Oorvasivo Rakshasivo Serial Today March 6th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: ప్రేయసితో ధీరు నిశ్చితార్థం.. మనసులో మాట చెప్పేసిన విజయేంద్ర.. కుమిలికుమిలి ఏడ్చిన దుర్గ!
Oorvasivo Rakshasivo Serial Today Episode ధీరుతో దుర్గ నిశ్చితార్థం జరిగిన తర్వాత విజయేంద్ర దుర్గ దగ్గరకు వెళ్లి ధీరు నీకు కరెక్ట్ కాదు అని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారుతుంది.
Oorvasivo Rakshasivo Telugu Serial Today Episode: ధీరుకి మళ్లీ ప్రాణం పోశావ్ మా అందరి ఆనందానికి నువ్వే కారణం అని రక్షిత దుర్గని పొగిడి థ్యాంక్స్ చెప్తుంది. ధీరుని జాగ్రత్తగా, ప్రేమగా చూసుకోమని రక్షిత అంటుంది. దీంతో దుర్గ ధీరుని నా చేతుల్లో పెడుతున్నా అన్నారు కదా ఇక ధీరు గురించి మర్చిపోండి. ధీరు సంగతి నేను చూసుకుంటాను.. మిమల్ని ధీరు మరిచిపోయేంత ప్రేమగా చూసుకుంటాను అని దుర్గ అంటుంది. ఇంతలో రేష్మ రక్షితకు ఫోన్ చేస్తుంది.
రేష్మ: రక్షిత నేను విన్నది నిజమేనా ధీరుకి, దుర్గకి ఎంగేజ్‌మెంట్ చేస్తున్నావా..
రక్షిత: అవును రేష్మ.. సారీ నీకు చెప్పకలేకపోయాను.
రేష్మ: పర్వాలేదు. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఫస్ట్ నుంచి నీకు దుర్గ ఇష్టం లేదు కదా.. పైగా తనని నీ శత్రువు ఏమో అని అనుమానంగా ఉంది..
రక్షిత: ఇప్పుడు నాకు దుర్గ మీద అనుమానం పోలేదు. అది నాకు నచ్చలేదు కూడా.. నాకు ఎవరిమీదైనా అనుమానం వస్తే అది తీరే వరకు అవతలి వ్యక్తిని వదలను. నాకు క్లారిటీ రావాల్సింది. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితిలో ధీరుకి దుర్గకి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఎంత చెప్పినా ధీరు అర్థం చేసుకోవడం లేదు.
రేష్మ: నీ భయం నాకు అర్థమైంది. కానీ మనం దుర్గ గురించి సరిగా అర్థం చేసుకోలేదు. పైగా తనకి మన శత్రువుతో సంబంధం ఉంటే నువ్వు రిస్క్ చేసినట్లు అవుతుంది కదా..
రక్షిత: నో రేష్మ.. నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే.. దుర్గ మనం అనుకున్నట్లు మన శత్రువుకి కావాల్సింది అయినా ఒకవేళ దుర్గకి నిజంగానే మన మీద కోపం ఉన్నా తన నిజస్వరూపం ఏంటో తన ప్లాన్స్ ఏంటో మనకు తెలిస్తూ ఉండాలి అంటే తను నా కళ్లముందే మా ఇంట్లో ఉంటే నాకే మంచింది కదా.. తనే స్టెప్ తీసుకోవాలి అనుకున్నా నాకు ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా..
రేష్మ: రక్షితా... నువ్వు నిజంగా జీనియస్.. పైకి మాత్రం ధీరు కోసం పెళ్లికి ఒప్పుకున్నట్లు నటిస్తూ నీ అనుమానాన్ని తీర్చుకోబోతున్నావ్. గుడ్.. వర్క్‌లో ఉండుంటావ్ ఫ్రీ అయితే కాల్ చేయ్..
దయాసాగర్: మనసులో.. విజయేంద్ర నువ్వు కొన్ని రోజులు ముందు వచ్చి ఉన్నా.. అసలు యూఎస్ వెళ్లకుండా ఉండి ఉన్నా ఈరోజు దుర్గ ధీరు లాంటి నీచుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చేది కాదు విజయేంద్ర.
రక్షిత: మనసులో.. నా చేత నువ్వు తప్పు చేయిస్తున్నావు అనిపిస్తుంది ధీరు.
