Oorvasivo Rakshasivo Serial Today March 1st: ఊర్వశివో రాక్షసివో సీరియల్: దుర్గని పెళ్లి చేసుకోవడానికి ధీరు నాటకం.. దుర్గకి దండం పెట్టి వేడుకున్న రక్షిత!
Oorvasivo Rakshasivo Serial Today Episode ధీరు ఇష్టపడిన దుర్గని కోడలిగా చేసుకోవడానికి రక్షిత ఒప్పుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Oorvasivo Rakshasivo Today Episode దుర్గ కోసం ధీరు చేయి కట్ చేసుకుంటాడు. ధీరుని విజయేంద్ర, రక్షిత వాళ్లు హాస్పిటల్‌కి తీసుకొస్తారు. ఇంతలో డాక్టర్ వచ్చి ఐసీయూకి తీసుకెళ్లమని చెప్తాడు. ఇక డాక్టర్ ధీరు దగ్గరకు వచ్చి నటించింది చాల్లే లే అంటాడు. ధీరు లేచి ఎలా ఉంది నా యాక్టింగ్ అంటాడు. దానికి డాక్టర్ ఎంత లోతుకు కట్ చేసుకుంటే ఏం జరగదో సరిగ్గా అంతే కట్ చేసుకున్నావ్ అంటాడు.
ధీరు: అంతా మీ ట్రైనింగే డాక్టర్ కానీ చేయి కట్ చేసుకున్నప్పుడు ఎంత భయం వేసిందో తెలుసా. తేడా వస్తే మీతో నేను ఇలా మాట్లాడలేను.
డాక్టర్: నిజమే సార్ చాలా రిస్క్ చేశారు.
ధీరు: ఇంత రిస్క్ చేయకపోతే అక్కడ ఎంగేజ్ మెంట్ ఆగిపోయేది కాదు. మా అమ్మలో భయం,, దుర్గలో ఆలోచన వచ్చేవే కావు. ఇప్పుడు నేను అసలు ఆట ఆడబోతున్నాను. నువ్వు బయటకు వెళ్లి నేను దుర్గ దుర్గ అని కలవరిస్తున్నాను అని చెప్పాలి. తను వస్తే కానీ బతికేలా లేడు అని చెప్పాలి. అప్పుడే మా అమ్మలో కంగారు మొదలవుతుంది. దుర్గ దగ్గరకు వెళ్లి దుర్గని పెళ్లికి ఒప్పిస్తుంది. ఇదంతా ఈ రోజే జరిగిపోవాలి డాక్టర్. ఆ తర్వాత దుర్గతో నా పెళ్లి.
మరోవైపు విజయేంద్ర పురుషోత్తానికి ఫోన్ చేసి చెప్తాడు. పురుషోత్తం హాస్పిటల్‌కి బయల్దేరుతాడు. ఇక రక్షిత ధీరుకి నిజంగానే ఏదో అయిందని అల్లాడిపోతుంది. ఇక ధీరు దుర్గ దుర్గ అని కలవరిస్తాడు. దీంతో డాక్టర్ ఆ అమ్మాయిని ఎంత తొందరగా పిలిపిస్తే అంత మంచిది అని అంటాడు.
విజయేంద్ర: పిన్ని నేను వెళ్లి దుర్గని తీసుకురానా..
రక్షిత: వద్దు విజయేంద్ర ముందు ట్రీట్మెంట్ జరగని తర్వాత చూద్దాం.
దుర్గ: ధీరు ఎలా అయినా నా ఎంగేజ్మెంట్ ఆపుతాడు అనుకున్నాను కానీ ఇలా సూసైడ్ చేసుకుంటాడు అనుకోలేదు.
దయాసాగర్: నేను అదే అనుకున్నాను అమ్మ. ఒకవైపు నువ్వు దక్కవు అన్న టెన్షన్.. మరోవైపు వాళ్ల అమ్మ ఒప్పుకోదు అని చివరకు ఇలా చేసినట్లు ఉన్నాడు.
