అన్వేషించండి

Oorvasi Vo Rakshasi Vo Serial Today February 7th: ఊర్వశివో రాక్షసివో సీరియల్: రక్షిత చేతికి చిక్కిన భవ్య, మధుసూదన్.. వైష్ణవి, పవిత్రల కోసం విజయేంద్ర ఆరా!

Oorvasi Vo Rakshasi Vo Serial Today Episode విజయేంద్ర పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వైష్ణవి, పవిత్రల గురించి ఎంక్వైరీ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Oorvasi Vo Rakshasi Vo Today Episode  విజయేంద్ర వైష్ణవి స్కెచ్‌ వేయిస్తాడు. అది గాలికి ఎగిరి దుర్గ కారు మీద పడుతుంది. విజయేంద్ర దుర్గని చూడడు. దుర్గ విజయేంద్రని చూస్తుంది. ఇక ఆ చార్ట్ తీసుకొని విజయేంద్ర వెళ్లిపోతాడు. మరోవైపు దుర్గ పరుగుపెట్టుకుంటూ హాస్పిటల్‌కి వస్తుంది. అప్పటికే కొందరు మధుసూదన్‌ని తీసుకెళ్లిపోతారు. డాక్టర్‌ని దుర్గ అడిగితే మీ వాళ్లు వచ్చి తీసుకెళ్లారు అని డాక్టర్ చెప్తాడు. దుర్గ తల పట్టుకుంటుంది.

దుర్గ: ఓమైగాడ్ ఇప్పుడు భవ్య, బాబాయ్‌లు ఇద్దరూ ఆ రాక్షసి చేతుల్లోకి వెళ్లిపోయారా.. ఇప్పుడు వాళ్లని ఎలా సేవ్ చేయాలి.. పవిత్రకు ఎలా న్యాయం చేయాలి. ఇన్ని రోజులు నేను పడ్డ శ్రమ అంతా వృథా అయిపోయినట్లేనా.. ఇప్పుడు నేను ఏం చేయాలి.. అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలి..అంటూ అక్కడే ఉన్న వినాయకుడిని ప్రశ్నిస్తుంది. భవ్యకు అన్యాయం చేసిన వాళ్లని వదిలేశావ్.. నా చెల్లిని పిచ్చిది అని ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్‌లో వేసి దానికి నరకం చూపిస్తున్నావ్. ధర్మం వైపు నిలబడ్డ మధుసూదన్ బాబాయ్‌కి కళ్లు పోయేలా చేశావ్. ఇన్నేళ్ల తర్వాత పవిత్రకు న్యాయం జరుగుతుంది అనుకునేలోపు మళ్లీ నువ్వు ఆ రాక్షసులకు న్యాయం జరిగేలా చేస్తున్నావ్ ఎందుకు. చెప్పు ఎందుకిలా చేస్తున్నావ్. మేమేం పాపం చేశాం మమల్నిఎందుకు ఇలా శిక్షిస్తున్నావ్..
దుర్గతండ్రి: అమ్మా దుర్గ ఆవేశపడకు ప్లీజ్ తల్లీ..
దుర్గ: నేను ఎవరి మాటా వినను నాన్న ఈయన (వినాయకుడు) నాకు సమాధానం చెప్పాలి. నేనేం తప్పు చేశానో నాకు ఇప్పుడే సమాధానం చెప్పాలి. నేను గెలవడానికి న్యాయాన్ని గెలిపించడానికి ఇంకా రెండు అడుగుల దూరం ఉంది అంటే ఆనంద పడ్డాను. పవిత్రకు న్యాయం జరుగుతుంది అని అనుకున్నాను. కానీ అంతా ఈయన వల్లే చెప్పు ఎందుకు ఇలా చేస్తున్నావ్. 
దుర్గతండ్రి: అమ్మా దుర్గ కూల్.. ఆవేశంలో కోపంలో ఉన్నప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కూల్‌గా ఆలోచించు ఇప్పుడు భవ్యని, మధుసూదన్ గారిని ఎలా రక్షించాలో ఆలోచించు.
దుర్గ: నాకు ఏం అర్థం కావడం లేదు నాన్న నాకు వాళ్లని సేవ్ చేసే ఎలాంటి దారి కనిపించడం లేదు. నా పవిత్రకు నేను న్యాయం చేయలేను అనిపిస్తుంది. నా చెల్లి కోసమే నేను ఇన్ని రోజులు బతుకుతూ వస్తున్నా అలాంటిది ఇప్పుడు నేను న్యాయం చేయలేకపోతే నేను బతికున్నదానికి అర్థం ఏముంది నాన్న. నేను బతకడం అనవసరం అనిపిస్తుంది నాన్న.. నేను బతకును.. నేను బతకను.. బతకలేను.. 