విజయేంద్ర: మనసులో.. ధీరుతో పెళ్లికి సిద్ధపడి రాంగ్ స్టెప్ వేస్తున్నావ్ ఏమో అనిపిస్తుంది దుర్గ.
దుర్గ: మనసులో.. నేను వెళ్తుంది తప్పు దారి దాని వల్ల నా జీవితమే నాశనం అవుతుంది అని కూడా నాకు తెలుసు. అన్నీ తెలిసి ఈ తప్పు ఎందుకు చేస్తున్నాను అంటే పవిత్రకు న్యాయం చేయడానికే. విజయేంద్రని చూస్తూ బాధపడుతూనే దుర్గ ధీరు మెడలో దండ వేస్తుంది. రింగ్ పట్టుకొని విజయేంద్రని చూస్తూ ఎమోషనల్ అవుతుంది. దుర్గ, ధీరు ఒకరి చేతికి ఒకరు రింగులు మార్చుకుంటారు. ఆ సీన్‌ను విజయేంద్ర చూడడు.
విజయేంద్ర: మనసులో.. విలువైన జీవితంలో తెలిసి కొన్ని తప్పులు చేస్తాం. అలాంటప్పుడు ప్రకృతి మనకు ఆలోచించుకోమని అవకాశం ఇస్తుంది. ఇది నీ జీవితం నువ్వు తీసుకున్న నిర్ణయం. జాగ్రత్త దుర్గ. ఇక నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అందరూ ఫొటోలు తీసుకుంటారు.
ధీరు: ఫోన్‌లో దుర్గ ఫొటో చూస్తూ.. నేను ఒకటి కావాలి అనుకుంటే నాకు దక్కనిది ఇప్పటివరకు ఒకటీ లేదు. అది అందమైన వస్తువు అయినా అమ్మాయి అయినా ఒకటే. నా దృష్టిలో అవి రెండూ ఒకటే. యూస్ అండ్ త్రో. కాకపోతే నువ్వు నాకు దక్కడం కాస్త ఆలస్యం అయింది. అయినా నీ లాంటి పొగరు బోతు గిత్త కోసం కాస్త ఆలస్యం అయినా తప్పులేదు.
రక్షిత: ధీరు ఎంగేజ్మెంట్ అయిందని చాలా ఆనందంగా ఉన్నావ్..
ధీరు: అవును మామ్ నీ లాంటి గొప్ప మామ్ దొరకడం నిజంగా నా అదృష్టం.
రక్షిత: ధీరు చెంప పగలగొడుతుంది. ఏంటి ఎందుకు కొట్టానో అర్థం కాలేదా.. రక్షిత రాజవంశం కొడుకు అంటే ఎలా ఉండాలి. ధైర్యానికి రాజశానికి సింబాలిక్‌గా ఉండాలి. ఏ పని చేసిన ఎంత పేరు వస్తుంది. ఎంత డబ్బు వస్తుంది. అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కానీ నువ్వేం చేశావ్.. చీపుగా ఒక అమ్మాయి కోసం టాప్ మోస్ బిజినెస్ మెన్ ముందు సూసైడ్ అటెమ్ చేశావ్..
ధీరు: మామ్ దుర్గ నాకు దక్కదేమో అనే భయంతో..
రక్షిత: షెట్ అప్.. అసలు ఏముందిరా దాని దగ్గర నాకేం అర్థం కావడం లేదు. తన కోసం చావడానికి సిద్ధపడతావా.. రేయ్ నిన్ను హాస్పిటల్‌లో అలాంటి పరిస్థితుల్లో చూసినప్పుడు నీ మీద ఎంత కోపం వచ్చిందో తెలుసా.. ఇన్ని రోజులు ప్రాణంగా చూసుకున్న మమల్ని వదిలేసి. తన కోసం చావాలి అనుకుంటావా.. రేయ్ నువ్వు అనుకోవడం ఏంట్రా నేనే నిన్ను చంపేద్దాం అనుకున్నా కానీ కన్న తల్లిని కదా ఆగిపోయాను.
ధీరు: సారీ మామ్. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. నువ్వేం చెప్తే అది చేస్తా. కాకపోతే దుర్గ నా జీవితంలో ఉండాలి.
రక్షిత: నువ్వు తనతో జాగ్రత్తగా ఉండాలి.
