Nuvvunte Naa Jathaga Serial Today july 17th: నువ్వుంటే నా జతగా సీరియల్: దేవా, ఆదిత్యల కోల్డ్ వార్.. ఆదిత్య మాటలకు అర్థమేంటి? డేంజర్‌లో మిథున!
Nuvvunte Naa Jathaga Today Episode ఆదిత్య దేవాని కలవడం ఇంటికి వచ్చి హరివర్దన్‌తో అంతా దేవా వల్లే అని అర్థమయ్యేలా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవాకి మిథున పట్టీ దొరుకుతుంది. అది చూసి మిథున ఇది తనని గుర్తు పట్టాలని విసిరినట్లుంది.. అంటే మిథున ఇక్కడే ఎక్కడో ఉందని అనుకుంటాడు. మరోవైపు మిథున కూడా ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తుంఇ. డోర్ తీయమని కేకలేస్తుంది. బయట నుంచి రౌడీలు అరవొద్దని అంటాడు.
మిథున తనకు కళ్లు తిరుగుతున్నాయ్ డోర్ తీయమని అడుగుతుంది. ముగ్గురు రౌడీల్లో ఒక రౌడీ డోర్ తీయమని అంటే అవన్నీ డ్రామాలని అంటాడు. మిథున మాటలు వినిపించకపోవడంతో నిజంగానే మిథున కళ్లు తిరిగి పడిపోయిందని అనుకొని లోపలికి వచ్చి చూస్తారు. మిథున నేల మీద పడిపోయినట్లు నటిస్తుంది. తర్వాత రౌడీలను కొట్టి పారిపోతుంది. రౌడీలు కూడా మిథున వెనకాలే పరుగులు పెడతారు. మరోవైపు దేవా పరుగులు తీస్తుంటాడు. మిథున చాలా దూరం పరుగెత్తి మళ్లీ రౌడీలకు దొరికిపోతుంది.
దేవాకి ఎదురుగా ఆదిత్య వస్తాడు. నువ్వేంటి ఇక్కడ అని దేవా ఆదిత్యని అడిగితే మిథున మిస్ అయిందని అంకుల్ చెప్పగానే ఆగమేఘాల మీద వచ్చానని రెండు రోజులుగా వెతుకుతున్నా దొరకడం లేదు అంటే అసలు మిథునా ఉందా లేదా అని ఆదిత్య అంటే దానికి దేవా ఉంటుంది. మిథునని నేను వెతికి తీసుకొస్తా అని అంటాడు. మిథున కోసం ఏ ఆధారం లేదని అంటే పట్టీ చూపించ ఉందని అంటాడు. మితున నీకు ఇష్టం లేదు కాబట్టి తనని నువ్వే ఇక్కడికి తీసుకొచ్చి చంపేశావు కదా అంటాడు. దానికి దేవా అలా అంటే చంపేస్తా అని అరుస్తాడు. ఇది నేను కాదు దేవా అందరూ అంటున్నారు. నేను మిథునని కాపాడుకోవడమే నా మీద పడిన నిందని తొలగించుకోవడం అవుతుంది. మిథునని కాపాడటం నా బాధ్యత. మిథునని కిడ్నాప్ చేసిన వాడిని కనిపెడతా.. ఎందుకు ఇలా చేశానురా దేవుడా అని అనిపించేలా చేస్తా అని వెళ్తాడు.
ఆదిత్య మనసులో వీడి ఆవేశం చూస్తుంటే కనిపెట్టేలా ఉన్నాడని అనుకుంటాడు. ఇక రౌడీలు మళ్లీ మిథునని తీసుకెళ్లి తోసేస్తారు. మిథున తలకు దెబ్బ తగులుతుంది. మరోవైపు అపర్ణదాస్ మిథున ఫోన్ మిస్ అయిన చోటుకి వస్తుంది. ఎలా అయినా ఈ రోజు మిథునని పట్టుకోవాలి అనుకుంటుంది. ఇంతలో దేవాని చూసి పిలుస్తుంది. తనకు కూడా మిథున కాలి పట్టీ దొరికిందని చూపిస్తాడు. అపర్ణ దేవాతో మిథున చాలా తెలివిగా ఆలోచించి ఇదో క్లూగా పెట్టిందని అంటుంది. ఇక అపర్ణ దాస్ దేవాతో మిథునని తీసుకెళ్లినవాడు డబ్బు కోసం అయితే మీకు ఈ పాటికే కాల్ వచ్చేది.. ఒక వేల మీకో వాళ్లకో ఉన్న శత్రువులు అయితే ఈ పాటికి మిథునని ఏమైనా చేయాలి. కానీ ఇదేమీ చేయలేదు అంటే వాడు పెద్ద మోటివ్‌తో కిడ్నాప్ చేశాడు అని దేవాతో చెప్తుంది.
సత్యమూర్తి హరివర్దన్‌తో మిథున ఎక్కడున్నా దేవా తీసుకొస్తాడు అప్పటి వరకు మనం ధైర్యంగా ఉందామని చెప్తాడు. అందరూ కలిసిపోవడం చూసి కాంతం ఏంటీ ప్రకృతి వైపరిత్యం మనం అర్జెంటుగా మంట పెట్టేయాలి అనుకుంటుంది. త్రిపురని పిలిచి చూపిస్తుంది. అందరూ కలిసిపోతున్నారు ఇక దేవాని అల్లుడిగా అంగీకరించడమే అని అంటుంది. త్రిపుర వెళ్లి గొడవ పడుతుంది. మిథున కనిపించకుండా పోవడానికి దేవా కారణం అయితే మీరు కలిసిపోయారు ఏంటి అని మామయ్యని ప్రశ్నిస్తుంది.
ఇంతలో ఆదిత్య ఎంట్రీ ఇచ్చి అక్కని ఆపి దేవా వల్లే మిథునకు ఈ పరిస్థితి వచ్చిందని మామయ్యకి తెలీదా.. దేవా శత్రువులే మిథునని కిడ్నాప్ చేసుంటారని మామయ్యకి తెలీదా.. దేవా కట్టిన తాళి ఆకాశమంత ఎత్తు ఉన్న మిథున జీవితం దేవా వల్ల పాతాళంలోకి పడిపోయింది అని ఆ విషయాలు వద్దు అంటూనే హరివర్దన్‌కి అన్నీ గుర్తొచ్చేలా చెప్తాడు. దేవా ఫ్యామిలీ మొత్తం దేవాకి సపోర్ట్ చేస్తారు. దేవా తన ప్రాణాలు పణంగా పెట్టి మిథునని కాపాడుతాడు అని అంటారు. దానికి ఆదిత్య దేవా రౌడీ అని తెలిసి కూడా వాడు మిథునని కిడ్నాప్ చేశాడు అంటే వాడు ఇంకెంత పెద్ద వాడో అని అంటాడు. కూతురు కళ్ల ముందే పోతే మామయ్య తట్టుకోగలరా అని అంటాడు. అన్నింటికీ దేవానే కారణం అని చెప్పి బాధ పడతాడు. అందరూ ఆలోచనలో పడతాడు. మనసులో మిథున ఆదిత్య గాడి భార్య అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















