Nuvvunte Naa Jathaga Serial Today February 14th: "నువ్వుంటే నా జతగా" సీరియల్: సొంతింటిని కాపాడమని కొడుకుల్ని బతిమాలిన శారద.. జడ్జి ఇంట్లో పురుషోత్తం!
Nuvvunte Naa Jathaga Today Episode ఇంటిని కాపాడుకోలేకపోతున్నానని సత్యమూర్తి ఏడ్వడం దేవా వచ్చి తండ్రితో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా ఇంటిళ్ల పాది డబ్బులు కోసం ఆలోచిస్తూ ఆందోళన పడతారు. శారద భర్తకి రెండు రోజులు టైం ఉంది కదా బాధ పడొద్దని చెప్తుంది. మాస్టారుగా నా ప్రతిభతో పలుకు బడితో ఒక్క రూపాయి సంపాదించలేకపోయానని బాధ పడతారు. మామయ్య మాటలకు మిధున చాలా బాధ పడుతుంది.
సత్యమూర్తి: టీచర్‌గా పని చేస్తే ఒక పూట తింటూ ఒక పూట తినకుండా రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇళ్లు కట్టాను. నా కష్టానికి ప్రతిఫలం ఈ ఇళ్లు. నా రక్తానికి ప్రతిరూపం. నా చివరి రోజులు ఇక్కడే గడపాలని నా ప్రాణం ఈ ఇంట్లోనే పోవాలని కలలు కన్నాను. కానీ ఈ ఇంటిని వదిలేసి రోడ్డున పడతాను అనుకోలేదు.
శారద: శ్రీరంగం నీకు రియలస్టేట్‌లో పెద్ద పెద్ద వాళ్లు తెలుసుకదా ఒక్క పది లక్షలు అప్పు అడుగురా.
శ్రీరంగం: అమ్మ నన్ను నమ్మి పది లక్షలు ఎవరు ఇస్తారమ్మా.
శారద: ఓరేయ్ రంగా నీ సంపాదన ఎంతో ఆ దేవుడికే తెలియాలి. నువ్వు వంద ఇచ్చినా రెండు వందలు ఇచ్చినా తీసుకున్నాను. నీ సంపాదన ఎంత అని ఎప్పుడూ అడగలేదు. కానీ మీ నాన్న బాధని అర్థం చేసుకొని ఈ ఇంటిని కాపాడమని దండం పెడుతున్నానురా.
సూర్యకాంతం: మా పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. మేం బీరువాలో పరువు కింద పెట్టామని అనుకుంటున్నారా.
శారద: రేయ్ ఏం కొడుకులురా మీరు కన్న తండ్రి బాధని కనీసం ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరా. రేయ్ కష్టపడి ఇళ్లు కొనుకున్న వ్యక్తికి పిల్లల మీద ఎంత మమకారం ఉంటుందో ఇంటి మీద అంటే ఉంటుందిరా.
సత్యమూర్తి: శారదా వదిలేసేయ్.
శారద: మీరు విలాసాల కోసం చేయలేదు కదా అమ్మ ప్రాణం కోసమే కదా మరి కొడుకులకు ఆ బాధ్యత ఉంటుంది కదా.
దేవా: కానీ నేను ఇస్తా అంటే ఆయన తీసుకోలేదు కదమ్మా.
సత్యమూర్తి: నీ రక్తపు సంపాదన నాకు అవసరం లేదు.
దేవా: మాట్లాడితే రక్తపు సంపాదన అంటారేంటి నేను ఎవరి ప్రాణాలు తీయడం లేదు ఒక వ్యక్తి కింద పని చేస్తున్నా అంతే.
సత్యమూర్తి: నువ్వు పని చేస్తున్న ఆ పురుషోత్తం ఏం సంఘ సంస్కర్త కాదు కదా. ప్రజల్ని హింసించి ఇచ్చే డబ్బు. ఆ కిరాతకుడు ఇచ్చే డబ్బు రక్తపు డబ్బే కదా.
దేవా: నాన్న మీలా విలువలతో బతికే వారికి విలువ లేదు. అయినా ఆ మల్లేశం ఈ ఇంటిని ఎలా దక్కించుకుంటాడో నేను చూస్తా.
సత్యమూర్తి: శారద నా ఇంటి విషయాల్లో వీడిని కలగజేసుకోవద్దని చెప్పు. వీడు ఆ మల్లేశాన్ని బెదిరిస్తే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పు. ఈ సత్యం మాస్టారు బతికినంత కాలం విలువలతోనే బతుకుతాడు.
దేవా: మీరు అన్నా మీ విలువలు అన్నా నాకు అంతే గౌరవం నాన్న మీరు అలాగే బతకండి ఈ ఇళ్లు ఉంటే ఉంటుంది. లేదంటే లేదు.
ప్రమోదిని: మామయ్య గారు మా అమ్మ వాళ్లు పాప కోసం ఎకరం పొలం ఇచ్చారు అది అమ్మేసి అప్పు తీర్చేద్దాం.