దుర్గ విజయేంద్ర మాటల్ని తలచుకొని బాధపడుతుంది. ఇక అప్పుడే వర్షం వస్తుంది. దీంతో దుర్గ ఈ వాతావరణానికి ఈ వర్షానికి నా మనసులోని అలజడికి నా కళ్ల నుంచి వస్తున్న నీరులా అనిపిస్తోంది విజయేంద్ర అని అనుకుంటుంది దుర్గ. అప్పుడు వర్షంలో దుర్గకు ఎదురుగా విజయేంద్ర కనిపిస్తాడు.
దుర్గ: విజయేంద్ర ఈ టైంలో ఎందుకు వచ్చావ్.
విజయేంద్ర: నా మనసులో మాట నీకు చెప్పాలి అని వచ్చాను దుర్గ. కానీ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నీకు చెప్పొచ్చో లేదో తెలీదు. నువ్వు మనస్ఫూర్తిగానే ఈ పెళ్లి చేసుకుంటున్నావా..
దుర్గ: ఎందుకు అలా అడుతున్నావ్.
విజయేంద్ర: నీ మనసులో ఏముందో నీకు మాత్రమే తెలుసు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు అని నాకు అనిపిస్తుంది. ధీరు మీద నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి దుర్గ. అలా అని ధీరు చెడ్డ వాడు అని చెప్పడానికి ఫ్రూప్స్ ఏమీలేవు. నిజానికి నేను చూడలేదు. నీకు నేను ఇంతకుముందే చెప్పాను. నీకు నా వైష్ణవికి రూపం తప్ప మిగిలిన అన్నింట్లో చాలా దగ్గర పోలికలు ఉన్నాయని.. మేబీ అందుకేనేమో ధీరుతో నీ పెళ్లి అన్నప్పటి నుంచి నా మనసులో ఏదో అలజడి. అది చెప్పలేను. ఇప్పుడు నా మనసు చెప్తుంది ఏదో తప్పు జరగబోతుంది అని. ఒకవేళ అదే నిజం అయితే నేను ఒక మంచి ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసిన వాడిని అవుతాను. అందుకే నా మనసులోమాట చెప్తున్నా మళ్లీ ఒకసారి నువ్వు తీసుకున్న నిర్ణయం సరైందా కాదా అని ప్రశ్నించుకో.
దుర్గ: నా గురించి మీరు ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్స్ విజయేంద్ర. కానీ నేను ఈ నిర్ణయం ఆలోచించే తీసుకున్నా. అది కాకుండా నాకు ఎంగేజ్‌మ్మెంట్ కూడా అయింది.
విజయేంద్ర: కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు ఎలాంటి అవసరం ఉన్నా నేను నీకు ఉన్నాను అని మర్చిపోవద్దు.
విజయేంద్ర వెళ్లిపోయిన తర్వాత దుర్గ చాలా ఏడుస్తుంది. తనని క్షమించమని విజయేంద్ర అని ఏడుస్తుంది. ఈ జన్మలో మన ఇద్దరి ప్రేమ త్యాగమే కోరుకుంటుంది అని అదే న్యాయానికి అవసరం అని.. మరో జన్మ ఉంటే నీ కోసమే పుడతాను అని ఏడుస్తుంది.
ఇక ధీరు అద్దంలో తనని తాను చూసుకుంటూ ధీరు నువ్ సూపర్‌రా కంచు లాంటి దుర్గని దక్కించుకొని కోట్ల ఆస్తికి వారసుడివి అయిపోతున్నావని పొగుడుకుంటాడు. తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి తన దుర్గ గురించి మాట్లాడుతాడు. దుర్గని తాళి కట్టి గెలిచుకుంటాను అని.. దుర్గ వెనకున్న ఆస్తికి మొగుడు అవుతాను అని బెట్ గెలుస్తున్నాను అని తన ఫ్రెండ్‌కి చెప్తాడు. ఇక ఇంట్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ధీరు పెళ్లి అయిపోతుంది. నువ్వు ఎప్పుడు చేసుకుంటావని విజయేంద్రని అడుగుతారు. దీంతో విజయేంద్ర వైష్ణవిని తాను ప్రేమిస్తున్నాను అని తననే పెళ్లి చేసుకుంటాను అంటాడు దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ప్రేమలు: వెల్‌కాం టు హైదరాబాద్ - ఒకే నగరం భిన్న జీవితాలు, ‘ప్రేమలు’ తెలుగు వీడియో సాంగ్ చూశారా?