అన్వేషించండి

Oorvasivo Rakshasivo Serial Today February 14th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: విజయేంద్రని తప్పుగా అర్థం చేసుకున్న దుర్గ.. ధీరుకే వారసత్వం అప్పగించాలని రక్షిత కుట్ర!

Oorvasivo Rakshasivo Serial Today Episode: వైష్ణవి, పవిత్రల గురించి తెలుసుకొని న్యాయం చేస్తానని విజయేంద్ర అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasivo Rakshasivo Today Episode రక్షిత ఇంట్లో హోమం జరుగుతుంది. విజయేంద్ర, దుర్గ ఇద్దరు కలిసి ఒకేసారి ఇంట్లో అడుగుపెడతారు. అది చూసిన ధీరు రగిలిపోతాడు. ఇద్దరినీ పక్కపక్కన చూసి చిరాకుపడతాడు. దుర్గ వచ్చి అందరికి నమస్కారం పెట్టి.. ధీరుకి హాయ్ చెప్పి వాళ్ల నానమ్మ దగ్గర కూర్చొంటుంది. దుర్గని చూసిన రక్షిత కోపంగా చూస్తుంది.

రక్షిత: తన భర్తతో.. ధీరు తన క్యారెక్టర్‌ని చంపుకుంటూ అమ్మాయిల వెంట తిరుగుతూ దిగజారిపోతున్నాడు. మన చేయి జారిపోతున్నాడు అనిపిస్తుంది.
పురుషోత్తం: అదేం జరగదు రక్షిత. 
రక్షిత: ఇంకేం జరగాలి కళ్లముందు కనిపిస్తుంది సరిపోదా. ఇది మన ఇంట్లో జరుగుతున్న హోమం బయట వాళ్లు ఎవర్ని మనం పిలవలేదు. ఆ విషయం వాడికి కూడా తెలుసు. కానీ దుర్గని ఎందుకు పిలిచాడు. ఏ దుర్గని చూడకుండా ఉండలేకపోతున్నాడా.. 
పురుషోత్తం: రక్షిత నెగిటివ్‌గా ఆలోచించకు. దుర్గ వాళ్లతో కలిసి మనం వందకోట్ల ప్రాజెక్ట్ చేయబోతున్నాం. వాళ్లతో మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకుంటే వాళ్లకి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనుకుంటారు అది మనకే ప్లస్ అవుతుంది. 
రక్షిత: మీరు వాడిని వెనకేసుకొస్తున్నారు. నేను అడిగితే ఇలాంటి పిచ్చి షాకులు చెప్పి తప్పించుకుంటున్నారు.
పురుషోత్తం: రక్షిత స్టాపిట్ తర్వాత మాట్లాడుకుందాం. 

నానమ్మ: ఆరోజు వచ్చావ్ మధ్యలోనే సడెన్‌గా వెళ్లిపోయావ్ నువ్వు అలా వెళ్లిపోగానే ధీరు ఎంత బాధపడ్డాడో తెలుసా.
దుర్గ: ఆ రోజు మీరు వైష్ణవి, పవిత్రల గురించి చెప్పగానే బాధేసింది. నేను బయట విన్న వాటికి మీరు చెప్పిన దానికి కోర్టులో తీర్పు వచ్చిన దానికి చాలా తేడా ఉంది. వాళ్ల గురించి మీకు తప్పుడు అభిప్రాయం వచ్చేలా చేశారా. లేక మీరే అలా ఫీలయ్యారా నాకు తెలీదు. 
నానమ్మ: నేను ఆడదాన్నే అమ్మ. తొందర పడి ఎవర్ని నిందించను. కానీ పవిత్ర, వైష్ణవిలు మాత్రం తిన్నింటి వాసాలు లెక్కపెట్టేవాళ్లే.
దుర్గ: ఏదో ఒకరోజు నిజం బయటకు వస్తుంది. కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది. న్యాయం ధైర్యంగా నిలబడుతుంది. అప్పుడు మళ్లీ మనం పవిత్ర, వైష్ణవిల గురించి మాట్లాడుదాం.

