అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today February 28th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: మిధున, దేవాలకు మరోసారి పెళ్లి చేసిన బస్తీవాసులు.. దేవాకి పెద్ద షాకే!

Nuvvunte Naa Jathaga Today Episode మిధునను ఇంటి గెంటేయాలని దేవా అనుకుంటే కాలనీ వాసులు వచ్చి దేవా, మిధునలకు సన్మానం చేసి పెళ్లి తంతు చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

  Nuvvunte Naa Jathaga Serial Today Episode భానుమతి మిధున దగ్గరకు వచ్చి దేవా నిన్ను ఎందుకు తీసుకొచ్చాడు. దేవా నిన్ను తీసుకొచ్చాడు అంటే నేను నమ్మను ఇందులో ఏదో మతలబు ఉందని అంటుంది. దానికి మిధున నా భర్తే మా ఇంటికి వచ్చి నన్ను తీసుకొచ్చాడు కావాలి అంటే ప్రమోదిని అక్కని అడుగు అని ప్రమోదినిని అడుగుతుంది. దాంతో ప్రమోదిని దేవానే మిధునని తీసుకొచ్చాడని అంటుంది. దాంతో భాను షాక్ అయిపోతుంది. 

మిధున: విన్నావు కదా నీకు ఇలాగే ఇంకో విషయం చెప్తా విని ఆనంద పడు. నేను ఆయన ఇక్కడికి వచ్చే ముందు పానీ పూరీ కూడా తిన్నాం.
భాను: ఏంటి పానీ పూరీనా. ప్రమోదిని, కాంతం కూడా షాక్ అయిపోతారు. మీ ఇద్దరూ కలిసి పానీ పూరీ తిన్నారా.
మిధున: అవును ఆయనకు సరిగా తినడం రాకపోతే నేనే తినిపించా.
భాను: ఏయ్ పొగరా నా రాజా పోరీల వంక కూడా చూడడు అటువంటిది ఏం మందు పెట్టావే వాడికి. 
శారద: భానుమతి ఏంటే నట్టింట్లో గొడవ.
భాను: నీకు నా గొడవ మాత్రమే కనిపిస్తుంది అత్త నా గోడు మాత్రం కనిపించదు. ఇది నా జీవితాన్ని లాగేసుకుంది. 
మిధున: ఓయ్ నేను నీ జీవితం లాగేసుకోవడం ఏంటి. ఆయనే నా మెడలో తాళి కట్టారు. నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారు కాబట్టే నన్ను ఇక్కడికి ఆయనే తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడ అనవసరంగా గొడవ చేయకు ఏమైనా ఉంటే దేవాతో తేల్చుకో. దేవా రావడంతో భాను ఆపి మిధునని తీసుకొచ్చావా పానీ పూరీ తిన్నావా అని అడిగితే అవును అంటాడు. 
దేవా: మిధున చేసిందంతా చేసి నట్టింట్లో కూర్చొన్నావా నిన్ను.
సత్యమూర్తి: రేయ్ ఏంట్రా నట్టింట్లో నీ రౌడీయిజం ఇది ఇళ్లు అనుకున్నావా రోడ్డు అనుకున్నావా.
దేవా: నాన్న  ఈవిడేం చేసిందో మీకు తెలీదు. ఈవిడ వల్ల ఎంత ప్రాబ్లమ్ అయిందో మీకు తెలీదు. డాక్యుమెంట్లు దాచేసి నేను వాళ్ల ఇంటికి వెళ్లి తనని తీసుకొచ్చేలా చేసింది.
భాను: మనసులో మరి దేవా ప్రేమతో తీసుకొచ్చాడని చెప్పి ఇది నాకు ఇంత షాక్ ఇచ్చిందేంటి.
దేవా: ఆ డాక్యుమెంట్ల తీసుకెళ్లడం కాస్త లేట్ అయింటే బస్తీ వాళ్లకి ఇళ్లపట్టాలు అందేవి కాదు.
సత్యమూర్తి: ఓరేయ్ ఏమైనా ఉంటే మామూలుగా మాట్లాడు రౌడీయిజం చేయకు.. 
దేవా: నువ్వు వచ్చి నా నట్టింట్లో కూర్చొని నాకు నా వాళ్ల జీవితాలతో ఆడుకున్నావ్. ఇప్పుడు పురుషోత్తంతో బస్తీ వాళ్ల జీవితంతో ఆడుకోవాలని చూశావ్ ఎంత ధైర్యమే నీకు.
మిధున: నేను ఎవరితోనూ ఆడుకోలేదు. డాక్యుమెంట్ల జాగ్రత్తగా దాచాను. అయినా నీకు టైంకి ఇచ్చాను కదా ఎందుకు ఇలా మాట్లాడుతావు.
దేవా: ఈదేవా దగ్గరే పొగరుగా మాట్లాడుతావా. ఒక్క క్షణం నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీలులేదు బయటకు నడవవే.
మిధున: సారీ ఇది నా అత్తారిల్లు నేను వెళ్లను.
దేవా: నీ అంతట నువ్వు వెళ్తే సరే సరే లేదంటే నేను మెడ పట్టుకొని గెంటేస్తా అని కొట్టడానికి చేయి ఎత్తితే సత్యమూర్తి ఆపుతాడు. మాటలతో తేల్చుకోమంటే ఇది మాటలతో వినే రకం కాదని మన అందరికీ మనస్శాంతి లేకుండా చేస్తుందని భవిష్యత్‌లో ఏం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే దీన్ని గెంటేయాలి అంటాడు. నీ నుంచి నాకు విడాకులు కావాలని అంటాడు. ఈ శిక్షకైనా రెడీ కానీ నీతో ఉండను అంటాడు. మిధునని లాక్కెళ్లి బయటకు వెళ్తే ఓ వ్యక్తి వచ్చి కాలనీ వాసులు వస్తున్నారని చెప్తాడు. సత్యమూర్తి దేవాతో నా పరువు వాళ్ల ముందు తీయొద్దు ఈ గొడవ ఆపండి అంటాడు. దేవా బయటకు వెళ్తే బస్తీ వాళ్లంతా చుట్టు ముడతారు. మళ్లీ ఏదో గొడవ అని అందరూ భయపడతారు.  

దేవా అందరినీ ఎందుకు వచ్చారు అని అడిగితే అందరూ దేవా జిందాబాద్ అని చెప్పి బొట్టు పెట్టి దండ వేసి సన్మానం చేస్తారు. అందరూ షాక్ అయిపోతారు. పోరంబోకు స్థలంలో ఉన్నామని మాకు కరెంటు నీరు గ్యాస్ కనీస అవసరాలు ఏం లేవని నువ్వు పట్టాలు ఇప్పించడం వల్లే ఇదంతా సాధ్యం అవుతుందని పొగుడుతారు. దేవా ఇళ్లపట్టారు రావడానికి పురుషోత్తం కారణం అని చెప్పేలోపు అందరూ దేవా జిందాబాద్ అని అరుస్తూ సంబరాలు చేస్తారు. ప్రమోదిని మరో మహిళ దగ్గరకు వెళ్లి దేవా భార్య మిధున కూడా ఇళ్ల పట్టారు రావడానికి కారణం అని చెప్తుంది. దాంతో ఆమె వెళ్లి మిధున కూడా కారణం అని మిధునని దేవా పక్కన నిల్చొమని అంటుంది. దేవా ఎంత చెప్తున్నా మిధున దేవా పక్కన నిల్చొని దేవా దండ తన మెడలో వేసుకుంటుంది. బస్తీ వాళ్లంతా దేవా మిధున పెళ్లి చూడాలి అని అంటారు. మిధున దేవాని కూర్చొపెట్టి మిధున నుదిటి, తాళి బొట్టుకు దేవాతో కుంకుమ పెట్టిస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: గౌతమ్‌ని కుర్చీకి కట్టి కొరడాతో చితక్కొట్టిన సీత.. మహాలక్ష్మీ అధికారం పాయే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget