Nuvvunte Naa Jathaga Serial Today February 5th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: దేవాతో మిధున ఛాలెంజ్.. అతి త్వరలోనే ఆ పని చేస్తా.. బామ్మ రాకతో మిధున ఎమోషనల్!
Nuvvunte Naa Jathaga Today Episode దేవాని రౌడీయిజం నుంచి బయటకు రప్పించి మంచి మనిషిగా మార్చి మిధున నా భార్య అనేలా చేస్తానని మిధున దేవాతో ఛాలెంజ్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున దేవాతో రౌడీగా మారడానికి కారణం ఏంటి అని అడుగుతుంది. దానికి దేవా నాకు ఓ సంస్కారం ఉంది, గుణం ఉంది.. అందుకే రౌడీ అయ్యాను. నన్ను మీ నాన్నే కాదు ఎవరూ డబ్బుతో కొనలేరు అని చెప్తాడు.
దేవా: నా గురించి నా గతం గురించి నీతో చెప్పడం నాకు అవసరం లేదు. నువ్వు నాకు ఏమీ కావు.
మిధున: ప్రతీ సారి నేను నీకు ఏం కాను ఏం కాను అంటున్నావ్. అందుకే స్ట్రాంగ్‌గా చెప్తున్నా విను. ఆ పార్వతీ పరమేశ్వరుల గుడిలో నా మెడలో ఈ తాళి పడింది. మనిద్దరం భార్యభర్తలం అని వాళ్లు నిర్ణయించారు. మనల్ని నూరేళ్లు కలిసి బతకమని వాళ్లు దీవించారు. ఇదంతా ఆ పార్వతీ పరమేశ్వరుల సంకల్పం. నేను నా వాళ్లని కాదని నీ కోసం వచ్చేశా. మరి నా భర్త రౌడీగా ఉంటే నేను ఊరుకుంటానా. నిన్ను ఆ రౌడీ వృత్తి నుంచి బయటకు తీసుకొస్తా.
దేవా: అది నీ వల్ల కాదు.
మిధున: అవుతుందో లేదో చూస్తువుగాని. మీ వాళ్లకి ఎవరికీ నచ్చని ఈ రౌడీ వృత్తి నుంచి నేను నిన్ను బయటకు తీసుకొస్తా. మా వాళ్లు గర్వపడేలా బయటి వాళ్లు నిన్ను మెచ్చుకునేలా నేను నిన్ను మార్చుతా.
దేవా: ఏడ్చావ్‌లే వెళ్లు.
మిథున: అంతే కాదు. నువ్వు కట్టిన ఈ తాళి విలువ నీకు తెలిసి వచ్చేలా చేస్తాను. నీ మనసు మార్చి నన్ను భార్యగా అంగీకరించేలా చేస్తాను. మిధున నా భార్య అని నువ్వే అందరికీ చెప్పేలా చేస్తాను.
దేవా: అది ఈ జన్మకు జరగదు.
మిధున: జరుగుతుంది. అతి త్వరలోనే జరుగుతుంది. నువ్వు కూడా చూస్తావ్. ఇక నుంచి నేను నిన్ను మార్చే పనిలో ఉంటాను.
సూర్య కాంతం నెత్తి మీద తెల్ల గుడ్డ వేసుకొని శోకాలు తీస్తుంది. శ్రీరంగం వెళ్లి ఏమైందని అడిగితే మీ నాన్న ఇంటి డాక్యుమెంట్స్ ఫైనాన్స్ వాడికి ఇచ్చేశాడని నెల రోజుల్లో పది లక్షలు ఎలా తీసుకొస్తారని మనం ఇళ్లు కొట్టేయాలి అనుకున్నాం కదా ఇప్పుడు మన ఆశలు పోయినట్లే కదా అని అంటుంది. దాంతో శ్రీరంగం వాడు ఇళ్లుని అమ్మాలి అనుకుంటే నా వాటా 50 లక్షలు ఇవ్వాలని అడుగుతానని అప్పుడు వాడు కోర్టులు చుట్టూ తిరగలేక అయిపోతాడని చెప్తాడు.
మిధున స్నానానికి బాత్‌రూమ్‌కి వెళ్తుంటే ఇంతలో దేవా వచ్చి మిధునని నెట్టేసి తాను దూరుతాడు. మిధున దేవాని లాగుతుంది. త్వరగా స్నానం చేసి నువ్వు ఎవరిని ఉద్దరించాలా అని ఒకర్ని ఒకరు అనుకుంటారు. ఒకర్ని ఒకరు నెట్టుకున్న టైంలో దేవా మిధున చేయి పట్టుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు చూసుకొని అలా ఉండిపోతారు. తర్వాత దేవా ఇది మా ఇళ్లు అంటే మిధున మా అత్తారిల్లు అని అంటుంది. దేవా గట్టిగా నవ్వుతూ నువ్వు నా భార్యవి అత్తారిళ్లు అని అరిగిపోయిన సీడీలా ఆ జోకులు ఆపు అని అంటాడు. నిన్ను ఎవరూ ఈ ఇంటి కోడలు అనుకోరు పగటి కలలు మానేయ్ అని మిధునని నెట్టేసి దేవా బాత్‌రూమ్‌లోకి దూరుతాడు. మిధున బయటకు వచ్చేస్తుంది. ఇంతలో దేవా ఫోన్ రింగ్ అవుతుంది. వెళ్లి చూసి లిఫ్ట్ చేస్తుంది.
దేవా ఫ్రెండ్స్ దేవా అనుకొని పురుషోత్తం అన్న ఇండియా వస్తున్నారు బ్యానర్ కోసం ఫొటోలు కావాలి నీ ఫొటోలు కూడా పంపించు అంటాడు. దాంతో మిధున తను దేవా భార్య అని అందరికీ తెలియాలని ఇద్దరి ఫోటో పంపాలి అనుకుంటుంది. ఇంతలో దేవా రావడంతో ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్లిపోతుంది. తర్వాత దేవా మాట్లాడుతాడు. మేటర్ రాసి పంపమని వాళ్లు దేవాకి చెప్తే సరే అంటాడు. దేవా వెళ్లగానే మిధున మళ్లీ ఫోన్ తీసి ఫొటో పంపేస్తుంది. అత్త కూరగాయలు కట్ చేస్తుంటే ప్రమోదిని, సూర్యకాంతం చీరలు మడత పెడతారు. మిధున డల్‌గా కూర్చొని ఉంటుంది. దేవా రావడంతో కొందరు కోటీశ్వరుల బిడ్డలు అని సూర్యకాంతం సెటైర్లు వేస్తుంది. ఇంతలో మిధున నానమ్మ వస్తుంది. మిధున నానమ్మ అని వెళ్లి హగ్ చేసుకొంటుంది. బామ్మ అందరినీ పలకరిస్తుంది.
దేవాని పలకరిస్తే నీ మనవరాలి వల్ల మాకు టార్చర్ అని చిరాకుగా మాట్లాడి వెళ్లిపోతాడు. మనవడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని బామ్మ అడుగుతుంది. తర్వాత నానమ్మ కూర్చొడానికి స్టూల్ వేసి నానమ్మ ఒడిలో పడుకుంటుంది. శాంతమ్మ బామ్మతో తన వల్ల మేం ఇబ్బంది పడటమే కాదు తను కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతుందని ఇంటికి వెళ్లిపోమని ఎంత చెప్పినా వినడం లేదని అంటుంది. మిధున జీవితం బాగుండాలి అని అన్నదానం చేశానని మిధున కోసం కూడా తీసుకొచ్చానని క్యారేజీ ఇస్తుంది బామ్మ. మిధునకు తప్పకుండా తినమని చెప్తుంది. ఈ ప్రసాదం నువ్వు ఒక్కదానివే తినాలి అని చెప్తుంది. మిధున సరే అంటుంది. బామ్మ బయల్దేరుతుంది. బామ్మ వెనకాలే మిధున నానమ్మ అని పరుగులు తీసి మళ్లీ గుండెలకు హత్తుకుంటుంది. ఏడుస్తుంది. నువ్వు అయినా నన్ను అర్థం చేసుకొని నా కోసం వచ్చావు చాలా థ్యాంక్స్ నానమ్మ అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: బాలకి ప్రమాదం.. ప్రాణాలకు తెగించి కాపాడిన త్రిపుర.. గాయత్రీ మీద నింద!





















