప్రమాదమే!
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Embed widget