Nuvvunte Na Jathaga Serial july 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆనంద్ సీక్రెట్ లీక్.. దేవా ప్రేమ పసిగట్టేసిన మిథున.. బేబీ దగ్గరకు ప్రేమ జంట!
Nuvvunte Na Jathaga Today Episode ఆనంద్ కూలీ పని చేస్తున్నాడని ప్రమోదినికి తెలియడం ప్రమోదిని ఎమోషనల్ అవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Na Jathaga Serial Today Episode మిథున కనిపించకపోయే సరికి దేవా చాలా కంగారు పడతాడు. మిథున కనిపించగానే చెప్పకుండా ఎక్కడికి వెళ్లావ్ అని కొట్టడానికి చేయి ఎత్తుతాడు. ఎంత కంగారు పడ్డానో తెలుసా అని తిడుతాడు. నేను ముక్కూ ముఖం తెలీనిదాన్ని అంటావ్ కదా మరి నా కోసం ఏమైతే నీకు ఏంటి అని అడుగుతుంది. దేవా అలా ఏం కాదు నాతో వచ్చావ్ నీ బాధ్యత నాది అంటాడు.
మిథున దేవాకి నువ్వు నిన్నంతా ఏం తినలేదు కదా నీకు ఆకలి వేస్తుంది అని టిఫెన్ తీసుకొచ్చా అంటుంది. దేవా మిథునని అలా చూస్తాడు. దేవా నేను కాసేపు కనిపించకపోయే సరికి కంగారు పడిపోయావ్ దీన్ని ఏంమంటారో తెలుసా అంటుంది. దేవా బాధ్యత అని అంటే కాదు ప్రేమ అని మిథున అంటుంది. మనసులో ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇంత తపన ఉంటుంది అని చెప్తుంది. నువ్వు నాతో వచ్చావ్ కాబట్టి నీ బాధ్యత నాది దానికి నువ్వు ఏదోదో అనుకోకు అంటాడు. మిథున మనసులో నాకు నమ్మకం వచ్చేసింది ఈ వారంలో నా మీద నీ ప్రేమ మా నాన్న దగ్గర నిరూపిస్తా అని అనుకుంటుంది. ఇద్దరూ బయల్దేరుతారు. ప్రియతమా.. ప్రియతమా.. పలికినది హృదయమే సరిగమా అంటూ మిథున సాంగ్ పాడుకుంటుంది. మిథున కంట్లో దుమ్ము పడితే దేవా ఊదుతాడు. మిథున దేవాని చూస్తూ ఉంటుంది.
ఎస్‌ఐ, కానిస్టేబుల్ దాసు మిథున కోసం వెతుకుతుంటారు. ఓ జంక్షన్ దగ్గర ఆగి నా మల్లెపువ్వు ఎటు వెళ్లుంటుంది అని ఎస్‌ఐ అంటాడు. ఇద్దరూ ఎటు వెళ్లాలి అనుకుంటారు. దాసు ఎస్‌ఐని తిట్టుకుంటూనే పొగుడుతాడు. ఇద్దరూ కలిసి ఓ వైపు వెళ్లుంటారని గెస్ చేసి బయల్దేరుతారు. ప్రమోదిని కూరగాయలకు వెళ్లి వస్తుంది. ఆనంద్ అలసిపోయి రోడ్డు పక్కన ఓ బల్ల మీద పడుకొని ఉంటాడు. ప్రమోదిని చూసి వెళ్లి మీరు ఇక్కడ ఏంటి.. జాబ్‌కి వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఉద్యోగానికి వెళ్తూ కాసేపు ఇక్కడ ఉన్నాఅంటాడు. ప్రమోదిని నిజం చెప్పమని మీరు మారారని నేను మిథున ఇంట్లో అందరూ నమ్మాం మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దాంతో ఆనంద్ నేను మారిపోయాను ప్రమోదిని కర్రల మిల్లలో పని చేస్తున్నా ఆ దుమ్ముకి నా వల్ల కావడం లేదు ఊపిరి ఆగిపోయేలా ఉంటే కాసేపు ఇక్కడికి వచ్చాను అంటాడు. ప్రమోదిని ఏడుస్తూ మీరు ఇంత కష్టపడి ఈ ఉద్యోగం చేయొద్దు అని నేను కుట్టు మిషన్ తొక్కుతాను మీరు ఇలాంటి పని ఇంకోసారి చేయొద్దు అని మాట తీసుకుంటుంది.
బేబీ ఇంటి ముందు ఇద్దరి దంపతుల పంచాయితీ అవుతుంటుంది. నస పెడుతుంది టార్చర్ పెడుతుంది దీన్ని వదిలేసి విడాకులు ఇచ్చేస్తా అని అంటాడు. అప్పుడే మిథున, దేవాలు వస్తారు. దేవా చప్పట్లు కొట్టి మంచి నిర్ణయం బ్రదర్ ఇద్దరూ కలసి గొడవ పడటం కంటే విడిపోవడం మంచిది అంటాడు. మిథున కలిసి బతకాలి అని దేవుడు ఇచ్చిన జీవితాన్ని నిలుపుకోవాలని అంటుంది. వాళ్ల పేరు పెట్టుకొని మిథున, దేవా వాదించుకుంటారు. పట్టుకున్న చేతిని జీవితాంతం వదలకుండా ఉండటం గొప్ప.. ఏడు అడుగులు నడిచినప్పుడు నీ మీద నమ్మకంతో నీ వెంట వచ్చింది తన నమ్మకం గెలిపించు నీ మీద ప్రేమతో ఉంటుంది అని అంటాడు. ఆ వ్యక్తి మారిపోయి భార్య అంటే మరో అమ్మ అని చెప్పావ్ తల్లి ఇకపై నా భార్య చేయి వదలను అని అంటాడు.
మిథునని అందరూ పొగుడుతారు. బేబీ కూడా నా మనవరాలు చెప్పిన తీర్పే నా తీర్పు కూడా అని అంటుంది. అందరూ వెళ్లిపోతారు. మిథున, దేవాలను బేబీ హగ్ చేసుకొని పని మనిషికి దిష్టి తీయడానికి ఏర్పాట్లు చేయమని అంటుంది. ఇక ప్రమోదిని భర్తతో మీరు డిపోలో చేస్తున్న పని ఎవరికీ చెప్పొద్దు ముఖ్యంగా రంగా, కాంతానికి చెప్పొద్దు వాళ్లు దెప్పి పొడుస్తారు. వాళ్ల బుద్ధి మంచిది కాదు అని ప్రమోదిని అంటే రంగం, కాంతం ఆ మాటలు వింటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!





