ఆనంద్: నీకు బుర్ర ఉందా మనం ఎలా బతుకుతాం
ప్రమోదిని: మామయ్య పరువు ప్రాణం కంటే మనకు పొలం ఎక్కువ కాదు. మామయ్య నేను మా అమ్మకి చెప్పి పొలం అమ్మి డబ్బు తీసుకురమ్మని చెప్తా.
సత్యమూర్తి: వద్దమ్మా. వద్దు నా కష్టంలో కొడుకులు సాయం చేయలేదు తండ్రిగా ఓడిపోయాను. ఇప్పుడు మనిషిలా ఓడిపోనివ్వొద్దు. ముక్కోటి దేవతల్లో ఏ దేవతో నా కష్టానికి జాలిపడకపోతుందా.
లవ్ గురు దగ్గరకు భాను పరుగులు తీస్తుంది. ఇంతలో లవ్‌గురుని పోలీసులు పట్టుకొని భానుతో వీడంతా వేస్ట్ వీడికి అంత సీన్ లేదని తిడతారు. మనిషిని మనసుతో గెలుచుకోవాలని ఇలాంటి మందులతో కాదని భానుకి లవ్ గురు చెప్తాడు. ఇలాంటి వాళ్లని నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని పోలీసులు చెప్పి లవ్ గురుని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. సూర్యకాంతం పార్లర్ నుంచి అందంగా రెడీ అయి వస్తుంది. శ్రీరంగం చూసి అదిరిపోయావ్ అని పొంగిపోతాడు. నెయిల్ పాలీష్‌కి 2 వేలు, ఫోన్‌కి లక్ష, హెయిల్ స్టైల్‌కి 6 వేలు అని ఇలా లెక్కలు చెప్తుంది. మొత్తం లక్షా 20 వేలు అయ్యావని సూర్యకాంతం చెప్పడంతో అంత డబ్బు తగలెట్టావా అని అరుస్తాడు. దాంతో సూర్యకాంతం తనకు ఓ స్పాన్సర్ దొరికిందని చెప్తుంది.
పురుషోత్తం, దేవా ఫ్రెండ్ కలిసి మిధున ఇంటికి వస్తారు. ఇంద్రభవనం లాంటి ఇంటిని ఇంత అదృష్టమైన జీవితాన్ని వదిలేసి వచ్చిందంటే ఆ అమ్మాయిని ఏమనుకోవాలో అంటాడు. పురుషోత్తం జడ్జి ఇంటి లోపలికి వెళ్తాడు. ఆడవాళ్లు పురుషోత్తాన్ని కూర్చొపెడితే హరివర్ధన్ నువ్వు ఎలాంటి వాడివో తెలుసు నీ లాంటి క్రిమినల్ నా ఇంటికి రావడం ఏంటని అంటాడు. దాంతో పురుషోత్తం మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకొచ్చుకోండి అంటాడు. మా ప్రయత్నాలు అన్నీ అయిపోయావి ఓడిపోయాం అని మిధున తల్లి అంటుంది. నువ్వే ఆ రౌడీని రెచ్చగొట్టి పెళ్లి చేసుకునేలా చేశావని అంటాడు. నా కేసులు కొట్టించుకోవడానికి మీ ఇంటికి వచ్చాను మీ కూతురి మెడలో తాళి కట్టించానని అనడం తప్పుని చేతులు కట్టుకొని బతిమాలుతాడు. యువరాణిలా బతికిన మీ అమ్మాయి అక్కడ కష్టాలు పడుతుంది మీ ఇంటికి తెచ్చుకోండి అంటాడు. నిన్నూ ఆ రౌడీని ఈ జన్మలో వదలను అని హరివర్ధన్ అంటాడు.
శ్రీరంగాన్ని సూర్యకాంతం తీసుకొని త్రిపుర దగ్గరకు తీసుకొస్తుంది. మీరు ఏం చెప్పినా చేస్తామని శ్రీరంగం త్రిపురతో చెప్తాడు. ఇంటి తాకట్టు గురించి త్రిపుర అడిగితే మీరు ఆ డబ్బు ఇచ్చి మా ఇళ్లు మాకు ఇప్పిస్తారా అంటాడు. త్రిపుర కాదని కోర్టుతో ఇంటిని జప్తు చేయించి వేలం వేయిస్తానని అంటుంది. మా ఇంటిని కొట్టేయాలని ప్లాన్ చేశారా అని సూర్యకాంతం శోకాలు పెడుతుంది. దాంతో త్రిపుర వాళ్లని ఆపి మీరు రోడ్డు మీద పడితే మా ఆడపడుచు మా ఇంటికి వచ్చేస్తుందని అంటుంది. మేం రోడ్డున పడతాం కదా అని శ్రీరంగం అంటే మీ ఇద్దరికీ ప్లాట్ ఇస్తానని అంటుంది. ఇద్దరూ ఎగిరి గంతేస్తారు. ఇక అప్పటి వరకు చిల్లర ఇవ్వండి అని అడగగానే త్రిపుర వాళ్లకి లక్షలు అప్పగిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

