Nuvvunte Naa Jathaga Serial Today May 29th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున టార్చర్ 2.0 స్టార్ట్స్.. కొంటెగా చూస్తే దేవాకి చుక్కలు చూపించిన మిథున!
Nuvvunte Naa Jathaga Today Episode మిథునకు నల్లపూసలు గుచ్చే కార్యక్రమం చేయాలి అని లేదంటే అరిష్టం అని స్వామీజీ హరివర్దన్‌తో చెప్పడం చచ్చినా చేయను అని జడ్జి అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode సత్యమూర్తి కూడా మిథునని వెళ్లిపోమని అంటే మీ అమ్మగారు ఉన్నప్పుడు ఎందుకు ఈ మాట చెప్పలేదు అని మిథున నిలదీస్తుంది. అందరితో పాటు మీరు కూడా నేను దేవా ప్రేమ పెళ్లి చేసుకున్నాం అని సమర్దించి ఆవిడ ఉన్నన్ని నాళ్లు నన్ను కోడలిగా ఆడించి ఇప్పుడు వెళ్లిపోమని అంటున్నారు తప్పు సార్ అని అంటుంది.
మిథున: నాకు మనసు ఉంది సార్. నాకు ఎమోషనన్స్ ఉన్నాయి సార్. నాకు వ్యక్తిత్వం ఉన్నాయి సార్. ఒక ఆడ పిల్ల ఎమోషన్స్‌తో ఆడుకోవడం మీకు తప్పు అనిపించడం లేదా సార్.
దేవా: ఓయ్ మా నాన్ననే ప్రశ్నిస్తావా. చెప్పింది చాల్లే ఇక బయల్దేరు.
మిథున: ఎక్కడికి వెళ్లేది. నువ్వు నా మెడలో తాళి కట్టినప్పుడే నేను నీ భార్యని ఈ ఇంటి కోడలిని అయ్యాను. ఇక్కడ ఉండే హక్కు నాకు ఉంది. నన్ను వెళ్లిపోమని చెప్పే అధికారం ఎవరికీ లేదు. నన్ను వెళ్లిపోమని చెప్పే హక్కు కూడా నీకు లేదు. మనసా వాచా ఖర్మన ప్రకారమే కాదు చట్ట ప్రకారం కూడా నేను నీ భార్యనే. నా స్థానంలో మీ కూతురు ఉంటే ఇలాగే నాటకాలు ఆడిస్తారా సార్. అవసరం తీరాక ఇలాగే వెళ్లిపోమని చెప్తారా సార్. తప్పని గానీ అయ్యె కూతురి లాంటి ఆడపిల్ల అని గానీ మీ మనసాక్షి చెప్పడం లేదా సార్.
దేవా: ఏంటే చట్ట ప్రకారం కూడా నువ్వు నాకు భార్యవా. మరో జన్మ ఎత్తినా నేను నిన్ను భార్యగా చూడను.
మిథున: లేదు నువ్వు నన్ను భార్యగా చూస్తున్నావ్ అందుకే ఇక్కడి నుంచి వెళ్లిపోమని అంటున్నావ్.
దేవా: ఏంటి తిక్కా నీకు ఏమైనా నేను నీకు కలలో కూడా చూడను.
మిథున: అలా అయితే నేను ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లమ్ ఏంటి.
దేవా: నాకు టార్చర్‌గా ఉంది.
మిథున: అయితే నువ్వు నన్ను భార్యగా ఫీలవుతున్నావ్. నువ్వు నిజంగా నన్ను భార్యగా ఫీలైతే చెప్పు వెళ్లిపోతా. నీ మనసులో నేను ఉంటే చెప్పు వెళ్లిపోతా లేను అంటే వెళ్లను ఇక్కడే ఉంటా. నీ మనసులో నేను ఉన్నానని నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను వెళ్లిపోతా అంటుంది.
దేవా: పొరపాటున భార్యగా ఒప్పుకుంటే అదో టార్చర్. ఇక్కడే ఉంటే ఇంకో టార్చర్ ఇలా మెలిక పెట్టింది ఏంట్రా బాబు.
హరివర్దన్ ఇంటికి స్వామీజీ వస్తారు. మీ అమ్మాయి పెళ్లి జరిగి ఇన్ని రోజులు అయినా నల్లపూస తంతు జరిపించారా అని అడుగుతారు. నా కూతురి మెడలో పడిన తాళి ఎప్పుడెప్పుడు తీయిస్తానా అని చూస్తే మీరేంటి స్వామి ఇలా అంటారు అని హరివర్దన్ అంటారు. దానికి స్వామీజీ అది పార్వతి పరమేశ్వరుల అనుగ్రహంతో జరిగింది. వాళ్ల పెళ్లిని మీరు అంగీకరించాలి నల్లపూసల వేడుకు మీరు జరిపించాలి అంటారు. అది జరగదు అని అది అసలు పెళ్లే కాదు. గాలికి వెళ్లిన తాడు నా కూతురి మెడలో పడింది అనుకుంటా నా కూతురికి నేను చూసిన వ్యక్తితో పెళ్లి చేస్తా అంటారు. అది అసాధ్యం మీ వల్ల కాదు కదా అది ఎవరి వల్ల కాదు అని అంటారు స్వామీజీ. వెంటనే నల్లపూసల తంతు జరిపించండి అంటారు. దానికి జడ్జి అది నా గొంతులో ప్రాణం ఉండగా జరగదు అని అంటారు.
దేవా మిథున మాటలు తలచుకొని కోపంగా ఉంటాడు. వదిన గురించే ఆలోచిస్తున్నావ్ అంటూ దేవాని తన ఫ్రెండ్స్ ఆటాడిస్తారు. వస్తున్నాయ్ ఫీలింగ్స్ అంటూ పాట పాడుతారు. నేను నలిగిపోతుంటే మీకు పాటలు వస్తున్నాయా అని దేవా అంటాడు. మిథున టార్చర్ 2.0 చూపిస్తుందని దేవా వాళ్లతో చెప్తాడు. ఇంతలో మిథున అక్కడికి వస్తుంది. బయటకు వెళ్లాలి బండి తీయ్ అని అంటుంది. ఏంటి మొగుడికి ఆర్డర్స్ వేస్తున్నట్లు వేస్తున్నావ్ అంటే మొగుడివే కదా స్వామి అంటుంది. ఎలా నన్ను షాపింగ్‌కి తీసుకెళ్తావో చూడు అని దేవా పని చేస్తుంటే కొంటెగా చూస్తుంటుంది. దేవా ఇబ్బందిగా ఫీలవుతాడు.
దేవా మిథునతో అలా చూస్తావేంటి ఇబ్బందిగా ఉంది అంటాడు. నేను అంటే నీకు ఇష్టం ఉంది అందుకే ఇలా డిస్ట్రబ్ అవుతున్నావ్ అని అంటుంది. దేవా ఫ్రెండ్స్ కూడా అదే అంటారు. నా మీద ప్రేమ లేకపోతే నేను ఎంత చూసినా నువ్వు డిస్ట్రబ్ అవ్వకు అంటుంది. చచ్చిపోతున్నారా దేవుడా అని దేవా అనుకుంటాడు. దాంతో దేవా మిథునతో పడే కంటే షాపింగ్‌కి తీసుకెళ్లడం బెటర్ అని తీసుకెళ్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!





















