Star Maa Malli Serial: 'మల్లి'లో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ... 743 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న 'పడమటి సంధ్యారాగం' నుంచి
Padamati Sandhya Ragam to Malli: 'జీ తెలుగు'లో చక్కటి వీక్షకాదరణతో దూసుకు వెళుతున్న సీరియల్ 'పడమటి సంధ్యా రాగం'. ఆల్రెడీ 743 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది. అందులో నటుడు ఇప్పుడు 'మల్లి'లోకి వెళ్ళాడు.

బుల్లితెర వీక్షకులలో అత్యంత ఆదరణతో దూసుకు వెళుతున్న జీ తెలుగు సీరియళ్లలో పడమటి సంధ్యారాగం ఒకటి. ఈ రోజు (జనవరి 17వ) తేదీతో ఆ సీరియల్ 743 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఆ సీరియల్ చూసే వీక్షకులకు నటుడు సిద్దు చాలా బాగా తెలుసు. ఇప్పుడు అతనికి మరొక సీరియల్ ఛాన్స్ వచ్చింది.
స్టార్ మా సీరియల్ 'మల్లి'లో సిద్ధు!
Actor Sidhu In Malli Serial: 'స్టార్ మా' ఛానల్‌లో ప్రతి రోజూ మధ్యాహ్నం వచ్చే సీరియళ్లలో 'మల్లి' ఒకటి. ఇప్పుడు ఆ సీరియల్‌లో సిద్ధూ ఎంట్రీ ఇచ్చారు. రియల్ లైఫ్ లుక్, ఆ సీరియల్ లుక్ చూస్తే చాలా వేరియేషన్ కనబడుతోంది. మరి, ఆయన రోల్ ఏమిటి? ఏం చేస్తారు? అనేది చూడాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
రాత్రి నుంచి మధ్యాహ్నానికి వెళ్లిన 'మల్లి''స్టార్ మా'లో సీరియల్ ప్రారంభమైనప్పడు... సోమ నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి తొమ్మిది గంటలకు 'మల్లి' టెలికాస్ట్ అయ్యేది. అయితే... గత ఏడాది (2024) అక్టోబర్ మొదటి వారంలో టైమ్ స్లాట్ చేంజ్ చేస్తూ... స్టార్ మా కీలక నిర్ణయం తీసుకుంది.
రాత్రి పూట టెలికాస్ట్ అయ్యే సీరియల్‌ను మధ్యాహ్నానికి షిఫ్ట్ చేశారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి సోమ - శనివారం వరకు ప్రతి రోజూ మధ్యాహ్నం 12.30 గంటలకు టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఆ టైంలో 'గుండె నిండా గుడి గంటలు'ను టెలికాస్ట్ చేయడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి 'మల్లి' సీరియల్ రేటింగ్ పడుతూ వచ్చింది. ప్రజెంట్ వీక్ ఈ సీరియల్ రేటింగ్ కేవలం 3.28 మాత్రమే. మరి, సిద్ధూ ఎంట్రీ తర్వాత ఏమైనా బెటర్ టీఆర్పీ వస్తుందేమో చూడాలి.





