దుర్గ: ధీరు చనిపోకూడదు నాన్న ప్రేమకోసం చనిపోయాడు అన్న పేరు వాడికి రాకూడదు. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశాడు అని కోర్టు తీర్పు ఇవ్వాలి. జనాలకు అసలు నిజం తెలియాలి. ఆ తర్వాత ధీరు చావాలి. ఒక సారి విజయేంద్రకి కాల్ చేయండి నాన్న ధీరు పొజిషన్ ఏంటో కనుక్కోండి.
దయాసాగర్: విజయేంద్ర ధీరు పరిస్థితి ఏంటి..
విజయేంద్ర: చాలా బ్లడ్ పోయింది. 50.. 50 అంటున్నారు. ఇంత పిచ్చి పని చేస్తాడు అని అనుకోలేదు సార్. అనవసరంగా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. ఇక విజయేంద్రని డాక్టర్ పిలిస్తే లోపలకు వెళ్తాడు.
దుర్గ: వాడు బతకాలి నా పగ తీర్చుకోవాలి. ఇంత పెద్ద ఇన్సుడెన్స్ జరిగిన తర్వాత రక్షిత రియాక్షన్ ఎలా ఉంటుంది నాన్న. నాకు ధీరుకి పెళ్లి చేయాలి అనుకుంటుందా.
దయాసాగర్: రక్షిత అంత స్ట్రాంగ్‌గా ఉంది అంటే కారణం నీ మీద స్ట్రాంగ్ అనుమానం ఉండటమే. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తే అనవసరం అయిన రిస్క్ అని రక్షిత భయం. లేదంటే నీకు ధీరుకి పెళ్లి చేయడం ఆమెకి మంచి ఛాయిస్. కోట్ల ఆస్తి వస్తుంది కదా.
దుర్గ: నాకు నమ్మకం ఉంది నాన్న వాళ్లంతట వాళ్లే మన ఇంటికి వచ్చి పెళ్లి కోసం బతిమిలాడుతారు. నేను ఆ ఇంటికి కోడలుగా వెళ్తేనే వాళ్ల మీద పగ ఈజీగా తీర్చుకోగలను. నా నుంచి ఎవరూ తప్పించుకోలేరు.
డాక్టర్: మేడం ధీరు స్పృహాలోకి వచ్చాడు. ట్రీట్మెంట్‌కి సహకరించడం లేదు. మొండిగా ప్రవర్తిస్తున్నాడు.
పురుషోత్తం: ధీరు నీకు ఏమైనా పిచ్చా.. నీ పరిస్థితి నీకు అర్థమవుతుందా..
ధీరు: నాకు దుర్గ అంటే పిచ్చి. ప్రాణం పోయినా పర్వాలేదు. దుర్గ లేని జీవితం నాకు వద్దు. అందుకే చావాలి అనుకుంటున్నా. మామ్ అయినా నీకు నా కంటే నీ పంతమే ముఖ్యం కదా..
రక్షిత: అలా అనకు ధీరు నీ కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు. ధీరు నాకు దుర్గ మీద అనుమానం ఉందిరా..
ధీరు: దుర్గతో నాకు పెళ్లి చేస్తాను అంటేనే నేను ట్రీట్మెంట్ చేసుకుంటాను. లేదంటే నా బాడీ తీసుకెళ్లండి.
పురుషోత్తం: అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి రక్షిత. ఎందుకు దుర్గని శత్రువులా చూస్తున్నావు.
రక్షిత: పురు నాకు దుర్గ మీద చాలా అనుమానం ఉంది. తనకు మన శత్రువులు ఎవరో తెలుసు.
పురుషోత్తం: నువ్వు ముందు నెగిటివ్ థింకింగ్ మానేయ్.. దుర్గ మన కోడలు అయితే మనకే లాభం కదా.. దుర్గకి ధీరుకి పెళ్లి చేస్తే దయాసాగర్ ఆస్తికి మన ధీరు వారసుడు అవుతాడు. సరే రక్షిత నీ అనుమానమే నిజం అనుకుందాం.. దుర్గ మన శత్రువులకు సాయం చేస్తే ధీరుని ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. ఒకవేళ తను ధీరుతో పెళ్లికి ఒప్పుకుంటే శత్రువులతో చేతులు కలపదు. ఎందుకు అంటే ఎవరూ తన ఫ్యామిలీ నాశనం అవ్వాలి అని అనుకోరు.
