Nuvvunte Naa Jathaga Serial Today May 5th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున జడలో పూలపెట్టిన దేవా.. భాను గుండె ముక్కలైపోయిందా!
Nuvvunte Naa Jathaga Today Episode బేబీ మిథున, దేవాలను కలిపి మార్కెట్‌కి పంపడం దేవా మిథున జడలో పూలు పెట్టడం భాను చూసేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సూర్య కాంతం ఇంటి పని చేయకుండా ఎప్పుడూ నడుంనొప్పి అని తప్పించుకుంటూ ఉంటుంది. అది తెలుసుకున్న బేబీ రోకలి బండ ట్రీట్మెంట్ అని రోకలితో నడుం మీద వాయిస్తే దెబ్బకు నడుం నొప్పి సెట్ అవుతుందని అంటుంది. బామ్మకి భయపడిన కాంతం బిందె పట్టుకొని నీరు తీసుకొస్తా అని పరుగులు పెడుతుంది. ఇక సత్యమూర్తి ఆకుకూరలు తీసుకొస్తే బేబీ అవి తినను నాకు మటన్ కావాలని అంటుంది. ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది అని టీచర్ చెప్పినా వినదు. నాకు నల్లిబొక్కల మటనే కావాలని దేవాని తీసుకురమ్మని చెప్తుంది. దేవాతో పాటు మిథునని కూడా పంపుతుంది. దేవా మిథునని తీసుకెళ్లను అంటే బలవంతంగా పంపుతుంది.
మరోవైపు పురుషోత్తం జడ్జి దగ్గరకు వెళ్లి పోలీస్‌లతో నాకు నోటీసులు పంపారేంటి సార్ అని అడుగుతాడు. దానికి జడ్జి ఎవరి ఇంటి దగ్గర ఉండి మాట్లాడుతున్నావో గుర్తించి నోరు తగ్గించి మాట్లాడు. ఓ జడ్జి ఇంటికి వచ్చి ఇలా మాట్లాడావని తెలిస్తే నిన్ను జీవితాంతం జైల్లో ఉంచుతారని అంటాడు. పురుషోత్తం పోలీసులు ఎంక్వైరీకి పిలిచారని నా కేసులు మీరే తిరగ రాస్తున్నారని ఇప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని అంటాడు. నా కూతురిని నా దగ్గరకు పంపమని చెప్పాను కదా నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని అంటాడు. మీ అమ్మాయితో ఇప్పటికే మాట్లాడాను కానీ తను రావడం లేదు అంటాడు. నా కూతురు నా దగ్గరకు రావాలి లేదంటే నీ జీవితం జైలుపాలవుతుందని అంటాడు.
దేవా గాడి వెనక నువ్వు ఉన్నావ్ అని వాడి ధైర్యం. వాడు గుడిలో తాళి కట్టాడు అంటే అంత ధైర్యం ఎలా వచ్చింది వాడి వెనక రౌడీ పురుషోత్తం ఉన్నాడు అనే కదా నిన్ను కూలదొక్కితే వాడు దారిలోకి వస్తాడని జడ్జి అంటారు. పురుషోత్తం ఎంత బతిమాలినా నీ కూతురు నా ఇంటికి వచ్చేలా చేయ్ లేదంటే జైలుకి వెళ్లడానికి రెడీగా ఉండు అని అంటాడు. దేవా బండి మీద కూర్చొని నా జీవితానికి శని ఈవిడ అనుకుంటే ఈవిడను ఎలా వదిలించుకోవాలా అనుకుంటే ఊరంతా చూసేలా నేను తీసుకెళ్లాలా అని తిట్టుకుంటాడు. జరిగింది మీ నాన్నమ్మకి చెప్పేసి మా ఇంటికి వెళ్లిపోతా అని మిథున అని బేబీ బేబీ అని పిలిస్తే దేవా మిథునని బతిమాలుతాడు. సారీ చెప్తే వస్తానని మిథున అంటుంది. దేవాతో సారీ చెప్పించుకున్న తర్వాత మార్కెట్‌కి వెళ్తుంది. నాన్నమ్మ వెళ్లిపోయిన తర్వాత నీ పని చెప్తా అని దేవా అంటాడు. అంత సీన్ లేదని మిథున అంటుంది.
భాను తన ఫ్రెండ్స్‌తో దేవాని పెళ్టి చేసుకుంటా అని చెప్తుంటుంది. తనని తన రాజాని ఎవరూ వేరు చేయలేరని అనుకుంటుంది. ఇంతలో తన ఫ్రెండ్స్ మిథున దేవా బైక్ మీద వెళ్లడం భానుకి చూపిస్తారు. మిథునతో దేవా గాల్లో ఎలా తేలిపోతున్నారో చూడు అని భానుని ఏడిపిస్తారు. ఇద్దరి సంగతి చెప్తానని భాను అనుకుంటుంది. మిథున, దేవా మార్కెట్‌కి వెళ్తారు. దేవా చేతిలో మిథున బ్యాగ్ పెట్టి ఫాలోమి అంటుంది. మిథున దేవాతో బాగా ఆడుకుంటుంది. ఇంతలో ఇద్దరు వచ్చి మీ జంట సూపర్ అన్న అని అంటారు. వాళ్లని కొట్టడానికి దేవా వెళ్తాడు. మార్కెట్‌లో ఓ బామ్మ దేవాని పిలిచి నీ వల్ల నా కొడుకు బతికాడు అయ్యా నీ మంచి తనం కారణంగా లక్ష్మీ దేవా లాంటి భార్య నీకు దొరికిందని అంటుంది. దేవా వెనక్కి తిరిగి తలబాదుకొని ప్రతీ ఒక్కరూ భార్య భార్య అని చంపేస్తున్నారని అనుకుంటాడు. ఇక మథున కోసం దేవాకి మల్లెపూలు ఇచ్చి నీ భార్యకి ఇవ్వు నాయనా అంటుంది. భార్య తలలో పెట్టండి అని చెప్తుంది. దేవా తిట్టుకుంటూ పెడతాడు. ఇంతలో భాను వచ్చి ఏం చేస్తున్నావ్‌రా ఏంట్రా ఇది అని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: నేను నీ ఫాలోవర్‌ని బేబీ.. మతడ పెట్టేసిన మిథున.. కాంతానికి రోకలి ట్రీట్మెంట్!





