ఇంతలో ఎవరో దుర్గకు ఫోన్ చేసి ఆ రక్షిత గారు భవ్యను, మధుసూదన్‌ను ఎక్కడ దాచారో తెలిసింది అని చెప్తాడు. ఇప్పుడే వస్తున్నా అంటూ దుర్గ పరుగులు తీస్తుంది. మరోవైపు విజయేంద్ర పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. వైష్ణవి, పవిత్రల గురించి అడుగుతాడు. దీంతో పోలీసు ఎవరు వాళ్లు ఎప్పటి నుంచి టచ్‌లో లేరు అని అడుగుతాడు.

విజయేంద్ర: రెండేళ్ల నుంచి టచ్‌లో లేరు. వాళ్ల నాన్న పేరు రాము రాజవంశం వాళ్లదగ్గర డ్రైవర్‌గా పనిచేసేవారు. 
వెంకటరమణ: హో వాళ్లా డబ్బులు కోసం ఏ ఆడపిల్లలూ చేయని పనులు వాళ్లు చేసేవారు. 
విజయేంద్ర: డబ్బుల కోసం అలాంటి పనులు చేసేవారు కాదు సార్ వాళ్లు.
వెంకటరమణ: వాళ్లు ఎలాంటి వాళ్లు తెలిసే వాళ్ల అమ్మానాన్న ఉరి వేసుకొని చచ్చిపోయారు. కానీ నువ్వు మాత్రం వాళ్లని వెనకేసుకొని వస్తున్నావు. వాళ్లకి నీకు ఏంటి సంబంధం.
విజయేంద్ర: నేను వైష్ణవి లవ్‌లో ఉన్నాం సార్.. 
వెంకటరమణ: వైష్ణవేనా పవిత్ర కూడానా..
విజయేంద్ర: సార్ ప్లీజ్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. నేను యూఎస్ వెళ్లి 2 ఏళ్లు అయింది. అందుకే తనని కాన్టాక్స్ అవ్వలేకపోయా. అందుకే ఇప్పుడు వాళ్ల గురించి ఆ కేసు గురించి తెలుసుకుంటున్నాను. 
వెంకటరమణ: బ్లడ్ రిలేషన్ అయితేనే సమాచారం ఇస్తాం. నువ్వేం అవుతావో చెప్పు. మనసులో.. నా దగ్గరకే వస్తావురా చెప్తా నీ సంగతి. పవిత్ర కేసు చాలా కాంప్లికేట్ అయింది. పవిత్రదే తప్పు అని కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత వాళ్లు ఎక్కడికి వెళ్లారో ఏం చేస్తున్నావో మాకు తెలీదు. వాళ్ల అమ్మానాన్నల్లా వాళ్లు కూడా చనిపోయి ఉంటారు. వెళ్లి ఎంక్వైరీ చేసుకో..
విజయేంద్ర: బయటకు వచ్చి.. ఈ పోలీసుల్ని చూస్తుంటే నిజాన్ని దాస్తున్నారు అని అర్థమవుతుంది.

