Nuvvunte Naa Jathaga Serial Today March 31st: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవాతో కడవెత్తించి భాను, కాంతం నోళ్లు మూయించిన మిధున.. ఆనంద్ పని అవుట్
Nuvvunte Naa Jathaga Today Episode ఆనంద్ కరెంట్ బిల్ కట్టలేదని సత్యమూర్తికి తెలియడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవా తనని భార్యగా అంగీకరించాడని ఆ విషయం నిరూపిస్తానని భానుమతితో ఛాలెంజ్ చేస్తుంది. అందుకు మిధున అక్కడున్న ముసలి వాళ్ల దగ్గరకు వెళ్లి ఏవో చెప్తుంది. దాంతో వాళ్లంతా చాట చీపురు పట్టుకొని దేవాకి ఎదురెళ్తారు. నీ భార్య నీళ్లు మోస్తూ కష్టపడుతుంటే బలాదూర్ తిరుగుతున్నావా అని అడ్డుకుంటారు. వాళ్లు దేవాని తిడుతుంటే మిధున చేతులు నొప్పి అంటూ నొక్కుతూ కూర్చొంటుంది.
దేవా వాళ్లతో ముసలి బ్యాచ్ మీకు దాని సంగతి తెలీదు.. అదో పెద్ద కంచు అని అలా చెప్తుంటే ముసలి వాళ్లు దేవాని అడ్డుకొని పెళ్లాన్ని తిడతావా అంటూ దండయాత్రకు సిద్ధపడతారు. ఇంట్లో ఇంకా ఇద్దరు కోడళ్లు ఉంటే కొత్త కోడలికి పని చెప్తారా.. అందరూ ఉండి మీ అమ్మకి చెడ్డ పేరు తెస్తారా అని బిందె తీసుకెళ్లమని దేవాకి చెప్తారు. దేవా కుదరదు అంటే చీపురు పట్టుకొని దేవా మీదకు వెళ్తారు. దాంతో దేవా మా అమ్మకి మాట వస్తుంది అన్నారు కాబట్టి తీసుకెళ్తా అని బిందె తీసుకొని వెళ్తాడు. భానుమతి అది చూసి షాక్ అయిపోతుంది. మిధున భానుతో చూశావా బక్కచిక్కిన భానుమతి నేను కష్టపడటం మా ఆయన చూడలేక బిందె తీసుకెళ్లాడు. ఇక నీ చేపల కూర వేషాలు చెల్లవని అంటుంది.
దేవా నీళ్లు మోసుకురావడం చూసి దేవా వదినలు ఇద్దరూ నోరెళ్లబెడతారు. దేవా వెనకాలే తిరుగుతారు. ఏమైందని దేవా అనుకుంటాడు. ఇద్దరూ దేవా చుట్టూ తిరగడంతో ఏంటి వదినమ్మలు ఇలా చూస్తున్నారు అంటే మా దేవా ఏనా కాదా అని చూస్తున్నాం అని అంటారు. మా దేవా ఇలాంటి పనులు చేయడు కదా అంటే నా ఖర్మ కాలి చేయాల్సి వచ్చిందని అంటాడు. దేవా తల్లిని పిలిచి ఈ మహాతల్లిని ఎందుకు నీటికి పంపావని అంటే మరి ఎవరిని పంపాలి మీ చిన్న వదినకు నడుం నొప్పి.. పెద్ద వదిన నేను పనులు చేస్తున్నాం అని అంటుంది. నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదా అంటాడు. ఇక సూర్యకాంతం దేవాతో ఏంటి భార్య మీద ప్రేమ పొంగిపోతుంది అని అంటుంది. దేవా నోరెళ్ల పెట్టి మిధునని చూస్తాడు. మిధున కావాలనే దేవాని ఉడికించినట్లు నవ్వుతుంది. నువ్వు నవ్వకు నాకు చచ్చిపోవాలి అని ఉందని దేవా అంటాడు. ఇద్దరు వదినలు ఇన్నేళ్లుగా బిందెలు మోసినా ఏ రోజు కనికరించని నువ్వు నీ భార్య కష్టపడితే చూడలేక నీరు మోశావని అంటుంది. ఈ టార్చర్‌తో చచ్చిపోవాలి అని ఉందని దేవా వెళ్లిపోతాడు.
సూర్యకాంతం దేవా నీరు తేవడం గురించి తెగ నొప్పులు పడిపోతుంది. దాంతో శారద వచ్చి దేవా తన భార్య కోసమే తీసుకొచ్చాడు అయితే నీకు ఏంటి అని కాంతాన్ని తిడుతుంది. నీకు నీరు తెమ్మంటే తెగ నొప్పులు పడతావ్ ఇప్పుడు వాళ్లు తెస్తే నీకు ప్రాబ్లమ్ ఏంటి అని కాంతాన్ని తిట్టి నోరుమూయిస్తుంది. ఇక కాంతం తన భర్త రాగానే నా కోసం నువ్వు ఎప్పుడైనా ఏమైనా చేశావా అని అడుగుతుంది. దాంతో తులాల తులాల బంగారం, లక్షలు లక్షలు డబ్బులు ఉన్నాయి కదా అంటే అది కాదు నా కోసం పంపు నుంచి నీరు తెచ్చావా అని అడుగుతుంది. దేవా మిధున కోసం నీరు తీసుకొచ్చాడని మీరు తీసుకురాలేదని అరుస్తుంది. అమ్మా మిధున అంటూ మీ అమ్మ అమ్మా అమ్మా అంటూ ఆ మిధున సెంటిమెంట్ పొంగిస్తుంటే ఇప్పుడు దేవా కూడా మారిపోతున్నాడని కాంతం కుళ్లుకుంటుంది. మనం ఉండగా అవేం జరగవు అని శ్రీరంగం అంటాడు.
సత్యమూర్తి కరెంట్ గోవింద్‌ని కలిసి కరెంట్ ఇంటికి లేదని చెప్తే మీరు కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ కట్ చేశామని చెప్తాడు. సత్యమూర్తి షాక్ అయిపోతాడు. బిల్ కట్టేశామన అంటే లేదని గోవింద్ అంటాడు. బిల్ కట్టలేదని అందుకే రాత్రి కరెంట్ తీసేశామని మీ పెద్ద కొడుకు బిల్ కట్టాడో లేదో తెలుసుకోండి అని అంటారు. డబ్బులిచ్చా కదా పెద్ద బాబు బిల్ కట్టలేదేంటి అని సత్యమూర్తి ఇంటికి వెళ్తారు. ఆనంద్‌ని పిలిచి కరెంట్ బిల్ కట్టావా అని అడుగుతారు. ఆనంద్ నీళ్లు నములుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!





















