Oorvasivo Rakshasivo Serial Today February 8th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: విజయేంద్ర మీద ద్వేషం పెంచుకున్న దుర్గ.. మధుసూదన్, భవ్యలను రక్షించిన వాసు!
Oorvasivo Rakshasivo Serial Today Episode మధుసూదన్, భవ్యలను రక్షిత చెప్పినట్లు చంపకుండా వాసు కాపాడటంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Oorvasivo Rakshasivo Today Episode: భవ్య, మధుసూదన్ ఉన్న ప్లేస్‌కి రక్షిత వస్తుంది. ఇద్దరిన్ని రౌడీలు కట్టేసి ఉంటారు. వారిని చూసి రక్షిత కోపం ప్రదర్శిస్తుంది. మధుసూదన్ కళ్లద్దాలు తీసి ఇన్ని రోజులు గుడ్డొడిలా బాగా నటించావ్ అంటుంది. న్యాయం ధర్మాన్ని కాపడటానికి నువ్వేమైనా దేవుడు అనుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. మధుసూదన్ వణికిపోతాడు.
రక్షిత: నీకు రెండేళ్ల క్రితమే చెప్పాను. ఈ విషయంలో జోక్యం చేసుకుంటే నిన్నూ నీ కూతుర్ని చంపేస్తాను అని. అయినా వినలేదే.. కానీ నేను చెప్పేది వినకుండా కళ్లు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నా కొడుకు సాయంతోనే కళ్లు తెప్పించుకొని నా కొడుకు మీదే సాక్ష్యం చెప్పి శిక్ష పడేలా చేద్దాం అనుకుంటున్నావా.. ఏం చేసుకొనిరా నీకు అంత ధైర్యం. ఇప్పుడు నా నుంచి నిన్ను ఎవరు కాపాడుతారు. నువ్వు నమ్మిన ఆ లాయర్ కాపాడుతుందా.. ఒక్కసారి వదిలేసి తప్పు చేశాను ఈ సారి వదిలిపెట్టను. వాసు కిల్ దెమ్.
రౌడీలు పెట్రోల్ పోసి నిప్పు పెట్టేస్తారు. అప్పుడే అక్కడికి దుర్గ వస్తుంది. మంటలు చూసి ఏడుస్తుంది. న్యాయం కోసం మీరు నిలబడితే మిమల్ని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తుంది.
వాసు: వాళ్లు చనిపోలేదు దుర్గ.. నువ్వేం టెన్షన్ పడకు దుర్గ బాబాయ్ వాళ్లని నేను సేవ్ చేశాను.
దుర్గ: నువ్వు అన్నది నిజమా వాసు.. మధుసూదన్, భవ్య వస్తారు. మీకు ఏం కాలేదు కదా.. మీకు ఏం అయిపోయిందా అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. వాసు చాలా థ్యాంక్స్ వాసు.. ఈరోజు రెండు ప్రాణాలను కాపాడావు. న్యాయాన్ని బతికించావు. నీ రుణం తీర్చుకోలేను.
వాసు: అలా అనకు దుర్గ.. నేను ఇలా ఉండటానికి కారణం నువ్వు. నేను నీకు చాలా రుణపడి ఉన్నాను. నీకోసం ఎంత రిస్క్ అయినా చేస్తాను.
దుర్గ: నన్ను క్షమించండి బాబాయ్.. న్యాయాన్ని కాపాడటం కూడా ఈరోజుల్లో తప్పు అయిపోయింది. ఇంకొక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండొద్దు ఈ రాష్ట్రం వదిలి దూరంగా వెళ్లిపోండి. మీరు ఇక్కడే ఉంటే మళ్లీ మీ ప్రాణాలకు ప్రమాదం వస్తుంది.
మధుసూదన్: పర్వాలేదు అమ్మా ప్రాణం పోయినా సరే ఆ రాజవంశం వాళ్లకి శిక్ష పడేలా చేస్తాను. నా బిడ్డను నా దగ్గరకు చేర్చావ్.. ఇవన్నీ చేసిన నీకు ఏమైనా చేశాను.
దుర్గ: ప్రస్తుతానికి మీరు దూరంగా ఉండండి అవసరం వచ్చినప్పుడు నేనే చెప్తాను.
వాసు: దుర్గ మధుసూదన్ బాబాయ్ వాళ్లని ఇక్కడే ఉంచి కోర్టులో సబ్ మిట్ చేస్తే సరిపోతుంది కదా..
దుర్గ: మనం మొదటి స్టెప్ వేసి రెండో అడుగు వేసేలోగా రక్షిత చెక్ పెట్టేస్తుంది. మంచి టైం చూసి అప్పుడు మనం కోర్టుకి వెళ్లాలి. బాబాయ్ వాళ్లు జాగ్రత్త. మధుసూదన్ వాళ్లు వెళ్లిపోగానే దుర్గ తల తిరుగుతుంది. తల పట్టుకొని గట్టిగా అరుస్తుంది.
డాక్టర్: దుర్గ తండ్రితో.. దుర్గ సంగతి తెలిసి కూడా తనని మీరు ఒంటరిగా ఎలా వదిలేశారు. తనకు యాక్సిడెంట్ అయినప్పుడు బ్రైన్‌లో బ్లడ్ గడ్డకట్టింది. అది రానురాను క్రిటికల్ అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నవారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి. ఓవర్ థింక్ చేయకూడదు. స్ట్రెస్ తీసుకోకూడదు.
దుర్గతండ్రి: విన్నావా.. ఇది నీకు రెండో జీవితం.. నువ్వే చేయాల్సిన పనులు గెలవాల్సిన విజయాలు చాలా ఉన్నాయి. నీ బాధ్యత పవిత్రకు నీకు అన్యాయం చేసిన వారిమీద పగ తీర్చుకోవడం మాత్రమే కాదు. పవిత్రను నార్మల్ మనిషిని చేయాలి. పవిత్ర నువ్వు కన్న కలలు నిజం చేసుకోవాలి. వాళ్ల మీద పగ తీర్చుకొనే ప్రాసెస్‌లో నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నావ్. కొన్ని రోజులు వాటి గురించి ఆలోచించకు.
దుర్గ: లేదు నాన్న వాళ్ల అంతు చూసే వరకు నాకు ఏమీ కాదు. నువ్వేం కంగారు పడకు. ఇక దుర్గ విజయేంద్ర ఫటో ఉన్న లాకెట్ చూస్తూ బాధపడుతుంది. మరో వైపు పవిత్ర తన అక్కని చాటుగా గమనిస్తుంది. మా నాన్న తర్వాత నేను అంతలా నమ్మింది నిన్నే విజయేంద్ర. నువ్వు నన్ను ప్రేమించావ్ అనుకున్నాను. కానీ నీ ప్రేమ ఇక్కడ ఉన్నంత వరకే నువ్వే ఫారిన్ వెళ్లాక ఆ ప్రేమ ఆవిరి అయిపోతుంది అని తెలుసుకోలేకపోయాను. ఇక పవిత్ర విజయేంద్ర ఆర్ట్ వేసి గట్టిగా అక్కా అని అరుస్తుంది. ఈ బొమ్మ ఎందుకు వేశావ్ అని దుర్గ అడుగుతుంది. పవిత్ర చిరాకుగా వెళ్లిపోతుంది.
దుర్గ: మాకు జరిగిన అన్యాయం తెలుసుకొని నువ్వు తిరిగివచ్చి మాకోసం నిలబడతావ్ అనుకున్నాను. నిన్ను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నేను చాలా ట్రై చేశాను. కానీ నీకు మేం గుర్తులేం. నువ్వు కరెక్ట్ టైంలో రియాక్ట్ అయి మా వైపు నిలబడి ఉంటే మా జీవితాలు ఇలా అయ్యేవే కావు. మా అమ్మానాన్నలు బతికుండే వాళ్లు. నువ్వు యూ ఎస్ నుంచి తిరిగి వస్తే ఐలవ్యూ అని చెప్పాలి అనుకున్నా కానీ ఇప్పుడు నువ్వు కనిపిస్తే ఐ హేట్ యూ అని చెప్పాలి అని ఉంది.
ధీరు దుర్గకు ఫోన్ చేసి ఏమైపోయావ్ ఎందుకు ఫోన్ లిప్ట్ చేయలేదు అని అడుగుతాడు. ఇంతలో రక్షిత పిలవడంతో ధీరు కాల్ కట్ చేసేస్తాడు. మరోవైపు వాసుతో రక్షిత మాట్లాడుతుంది. దుర్గకు సంబంధించిన ప్రతీ డిటెల్స్ కావాలి అంటుంది. అయితే అక్కడ దుర్గ కోపంగా చూసినట్లు ఊహించుకుంటుంది. భయపడి కంగారు పడుతుంది. ఎక్కడ చూసినా దుర్గే కనిపిస్తుంది అని బాగా ఆలోచించాలి అని అనుకుంటుంది. ఇంతలో దుర్గ తనని చంపుతున్నట్లు ఊహించుకుంటుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: సమంత: ఇంట్లో ఒత్తిడి.. మళ్లీ పెళ్లికి సిద్ధమైన సమంత? - బంధువుల అబ్బాయితో పెళ్లట!