Nuvvunte Naa Jathaga Serial Today December 29th: నువ్వుంటే నా జతగా: మిథున మెడలో తాళి.. రిషి సంచలన నిర్ణయం! పెళ్లి ఆపే తీరుతానన్న బేబీ!
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 29th మిథున తన మెడలో తాళి తీయను అని మొండికేయడం.. రిషి మిథునకు సపోర్ట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా దగ్గరకు భాను వెళ్లి ఇంత సేపు ఎక్కడికి వెళ్లావని అడుగుతుంది. నీకు ఎందుకు అని దేవా భాను మీద అరుస్తాడు. కాసేపట్లో నువ్వు నా మొగుడు కాబోతున్నావ్.. మరి నాకు చెప్పను అంటే ఎలా.. అయినా నువ్వు ఎక్కడికి వెళ్లి వస్తున్నావో నాకు తెలుసు.. కొంప తీసి ఆ వగలాడిని మళ్లీ చేసుకోవాలని మనసులో ఉందా ఏంటి.. కాసేపట్లో నువ్వు నా మెడలో తాళి కట్టబోతున్నావ్.. ఒక్క మాట చెప్తున్నా గుర్తు పెట్టుకో.. అది నీకే కాదు నీ మనసుకి కూడా.. ఇంతకు ముందు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క.. ఇక నుంచి నువ్వు నన్నే ప్రేమించాలి.. నీ మనసులో కూడా నేనే ఉండాలి.. కలలో కూడా ఆమె రాకూడదు. నేను ఎంత మంచి దాన్నో అంతే రాక్షసిని నువ్వు ఈ పెళ్లిలో ఏం లొల్లి చేసినా ఇక్కడే విషం తాగి చస్తా గుర్తు పెట్టుకో అని చెప్పి వెళ్తుంది.
దేవా, మిథునల పెళ్లిళ్లు జరుగుతున్న గుడికి బేబీ బామ్మ వస్తుంది. దేవా, మిథునల్ని విడదీయాలి అని చూస్తారా.. నేను ఉండగా ఈ పెళ్లిళ్లు ఎలా జరుగుతాయో.. ఎలా చేస్తారో నేను చూస్తా.. ఈ పెళ్లిళ్లు చెడగొట్టి.. ఆ శివపార్వతులు కలిపిన దేవా, మిథునల్ని ఒకటి చేయకపోతే నా పేరు బేబీనే కాదు.. బస్తీమే సవాల్ వస్తున్నా ఆగండి అని గుడిలోకి ఎంట్రీ ఇస్తుంది.
మిథునతో పెళ్లికి ముందు పూజలు చేయిస్తారు. గౌరీ పూజ పూర్తయినతర్వాత అందరూ మిథునకు పసుపు రాసి బొట్టు పెడతారు. లలిత అక్క ఒకామె మిథున మెడలో తాళి చూసి అయ్యయ్యో ఏంటి లలిత ఇది పాత తాళి ఇంకా మిథున మెడలోనే ఉంది ఏంటి.. పాత తాళి అలాగే ఉంచేసి ఇప్పుడు తన మెడలో ఇంకో తాళి కట్టించేస్తారేంటి.. అది ఎంత దారుణం, ఎంత అరిష్టం అని అంటుంది. అందరూ కూడా కాసేపట్లో పెళ్లి పెట్టుకొని ఇంకా మెడలో తాళి ఉంచడం ఏంటి తీసేయమని అంటారు. మాంగల్యధారణ జరిగేలోపు తాళి తీసేస్తుందని లలిత అంటుంది.
రిషి తల్లి వచ్చి అదెలా కుదురుతుంది. మీరు మీ అమ్మాయిని కన్యగా మాకు కన్యాదానం చేయాలి.. మరి మెడలో తాళి ఉన్న అమ్మాయిని మేం ఎలా కన్యాదానం చేసుకుంటాం అది శాస్త్ర విరుద్దం కదా అంటుంది. లలిత అక్క మిథునకు తాళి తీసేయమని అంటుంది. మిథున తాళి పట్టుకొని తీయలేను.. అది నా వల్ల కాదు.. ఈ తాళి తీస్తే నా ప్రాణం పోయినట్లు ఉంటుందని నా గొంతులో ప్రాణం ఉండగా ఈ తాళి నా మెడలో నుంచి తీయను అని మిథున అంటుంది. అందరూ బిత్తరపోతారు. కాంతం ఆ మాటలు వింటుంది. బేబీ బామ్మ దూరం నుంచి అంతా చూస్తుంది.
మెడలో తాళి ఉండగా రిషి నీ మెడలో తాళి ఎలా కడతాడు.. ఇక ఈ పెళ్లి జరిగినట్లే అని లలిత అక్క అంటుంది. హరివర్థన్, లలితలు చాలా బాధ పడతారు. ఇంతలో రిషి వచ్చి జరుగుతుంది అని ఎంట్రీ ఇస్తాడు. మిథున మెడలో తాళి ఉంటే మీకు వచ్చిన సమస్య ఏంటి.. తనని అలా బాధ పెట్టడం వల్ల మీకు కలిసే ఆనందం ఏంటి అని అడుగుతాడు. నువ్వు తన మెడలో తాళి కట్టేటప్పుడు మెడతో మరో తాళి ఉండకూడదు.. ఇది శాస్త్రవిరుద్ధం అంటుంది. నేను అవేమీ పట్టించుకోను.. మిథునని బాధ పెడుతూ ఈ పెళ్లి జరిపించాల్సిన అవసరం లేదు.. నాకు సంబంధించిన వరకు మిథున మెడలో ఉన్న ఆ తాళిని నేను ఓ ఆభరణంలా మాత్రమే చూస్తా.. నాకు ఎలాంటి పట్టింపులు లేవు.. ఆ తాళి అలా ఉంచుకోవాలా.. తీసుకోవాలా అనేది మిథున హక్కు. తన హక్కుని మనం గౌరవించాలి కానీ బాధ పెట్టకూడదు.. అని అంటాడు.
ఒక తాళి మెడలో ఉంటే రెండో తాళి నువ్వు కడతావా అని ఆవిడ అడిగితే కడతాను అని రిషి గట్టిగా చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. నేను బతకాలి అనుకుంటుంది తనతో అంతే కానీ తన మెడలో ఉన్న వస్తువుతో కాదు.. నాకు కావాల్సింది తన మనసు.. ఆ మనసులో చోటు.. అందుకోసం రెండో తాళి ఏంటి.. అవసరం అయితే పదో తాళి అయినా కడతాను అని అంటాడు. రిషి మాటలకు అందరూ షాక్ అయిపోతారు. మిథునని ఇక్కడ నుంచి తీసుకెళ్లండి అని రిషి లలితతో చెప్తాడు. మిథునని అందరూ తీసుకెళ్లిపోతారు. రిషిని హరివర్థన్ పట్టుకొని నీలాంటి మంచి భర్త నా కూతురికి రావడం నాకు సంతోషంగా ఉంది.. ఇక నాకు నా కూతురి గురించి ఏ బెంగ లేదు అంటాడు.
కాంతం అత్తామామల దగ్గరకు వెళ్లి పెళ్లి ఆగిపోయేలా ఉందని చెప్తుంది. ఏంటే ఆ మాటలు అని శారద అంటే మీరు మిథునని చూశారా అత్తయ్యా.. మిథున మెడలో ఇంకా దేవా కట్టిన తాళి అలాగే ఉంది.. మిథున తాళిని ఇంకా తీయలేదు అంతే ఏంటి అర్థం,, మిథున మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుంది అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