ఇక పోలీస్ వెంకట రమణ రక్షితకు కాల్ చేసి విజయేంద్ర గురించి చెప్తాడు. ఇక విజయేంద్ర యూఎస్‌లో ఉంటాడు కదా అనుకుంటుంది రక్షిత. ఇక ఎస్ఐ విజయేంద్ర ఫొటో రక్షితకు పెడతాడు. అది చూసిన రక్షిత యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చాడు. అసలు వైష్ణవి, పవిత్రల గురించి ఎందుకు కనుక్కుంటున్నాడు అని ఆలోచిస్తుంది.  విజయేంద్ర  మీద ఒక కన్ను వేసి ఉంచమని రక్షిత పోలీసులకు చెప్తుంది. ఇక తన కొడుకు భర్తలో విజయేంద్ర  వచ్చినట్లు చెప్తుంది. 

ధీరు: సో వాట్ విజయేంద్ర వస్తే నువ్వెందుకు అమ్మా అంత టెన్షన్‌ పడుతున్నావు.
రక్షిత: సో వాట్ ఏంటి  మీ ఇద్దరికీ బ్రైన్ పనిచేయడం లేదా.. ప్రతీ విషయం ఎందుకు అంత సింపుల్‌గా తీసుకుంటారు. విజయేంద్ర  యూఎస్ నుంచి వచ్చాడు. రాగానే వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లాలి. తర్వాత మన దగ్గరకు రావాలి. కానీ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వైష్ణవి, పవిత్రల గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు. అంటే వాడికి అనుమానం వచ్చినట్లే కదా. ఏదో ఒకటి చేసి నిజం తెలుసుకోవాలి అని చూస్తున్నాడు. 
పురు: ఎంత ట్రై చేసినా ఏం తెలుస్తుంది రక్షిత. కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది. వైష్ణవి వాళ్లు కానీ వాళ్ల పేరెంట్స్ ఏం చేయలేరు.
ధీరు: రౌట్ డాడ్.. విజయేంద్రకు వైష్ణవి అంటే లవ్ ఉండేది. అందుకే తన కోసం తెలుసుకోవాలి అని ట్రై చేస్తున్నాడు అంతే.
రక్షిత: నోనో ఆ విజయేంద్రను తక్కువ అంచనా వేయకూడదు. అశోక్ ఫోన్ చేస్తాడు.  వాళ్లు దొరికారు అని చెప్తాడు. నేను వస్తున్నాను నిజం చెప్పి ధీరు జీవితం నాశనం చేయాలి అనుకున్న వారు నా కళ్లముందే నాశనం అయిపోవాలి.  

మరోవైపు పవిత్ర, వైష్ణవిలు అలా చేయరు అని విజయేంద్ర అంటాడు. చిన్నప్పటి నుంచి తనకు వాళ్లు తెలుసుఅని డబ్బు మీద వ్యామోహం లేదని తన ఫ్రెండ్‌ శ్రవణ్‌తో చెప్పి బాధపడతాడు. తాను యూఎస్ వెళ్లేటప్పుడు కూడా వైష్ణవి తన గురించి ఏం చెప్పకుండా పవిత్రను యూఎస్ పంపడం గురించే అడిగింది అని అంటాడు. అలాంటిది ఇలా జరిగింది అంటే పవిత్ర, వైష్ణవిల వెనకు పెద్ద కుట్ర జరిగింది అని తనకు అనుమానంగా ఉందని అంటాడు. ఇక ఆ నిజాన్ని ఎలా నిరూపిస్తావ్ ఎవరు చెప్తారు అని విజయేంద్రని తన ఫ్రెండ్ అడిగితే మా అమ్మ చెప్తుంది అని విజయేంద్ర అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read:  ఈగల్‌ ట్రైలర్‌: 'ఈగల్‌' కొత్త ట్రైలర్‌ - పద్దతిగా దాడి చేసిన రవితేజ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget