Nuvvunte Naa Jathaga Serial Today july 16th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిథున కోసం పిచ్చోడైపోతున్న దేవా.. 'పట్టీ' మిథునని పట్టిస్తుందా!
Nuvvunte Naa Jathaga Today Episode మిథున కోసం దేవా పిచ్చోడిలా తిరగడం మిథున కాలి పట్టీ దేవాకి దొరకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున జాడ తెలీక దేవా వెతుకుతూ డీలా పడిపోతాడు. ఓచోట కూర్చొని బాధ పడతాడు. మిథున తాను ఎక్కడున్నానో తెలీక బాధ పడుతుంది. తనతో తాను దేవాని తలచుకొని మాట్లాడుతుంది. దేవా మనం కన్న కల నిజం కాదు.. కల బాగుంది అని సంబర పడేలోపు చెదిరిపోయింది. నీ మనసులోని ప్రేమని నీకు చెప్పాలి అనుకునేలోపు అలాగే చెదిరిపోయింది. ఇంకొన్ని క్షణాల్లో ఆ శివుడుపార్వతుల సాక్షిగా నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పి జీవితాంతం నీతో కలిసి ఉండాలి అనుకున్నా కానీ ఆ విధి ఇలా మనల్ని ఇలా విడదీసేసింది. నేను నీ కోసం ఇక్కడ బాధ పడుతున్నట్లు నువ్వు కూడా నాకోసం అలాగే బాధ పడుతుంటావని అనుకుంటున్నా అని అనుకుంటుంది.
మిథున కనిపించకపోవడంతో దేవా చాలా బాధ పడతాడు. ఒక్కో క్షణం గడుస్తుంటే ప్రాణం పోతున్నట్లు ఉందని అనుకుంటాడు. మిథున తనతో తాను నీ ప్రేమ నా మనసుకి తెలుస్తుంది దేవా. తిండి లేక నిద్ర లేక నువ్వు నా కోసం పిచ్చోడిలా తిరుగుతుంటావ్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావ్ దేవా అనుకుంటుంది. నేను నీ మనసుకి ఎంత దగ్గరయ్యానో నేను ఇలా దూరం అయినప్పుడే తెలుసుంటుంది అనుకుంటుంది. దేవా నేను ఎక్కడున్నానో నాకు తెలీదు. అసలు ప్రాణాలతో ఉంటానో లేదో తెలీదు. కానీ నీకు దూరం అయిపోతా అనే భయం ఉంది.. నా ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆ చివరి క్షణం నువ్వు నన్ను భార్యగా అంగీకరించడం చూడాలి దేవా.. మిథున నువ్వు నా భార్య అని నువ్వు చెప్పడం నేను వినాలి.. అలా చెప్పకుండానే దూరం అయిపోతానేమో అని చాలా భయంగా ఉంది దేవా అని ఏడుస్తుంది.
దేవా మిథున ఫొటో పట్టుకొని తిరిగి తిరిగి ఓ చోట కూర్చొంటాడు. ప్రాణం పోయినప్పుడు ఎలా ఉంటుందో తెలీదు కానీ నువ్వు కనిపించకపోవడంతో ప్రాణం పోయేలా ఉంది మిథున అని దేవా బాధ పడతాడు. ఇక శారద గుడికి వచ్చి ఏడుస్తూ దేవుడితో నా కోడలు కనిపించాలని కోరుకుంటూ చేతిలో హారతి వెలిగించుకొని మిథున తిరిగి రావాలని కోరుకుంటుంది. లలిత చూసి హారతి పడేయమని అంటే నేను కాలిపోయానా పర్లేదు నా కోడలు క్షేమంగా వచ్చేవరకు ఆపను అంటుంది. లలిత హారతి పక్కన పడేస్తుంది. శారదని హగ్ చేసుకొని నా కూతురి కోసం ఇంత చేస్తున్నారు. నా కూతురు పెళ్లి చేసుకొని మళ్లీ పుట్టింటికే వచ్చినట్లు ఉంది తల్లి లాంటి అత్త అండగా ఉందని ఎమోషనల్ అయిపోతుంది. దాంతో శారద మిథున చాలా మంచిది అని అంత గొప్ప మిథున నా కోడలు కావడం నా అదృష్టం అని శారద అంటుంది.
