Nuvvunte Naa Jathaga Serial Today September 16th: నువ్వుంటే నా జతగా: దేవా కోసం మిథున పోరాటం: నేత్ర మనసు మార్చుకుంటుందా? ఆదిత్య అసలు ప్లాన్ ఏంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 16th నేత్ర మిథునతో మాట్లాడి దేవా మీద కేసు పెట్టను.. పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటా అని చెప్పి నమ్మించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఆదిత్య పోలీస్ స్టేషన్‌కి వస్తాడు. దేవాని కలిసి నువ్వేం టెన్షన్ పడకు నీ పని అయిపోయినట్లే అని అంటాడు. దేవా షాక్ అయితే నీ బెయిల్ పని అయిపోయినట్లే.. నిన్ను నేను బయటకు తీసుకొస్తా.. ఇక నుంచి నా ఫోకస్ నీ మీదే.. ఎస్‌ఐ గారు మీరు తనని బయట ఎందుకు కూర్చొపెట్టారు.. తను ఎవరో తెలుసా నా మనిషి తను.. నా మనిషిని బయట కూర్చొపెడతారా.. మీ మీద ప్రైవేట్ కేస్ పెట్టి మిమల్ని కోర్టు మెట్లు ఎక్కించకపోతే అలా అడగండి అని అంటాడు.
ఎస్‌ఐతో కానిస్టేబుల్ అటు ఎప్పీ గారు ఇటు లాయర్ గోటితో పోయే దానికి గొడ్డలి వరకు ఎందుకు తీసుకురావడం అని అంటాడు. ఆదిత్య మిథునతో దేవా గురించి టెన్షన్ పడకు మిథున నేను చూసుకుంటా.. అని అంటాడు. ఇక ఎస్‌ఐ మిథునని లోపలికి రమ్మని చెప్తాడు. మిథున హ్యాపీ గా దేవా దగ్గరకు వస్తుంది. మిథున దేవాని చూసి ఎమోషనల్ అయి దేవా చేయి పట్టుకుంటుంది. దేవా కూడా ఎమోషనల్ అయిపోతాడు కానీ వెంటనే మాట గుర్తొచ్చి దేవా చేయి విడిపించుకుంటాడు. మిథున ఫీలవుతుంది..
ఆదిత్య ఫోన్ చూసుకుంటూ దేవా కోసం మిథున పోలీస్ స్టేషన్ బయట కూర్చొని మాట్లాడిన న్యూస్ చూస్తాడు. తండ్రిని పిలిచి చూపిస్తాడు. ఇంట్లో అందరూ చూసి షాక్ అయిపోతారు. రేప్ కేసులో అరెస్ట్ అయిన భర్త కోసం జడ్జి కూతురు ధర్నా చేస్తుందని న్యూస్ చూసి అందరూ షాక్ అయిపోతారు. పరువు పోయిందని రాహుల్, త్రిపురలు తిడతారు. అన్నీ తెలిసి కూడా వాడి కోసం మిథున ధర్నా చేస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అని హరివర్థన్ అంటాడు. రాహుల్ వీడియో వైరల్ కాకుండా చూడాలని వెళ్తాడు. మరో అమ్మాయితో ఉంటూ నా కూతురికి అన్యాయం చేస్తే నా కూతురు వదిలేస్తుంది కానీ నేను వదలను అని అంటాడు.
ఎస్‌ఐ దేవా వినేలా.. ఇంత అందమైన భార్య ఉంటే నేను నరకానికైపోతా వీడు మాత్రం ఎదురింటికి వెళ్లాడు.. బొద్దిగా సౌందర్యపోషణ తెలీదు వీడికి అని అనగానే దేవా ఆవేశం, కోపం కట్టలు తెంచుకొని చేయి గట్టిగా డోర్‌కి కొడతాడు. దేవా చేతి నుంచి రక్తం రావడంతో మిథున చాలా కంగారు పడి లాక్ ఓపెన్ చేయమని అంటుంది. మిథున లోపలికి వెళ్లి దేవాకి కట్ట కడుతుంది. దేవా మిథునని వెళ్లిపోమని అంటే మిథున తినమని చెప్తుంది. దేవా వద్దని మొండికేస్తే బలవంతంగా తినిపిస్తుంది.