ధీరు: ఎలా అయినా దుర్గ నాకు దక్కేలా చూడమ్మా.. అదే జరిగితే వంద హోమాలు జరిపిస్తాను. నా కోరిక మాత్రం మర్చిపోకు దుర్గ నాకు కావాల్సిందే.
రక్షిత: అమ్మా దుర్గమ్మ తల్లి జరిగిపోయిన సంఘటన మా వెంట పడకుండా మేము, ధీరు అందరూ ఆనందంగా ఉండేలా చూడు.
దుర్గ: నా చుట్టూ ఉన్నవాళ్లు అంతా నా చెల్లికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్యాయం జరగడానికి కారణం అయినవాళ్లే. ఎవరి ఎవరు ఎంత పాపం చేశారో వాళ్లకి వడ్డీతో సహా నా చేతులతో శిక్ష పడేలా చేసేలా చూడమ్మా. అలాగే పవిత్ర త్వరగా కోలుకునేలా చేయ్.
విజయేంద్ర: వైష్ణవికి, పవిత్రలకు అన్యాయం చేసిన వారిని వైష్ణవి, పవిత్రల చేతులమీదగా శిక్ష పడేలా చేసే అవకాశం నాకు ఇవ్వు తల్లి. 

పురుషోత్తం: విజయేంద్ర ఈ రెండేళ్లు అసలు ఎందుకు కాంటాక్ట్‌లో లేవు.
విజయేంద్ర: నాకు సంబంధం లేని విషయంలో నేను జైలుకి వెళ్లాను. లక్కీగా ఇప్పుడే బయట పడ్డాను. బ్యాడ్ టైం నానమ్మ ఎవరైనా కావాలనే చేయించారా అనే చిన్న అనుమానం. నన్ను జైలుకి పంపించాలి అనేంత కోపం ఎవరికి ఉంటుంది. అంత అవసరం ఏముంటుంది.
రక్షిత: మనసులో.. నాకుంది అందుకే నిన్ను జైలుకి పంపించాను. నువ్వు పెద్ద మనవుడిగా రాజవంశ వారసుడిగా జనాల్లో ఇక్కడే ఉంటే నా కొడుకుకు గుర్తింపు ఎలా వస్తుంది. రాజవంశానికి ఒక్కడే వారసుడై ఉండాలి అదీ నా కొడుకే అయి ఉండాలి అందుకే నువ్వు లైఫ్ లాంగ్ బయటకు రాకుండా జైలుకి రాకుండా ప్లాన్ చేశాను. కానీ నువ్వు ఎలా బయటకు తిరిగివచ్చావో అర్థంకావడం లేదు.
పురుషోత్తం: సరేరా జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావ్. 
విజయేంద్ర: బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తా బాబాయ్ కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడు నా ముందు వేరే బాధ్యత ఉంది అది నెరవేరాలి.
రక్షిత: ఏంటది విజయేంద్ర.
విజయేంద్ర: వైష్ణవి, పవిత్రల విషయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. దుర్గ మాటలు వింటుంది. 
రక్షిత: వాళ్ల గురించి నువ్వేం తెలుసుకోవాలి విజయేంద్ర.
విజయేంద్ర: పవిత్ర, వైష్ణవిల గురించి నాకు పూర్తిగా తెలుసు పిన్ని. అదే ఈ ప్రపంచానికి తెలిసేలా చేయాలి. అంతకంటే ముందు వాళ్లిద్దరూ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. కలిసి మాట్లాడాలి.
నానమ్మ: నువ్వు ఇంకా వాళ్లని నమ్ముతున్నావా.
విజయేంద్ర: ఎప్పటికీ నమ్ముతాను నానమ్మ. ఇప్పటికి అయితే నా ముందు ఉన్న బాధ్యత ఇదే బాబాయ్.
ధీరు: బ్రో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీ ఆలోచనలు కరెక్ట్‌గానే అనిపిస్తాయి. ఒక్కసారి వాళ్ల గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే వాళ్లేంటో నీకు అర్థమవుతుంది. 
విజయేంద్ర: జనాలు చెప్పేవి నేను నమ్మను నా మనసు చెప్పేదే నేను నమ్ముతాను. 
దుర్గ: ఏమైంది విజయేంద్రకి. సడెన్‌గా మా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్ను నేను ఎలా నమ్మాలి. మేము ఎందుకు నమ్మాలి. మాకు నీ అవసరం ఉన్నప్పుడు మమల్ని పట్టించుకోకుండా రోడ్డున వదిలేసి.. కనీసం బతికిఉన్నామా చచ్చామా అని కూడా పట్టించుకోలేదు. రెండేళ్ల తర్వాత కళ్ల ముందుకు వచ్చి ఇప్పుడు మా మీద నమ్మకం ఉందని న్యాయం చేస్తాను అని మంచోడిలా మా మీద ప్రేమ ఉన్నట్లు  నటిస్తున్నావా ఇంక నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. 
పురుషోత్తం: ఇప్పుడు ఇవన్నీ ఎందుకు విజయేంద్ర వదిలేయ్ ఇంట్లో పూజ జరిగింది మంచి విషయాలు మాట్లాడుకుందాం. 