దేవా బాధగా ఉంటే అక్కడికి ఓ ముసలాయన వస్తాడు. చూస్తే అలిసిపోయినట్లు ఉన్నావ్ ఏమైంది అని అడుగుతారు. దాంతో దేవా అలిసిపోలేదు పెద్దాయన ఓ అమ్మాయి జీవితం నాశనం చేసేశాను పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. తనని క్షేమంగా ఇంటికి తీసుకెళ్లకపోతే నేను బతికినా చచ్చినట్లే పెద్దాయన. ఎవరికీ ముఖం చూపించలేను అది వదిలేస్తే నా మనసు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అంటాడు. పెద్దాయన దేవాతో నీభార్య నీ కంటికి మాత్రమే దూరంగా ఉంది కానీ నీ ఆలోచనల్లోనూ నీ మనసులోనూ ఉంది.. నీ మనసుతో వెతుకు కచ్చితంగా దొరుకుతుంది అని అంటారు.
సూర్యకాంతం త్రిపుర దగ్గరకు వెళ్లి రాత్రి దిండు, దుప్పటి తక్కువ రేట్‌కి ఇచ్చేశా ఇప్పుడు బ్రష్, సబ్బు, టవల్ కావాలంటే డబ్బు కట్టాలని అంటుంది. బ్రష్‌కి 1000 సబ్బుకి 2 వేలు, టవల్‌కి 5వేలు అడుగుతుంది. త్రిపుర కాంతంతో గొడవ పడుతుంది. ఇంతలో బేబీ బామ్మని చూస్తే త్రిపుర అంత డబ్బా మా పరిస్థితి అర్థం చేసుకో అని బాధగా మాట్లాడుతుంది. బేబి వచ్చి డబ్బులు ఏంటి అని అడిగితే బ్రష్, పేస్ట్, సబ్బు ఇలా ఒక్కో దానికి ఒక్కో రేట్ అని త్రిపుర చెప్తే బేబీ కాంతాన్ని చెవి మెలేసి చివాట్లు పెట్టి ఇంకోసారి ఇలా చేస్తే చంపేస్తా అని అంటుంది. చుట్టాల దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటే బుద్ధి లేకపోతే సరే అని అంటుంది.
దేవా వీధిలో పాలు వేస్తున్న ఓ వ్యక్తిని చూసి మిథున గురించి అడుగుతారు. తర్వాత పేపర్ వేసే అతన్ని అడుగుతాడు. అతను చూసి లేదు అని చెప్తాడు కానీ దేవాని అనుమానం వచ్చి అతన్ని పట్టుకొని గట్టిగా అడగటంతో ఎవరో కిడ్నాప్ చేయడం చూశానని అంటాడు. భయంతో ఎవరీకీ చెప్పలేదని పొలం రోడ్డు వైపు వెళ్లారు అక్కడ అడుగు అని అంటాడు దాంతో దేవా ఓ రైతుని అడిగితే అతను చూశానని చెప్తాడు. ఇదే దారిలో వెళ్లారని చెప్పడంతో దేవా మొత్తం వెతుకుతూ పరుగులు పెడతాడు. ఇంతో మిథున పట్టీ దేవాకి దొరుకుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ మొదలవుతుంది.
Also Read: చిన్ని సీరియల్: అర్ధరాత్రి లోహితని చెట్టుకి కట్టేసిన మధు.. వెక్కి వెక్కి ఏడుస్తున్న లోహిత.. వీడియో వైరలైతే?





