రక్షిత: పురు నువ్వు చెప్పేవన్నీ వాలిడ్ పాయింట్సే కానీ నా మనసు ఇంకా ఎక్కడో ఏదో ఆలోచిస్తుంది.
పురుషోత్తం: సరే రక్షిత ఇది విను. తనే నీ శ్రతువు అయితే నీ శత్రువులకు సాయం చేస్తుంది అనుకో. పెళ్లి అయిన తర్వాత మన ఇంట్లోనే ఉంటుంది కదా తనేం చేసినా మనకు చిటికెలో తెలిసిపోతుంది. అవసరం అయితే రక్షిత అనుమానం ఏదైనా వస్తే చంపేయొచ్చు.
రక్షిత: ధీరు ట్రీట్మెంట్ చేయించుకోరా నేను వెళ్లి దుర్గని తీసుకొస్తాను.
ధీరు: మామ్ నువ్వు దుర్గని తీసుకొచ్చాకే నా ట్రీట్మెంట్.. మామ్ నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని తెలుసు.
రక్షిత: దయాసాగర్ గారు మీ దుర్గతో మాట్లాడాలి అని వచ్చాం ఒకసారి పిలుస్తారా..
దుర్గ: ధీరు ఎలా ఉన్నాడు రక్షిత గారు.
రక్షిత: ఎక్కడైనా తల్లి బిడ్డకు ప్రాణాలు పోస్తుంది. కానీ నేను నా బిడ్డ ప్రాణాలు పోవడానికి కారణం అయ్యేలా ఉన్నాను. ధీరు ట్రీట్మెంట్ వద్దు అని మొండిగా ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాను అని నాతో చెప్పినప్పుడు నేను ఒప్పుకొని ఉంటే అసలు ఈ రోజు వాడిని ఇలా చావు బతుకుల మధ్య చూసేదాన్ని కాదు.
దుర్గ: నేను ఇలా అడుగుతున్నాను అని ఏమీ అనుకోవద్దు. అసలు మీకు నేను ఎందుకు ఇష్టం లేదు. నా మీద ఎందుకు మీకు కోపం తెలుసుకోవచ్చా..
రక్షిత: ధీరు నాతో చెప్పకుండా ఒక్క పనిచేసేవాడు కాదు కానీ నీ వల్ల నాతో రోజు అబద్ధం చెప్పేవాడు. నాకు తెలీకుండా మీ పెళ్లి గురించి మాట్లాడించాడు. ఇప్పుడు నీతో పెళ్లి చేస్తాను అంటేనే ట్రీట్మెంట్ చేయించుకుంటాను అన్నాడు. ధీరుకి నేను అంటే ప్రాణం అలాంటిది నీకోసం నన్ను వదిలేయడానికి సిద్ధమయ్యాడు. దుర్గ జరిగిన వన్నీ మర్చిపోయి నా కొడుకుకు ప్రాణ భిక్ష పెట్టమ్మ.. నా కొడుకును పెళ్లి చేసుకొని నా కొడుకుని బతికించు.
దయాసాగర్: రక్షిత గారు మీ బాధ నాకు అర్థమైంది. కానీ నా కూతుర్ని కోడలిగా కాకుండా కూతురిలా చూసుకునే వాళ్లి ఇంటికి పంపాలి అని నాకు ఉంటుంది కదా. అలాంటిది మీకు తను అంటే అస్సలు ఇష్టం లేదు కదా మరి మీ ఇంటికి నా కూతుర్ని ఎలా పంపిస్తాను. అదీ కాకుండా మేం వేరే వాళ్లకి మాటిచ్చాం. దాన్ని కాదని మీ ఇంటికి నా కూతుర్ని పంపిస్తే బాగుంటుందా చెప్పండి.
పురుషోత్తం: మేం మీ కూతుర్ని మా కూతురిలా చూసుకుంటాం.. రక్షిత పూర్తిగా మారింది.
రక్షిత: దుర్గ నన్ను నమ్ము అమ్మా నా కొడుకు అంటే నా ప్రాణం అలాంటిది వాడి ప్రాణం అయిన నిన్ను ఎంత అపురూపంగా చూసుకుంటానో చెప్పు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.