Podarillu Serial Today June 9th: ఆఫీసుకు వెళ్తున్న మహాకు మార్గమధ్యలో ఎవరు ఎదురుపడ్డారు...? ఈవిషయంపై ఆమె నారాయణను ఎందుకు నిలదీసింది...?
Podarillu Serial Today Episode June 9th: ఆఫీసుకు వెళ్తున్న మహాకు మార్గమధ్యలో ఎవరు ఎదురుపడ్డారు...? ఈవిషయంపై ఆమె నారాయణను ఎందుకు నిలదీసింది...?

Podarillu Serial Today Episode: జీ తెలుగు ఛానెల్‌లో అత్యంత ప్రేక్షక ఆదరణతో దూసుకుపోతున్న పొదరిల్లు సీరియల్‌లో ఈరోజు ఏపీసోడ్ ఆసక్తిగా సాగుతుంది. మహాలక్ష్మీ తొలిసారి ఆఫీసుకు వెళ్తుండటంతో ఇంట్లో సంబరాలు చేస్తారు. కన్నా టపాసులు కాల్చి మరీ హడావుడి చేస్తాడు. మహా అందరికీ కొత్త బట్టలు కొనుక్కుని వచ్చి చక్రిని మాత్రం ఉడికించడంతో ఈరోజు ఏపిసోడ్ రసవత్తరంగా సాగుతుంది.
చక్రి ఆనందం
మహాలక్ష్మీ ఇంటర్వూకు వెళ్లివచ్చికారులో కూర్చుంటుంది. ఆమె నీరసంగా ఉండటం చూసి ఈఉద్యోగం కూడా రాలేదా అంటూ చక్రి ఆరా తీస్తాడు.మీ నోటి నుంచి ఒక్క మంచిమాట కూడా రాదా అని మహా మండిపడుతుంది. మీరు అంత హుషారుగా లేకపోవడంతో ఈ ఇంటర్వూ కూడా పోయిందేమోనని అనుకున్నా అంటాడు. మీరు చెప్పకుండా లోపల ఏం జరిగిందో నాకు ఎలా తెలుస్తుందని అంటాడు. దీంతో మహాలక్ష్మీ నాకు ఉద్యోగం ఇచ్చారని చెప్పడంతో సంతోషపడతాడు. ఇంత మంచివార్త ఇలా ఢల్‌గా చెబుతున్నారేంటని అంటే....ఉద్యోగం అయితే వచ్చింది కానీ జీతం మాత్రం 23వేలు మాత్రమేనని అంటుంది.అదేంటి మీకు గోల్డ్‌మెడల్ ఉన్నా కానీ ఇంత తక్కువ జీతం ఇచ్చారని అనగా....మొదట్లో అంతే ఉంటుందంటా అని చెబుతుంది. దీంతో ఇద్దరూ కలిసి మాధవ్ దగ్గరకు వెళ్లి స్వీట్స్ ఇచ్చి ఆనందం పంచుకుంటారు.
చక్రిని ఉడికించిన మహా
ఉద్యోగానికి వెళ్లాల్సి ఉండటంతో మహాలక్ష్మీ షాపింగ్‌కు వెళ్తుంది. ఇంట్లో అందరికీ కొత్తబట్టలు తీసుకుని వస్తుంది. మాధవ్‌కు కూడా బ్రాండెడ్ షర్ట్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇంత ఖరీదైన బట్టలు నాకు ఎందుకమ్మా అని చెప్పినా...బాగుందని తీసుకున్నా అని చెబుతుంది.అందరికీ బట్టలు ఇస్తుంది కానీ చక్రికి మాత్రం ఇవ్వదు.దీంతో చక్రి అలిగి వెళ్లిపోతాడు. ఇంట్లో అందరూ కావాలి కానీ నేను మాత్రం తనకు వద్దని రుసరుసలాడుతాడు. తర్వాత మహా నీకోసం స్పెషల్‌గా తీసుకొచ్చానని షర్ట్ తీసి ఇవ్వడంతో ఎంతో ఆనందపడిపోతాడు. వాళ్లిద్దరూ అలా ఆనందంతో ఉండటం చూసి మాధవ్, చక్రి ఇంకా సంతోషపడతారు.
తొలిరోజు ఉద్యోగం
మహాలక్ష్మీ తొలిరోజు ఉద్యోగానికి బయలుదేరడంతో మాధవ్ స్వీటు చేసి అందిరకీ ఇస్తాడు. మహాలక్ష్మీ తొలిరోజు ఉద్యోగానికి వెళ్తుంది కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా జీవితంలో మరిన్ని ఉన్నతస్థానాలకు వెళ్లాలని కోరుకోమని చెబుతాడు. ఇంతలో మహాలక్ష్మీ ఎర్రచీర కట్టుకుని బయటకు రాగానే...చక్రి అలాగే చూస్తూ ఉండిపోతాడు. ఎంత అందంగా ఉంటుందా చీరలో అని మురిసిపోతాడు.మహా వచ్చి నోరు వెళ్లబెట్టింది చాలుకానీ ఆఫీసుకు టైం అవుతుందని చెబుతుంది. దేవుడికి దణ్ణం పెట్టుకుని బయలుదేరి బయటకు రాగానే...కన్నా ఆగమని చెప్పి లోపలికి వెళ్లి టపాసులు పట్టుకుని వచ్చి కాలుస్తాడు.దీంతో కాలనీవాళ్లు మొత్తం వస్తారు. మాధవ్ వాళ్ల పెద్దనాన్న కూడా అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని అడగ్గా....నారాయణ వచ్చి నువ్వు, నీ చెల్లి పెట్టిన శాపనార్థాలు పోయి మా ఇంటి కోడలు తొలిరోజు ఉద్యోగానికి వెళ్తుందని అందుకే మేం సంబరాలు చేసుకుంటున్నామని చెబుతాడు. దీంతో ఇంట్లో అందరూ డ్యాన్స్ వేసి మరీ మహాను ఉద్యోగానికి సాగనంపుతారు.చక్రి ఆమెను తీసుకుని ఆఫీసుకు వెళ్తాడు.
ఆఫీసు ముగించుకుని తిరిగి నడిచివస్తుండగా...మహాలక్ష్మీని ఒకావిడ ఢీకొడుతుంది.పరిశీలనగా చూడగా ఆమె కన్నా వాళ్ల అమ్మ అని అర్థమవుతుంది.దీంతోమహాలక్ష్మీ ఇంటికి వచ్చి నారాయణను ఆవిడ గురించి నిలదీస్తుంది. నేను చెప్పనని చెప్పగా....నేను ఆవిడను రోడ్డుమీద చూశానని చెబుతుంది.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
ట్రెండింగ్ వార్తలు






