దేవాతో మిథున నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు తెలుసు. నేను నేత్రతో మాట్లాడుతా తను కేసు వెనక్కి తీసుకునేలా చేస్తా అని అంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య నేత్రతో మాట్లాడి వాడిని బయటకు తీసుకొస్తావా.. వాడిని నీకు శాశ్వతంగా దూరం చేయాలి అనే ఇదంతా చేశా మిథున నీకు ఊహించని షాక్ ఇస్తా చూడు అని నేత్రకి కాల్ చేస్తాడు. రంగం స్నానం చేసి వచ్చి కాంతానికి తల తుడమని అంటే కాంతం రంగం తనని కొట్టిన విషయం గుర్తు చేసుకొని బట్టలు రంగం మీదకు విసిరేస్తుంది. తనని చెంప వాచిపోయేలా కొట్టావని ఏడుస్తుంది. మా తమ్ముడిని అంటే కోపం రాదా అని అంటాడు. నీ కోపం తగ్గాలి అంటే ఏం చేయాలి అని రంగం అంటే రంగం దగ్గర పది వేలు తీసుకుంటుంది. ఇంకోసారి కొట్టాలని చేయి ఎత్తితే పది వేలు గుర్తు రావాలి అని అంటుంది.
నేత్ర టెన్షన్‌గా ఈ ఆదిత్య ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు.. మిథునతో ఇప్పుడేం మాట్లాడాలి అనుకుంటుంది. ఇంతలో మిథున వస్తుంది. మిథున నేత్రతో ఉద్యోగం చేస్తున్నావ్ అమ్మానాన్నలకు ఆర్థికంగా సాయం చేస్తున్నావ్ మంచిదానివి అని నీ మీద మంచి అభిప్రాయం ఉండేది దాన్ని పోగొట్టుకోకు అని అంటుంది. అంటే దేవా తప్పు చేయలేదని అంటున్నావా అని నేత్ర అంటే గుడిలో దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో నా దేవా మరో అమ్మాయి వైపు కనెత్తి కూడా చూడడు అనేది అంత కంటే నిజం అంటుంది. నేత్ర మనసులో భర్త మీద ఇంత నమ్మకం ఉందా అని అనుకుంటుంది. నేత్ర పోలీసులు పిలిచారని చెప్తుంది. దేవా మంచోడే కాదు అనను కానీ ఆరోజు తాగిన మత్తులో నా మీదకు వచ్చుంటాడు అని అంటుంది నేత్ర. దేవా ఏం చేశాడో నేను అడిగానా నువ్వు చెప్పాలి అనుకున్నది చెప్పు అంటుంది.
నేత్ర ఏడుస్తూ ఇప్పుడు నేను కేసు వేస్తే కోర్టులు ఎంక్వైరీలు అని నన్ను తిప్పుతారు. పెళ్లి కావాల్సిన దాన్ని కదా.. కేసు వాపస్ తీసుకుంటా అని అంటుంది. నువ్వు కేసు వాపస్ తీసుకుంటే దేవా మీద పడిన నింద పోదు కదా.. కేసు అయి నిరూపించుకుంటే కదా అవుతుంది అని మిథున అంటే మిథున దేవాకి నువ్వేంటే చాలా ఇష్టం తాగిన మైకంలో మిథున మిథున అంటూనే నా దగ్గరకు వచ్చాడు.. మీ ఇద్దరూ బాగుండాలి మిథున.. సాటి ఆడదానిగా నా బాధ అర్థం చేసుకో మీ ఇద్దరూ బాగానే ఉంటారు మధ్యలో నా జీవితం నాశనం అయిపోతుందని ఏడుస్తుంది. ఎస్‌ఐకి దేవా మీద పర్సనల్ గ్రజ్ ఉంది అందుకే నాకు ఎఫ్‌ఐఆర్ రాయమని అంటున్నాడు.. అందుకే నువ్వు నాకు అండగా ఉండాలని కోరుతున్నా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