రక్షిత వాసుకి ఫోన్ చేసి దుర్గతో పాటు విజయేంద్ర మీద కూడా ఓ కన్నేసి ఉండమని చెప్తుంది. విజయేంద్ర ఆమెరికా నుంచి వచ్చిన వెంటనే ఇంటికి కూడా వెళ్లకుండా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడని మొత్తం చెప్తుంది. ఇక దుర్గని చూసిన రక్షిత దుర్గ మీద రోజు రోజుకు అనుమానం పెరుగుతుంది అని అనుకుంటుంది. ఇక రక్షిత దుర్గతో ఎవర్ని అయినా ప్రేమించావా. ఎవర్ని అయినా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నావా అని అడుగుతుంది. దీంతో దుర్గ కొందరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అందుకే అలాంటివి ఏం లేవు అని చెప్తుంది.  

మరోవైపు పురుషోత్తం సీక్రెట్‌గా రేష్మతో డార్లింగ్ అని మాట్లాడటం ధీరు వింటాడు. ఇక పురుషోత్తం రేష్మని తన ఇంట్లోనే కలుద్దామని అంటాడు. ఇక ధీరు తనలో తాను డాడ్ నువ్ కనిపించవు కానీ ఆటగాడివే ఈ విషయం మమ్మీకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అని అనుకుంటాడు. ఇక ఈ విషయం అమ్మకి చెప్పకుండా అవసరం అయినప్పుడు ఈ లింక్ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటా అని అనుకుంటాడు. ఇక దుర్గ అందరికీ చెప్పి బయల్దేరుతుంది. ఇక దుర్గకు వాయినం ఇవ్వమని రక్షితకు జయ చెప్తుంది. రక్షిత వాయినం ఇస్తున్నట్లే ఇచ్చి కావాలనే కుంకుమ కింద తోస్తుంది. దీంతో సమయానికి విజయేంద్ర పట్టుకుంటాడు. ధీరు అది చూసి రగిలిపోతాడు. ఇక రక్షిత వాయినం ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'త్రినయని' సీరియల్ ఫిబ్రవరి 14th: సుమనకు బుద్ధి చెప్పేందుకు ఉలూచిలా మారిన విశాలాక్షి.. ఆఫీస్‌కు తీసుకొచ్చిన విక్రాంత్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India vs Zimbabwe, 2nd T20I: షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
షేక్‌ ఆడించిన అభిషేక్‌ శర్మ, రెండో టీ20లో టీమిండియా భారీ స్కోరు
Andhra Pradesh: టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
టీడీపీ వాళ్లు పవన్ కళ్యాణ్‌కు గుడి కట్టాలి, డిప్యూటీ సీఎంను గౌరవించాలి- మార్గాని భరత్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Embed widget