అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today May 9th: నువ్వుంటే నా జతగా సీరియల్: ఓయ్ డార్లింగ్.. అందరిముందు శ్రీవారిని ముద్దు పేరుతో పిలిచిన మిథున..!

Nuvvunte Naa Jathaga Today Episode మిథునని దేవాని కలపడానికి బేబీ ప్రయత్నాలు చేస్తున్నట్లు దగ్గరుండి దేవాకి మిథునకు గోరింటాకు పెట్టమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode భాను బేబీ బామ్మతో దేవా, మిథున పెళ్లి గురించి నిజం చెప్పేస్తుంది. మిథునని తరిమేసి నాకు దేవాకి పెళ్లి చేస్తా అని మాట ఇచ్చావ్ కదా మాకు పెళ్లి చేయ్ అని అంటుంది. బేబీ మిథునని పిలిచి సీరియస్‌గా చూస్తూ పాన్ ఇవ్వమని అంటుంది. పాన్ నోట్లో పెట్టుకొని నములుతూ మిథునని బయల్దేరమని నెట్టేస్తుంది. దేవాని లవ్ చేసిన నువ్వు వీళ్ల పెళ్లిని తట్టుకోలేక ఇలా అంటున్నావ్ వాళ్ల మధ్య అన్యోన్యత చూసి వాళ్లది లవ్ మ్యారేజ్ అని నాకు అర్థమైందని అంటుంది. 

భానుని ఇంకెప్పుడు ఇంటికి రావొద్దని నువ్వు మంచి దానివే అయినా నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటారు. ఇక్కడికి రాకు దేవా వైపు చూడకు మంచి కుర్రాడిని చూసుకొని పెళ్లి చేసుకొ అని పంపేస్తుంది. భాను ఏడుస్తూ వెళ్లిపోతుంది. భాను ఏడుస్తుంది అంత కఠినంగా చెప్పకుండా ఉండాల్సింది అని శారద బేబీతో అంటే కఠినంగా చెప్తేనే తను దేవాని మర్చిపోయి తన జీవితం తాను చూసుకుంటుందని అంటుంది. సూర్యకాంతం, శ్రీరంగం డిసప్పాయింట్ అయిపోతారు. 

లలిత మిథునతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని సంతోషపడుతుంది. భర్తకి కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. మిథున గురించి మాట్లాడుతుంది. మిథున అత్తారింట్లో సంతోషంగా ఉందని మిథున ఇక్కడికి తీసుకురావడానికి తనని బాధ పెట్టొద్దని వాళ్లని అంగీకరించి సంతోషంగా ఉందామని అంటుంది. బుద్ధి లేకుండా మాట్లాడకు ఆ రౌడీని అల్లుడిగా అంగీకరించాలా అని లలిత మీద అరుస్తారు. నా కూతురి జీవితంతో పాటు నా పరువు తీసుకోమంటావా అని అరుస్తాడు. ఆ రౌడీ గురించి నువ్వు మాట్లాడటం ఇదే చివరి సారి అవ్వాలని నా కూతురు నా ఇంటికి వస్తుంది చూస్తూ ఉండు అని సీరియస్‌గా చెప్పి వెళ్లిపోతారు.

రాత్రి కాంతం అందరి కోసం గోరింటాకు నూరుతుంది. ముసలి వచ్చి గరుడ పురాణంలో ఉన్న శిక్షలు అన్నీ కొత్తగా నా చేతి చేయిస్తుందని తిట్టుకుంటుంది. ఇంతలో కాంతం గోరింట పూసింది అని పాట పెడతాడు. కాంతం కోపంతో భర్త ముఖం మీద గోరింటతో కొడుతుంది. నూరి నూరి చచ్చేలా ఉన్నానని అంటుంది. ఇంతలో బేబీ గోరింట ఆకు నూరడం అయిందా అని అడుగుతుంది. అయింది అని తీసుకెళ్లి ఇస్తుంది. ఇక బేబీ ముద్దుల మనవరాలిని, దేవాని పిలుస్తుంది. ఇద్దరినీ చెరో పక్కన కూర్చొపెట్టుకుంటుంది. కాంతం కోపంతో రగిలిపోతుంది. మిథునతో బంగారు తల్లి మీ అమ్మానాన్న గురించి నాకు ఎవరూ చెప్పలేదు ఏంటి నీ పుట్టింటి గురించి చెప్పు బంగారు తల్లి అంటుంది. చెప్పొద్దు అని దేవా తలూపుతాడు. మా నాన్న జడ్జి అని చెప్తుంది.

మిథున తన తండ్రి జడ్జి అనగానే బేబీ నోరెళ్లబెడతుంది. షాక్ అయి టెన్షన్ పడుతుంది. ఏమైందని అని మిథున అడిగితే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు మీ నాన్నకి కోపం ఉంటుంది. వీడేమో దిక్కుమాలిన రౌడీయిజం మానడం లేదు. మీ నాన్న వీడి మీద ఏమైనా కేసు పెడితే ఏంటమ్మా పరిస్థితి అని అంటుంది. అలాంటి పరిస్థితి వస్తే చూసుకోవడానికి నేను ఉన్నాను కదా బేబీ అంటుంది.   దేవా అంతే కదా చెప్పు అని మిథున అంటుంది. దానికి బేబీ అలా పేరు పెట్టి పిలిస్తే తప్పమ్మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. నేను మీ తాతయ్యని బావ బావ అని పిలిచేదాన్ని అని అంటుంది. నువ్వు కూడా ముద్దు పేరు పెట్టుకొని పిలు అని అంటుంది. మా శ్రీవారిని ఏమని పిలవాలి అని మిథున అంటుంది. నాకు పెళ్లి అయిన తర్వాత మా ఆయన్ని డార్లింగ్ అని పిలవాలని తెలిసీ తెలియని వయసులో అనుకున్నా అంటుంది. ఒకసారి పిలు అని బేబీ అంటుంది. మిథున దేవాని డార్లింగ్ అని పిలుస్తుంది. అలా పిలిస్తే గుద్దుగా అని దేవా వార్నింగ్ ఇస్తాడు. ఓవర్ చేయకు అని అంటాడు. బామ్మ తెగ సిగ్గు పడిపోతుంది. ఇక మిథునకు గోరింటాకు పెట్టమని దేవాకి చెప్తుంది. నేను పెట్టను అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: చిన్ని రాజు కూతురని దేవాకి తెలిసిపోతుందా.. అన్న సంతోషం చూసి పొంగిపోయిన కావేరి!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 17th: 'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
'గోదావరి' సీరియల్: తమ్ముడిని రెచ్చగొట్టిన నిత్య! సూర్య కోసం అందంగా ముస్తాబైన జానుకి నిశ్చితార్థం గురించి తెలుస్తుందా!
Nindu Manasulu Serial Today August 17th: నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
నిండు మనసులు: మంజు ఇంట్లో ఘనంగా వరలక్ష్మీ వ్రతం! కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కారణమేంటో తెలుసా!
Nindu Noorella Saavasam Serial Today August 17th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలోకి దూరిన ప్రచండ – ప్రచండకు వార్నింగ్‌ ఇచ్చిన మనోహరి
Jabardasth Pavithra : జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?
జబర్దస్త్ పవిత్ర బ్రేకప్ స్టోరీ - హీరోయిన్ అనుపమకు జరిగినట్లే జరిగిందా!... అసలేంటీ నార్సిస్టిక్ అబ్యూస్?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget