Nuvvunte Naa Jathaga Serial Today December 16th: నువ్వుంటే నా జతగా: దేవా ప్రాణాల కోసం మిథున పోరాటం! ఆదిత్య ప్లాన్ బెడిసికొట్టిందా?
Nuvvunte Naa Jathaga Serial Today Episode December 16th మిథున దేవాని హస్పిటల్‌లో చేర్చడం, ఆదిత్య మనుషులు దేవాని చంపాలని రావడం మిథున అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా కాలికి బులెట్ తగులుతుంది. దేవా మిథునకు కాల్ చేసి తనని కాపాడమని అడుగుతాడు. మిథున లొకేషన్‌కి వచ్చి దేవాని చూస్తుంది. అంబులెన్స్‌కి కాల్ చేసి దేవాని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. మరోవైపు ప్రమోదిని దేవాకి కాల్ చేస్తుంది. ఫోన్ స్విఛ్ ఆఫ్ రావడంతో ఉదయం నుంచి కాల్ కలవడం లేదని ప్రమోదిని, శారద కంగారు పడతారు.
శారద కంగారు పడుతూ నాకు ఏదో కీడు శంకిస్తుంది.. దేవాకి ఏమైనా అయిందని నాకు భయంగా ఉందని అంటుంది. ప్రమోదిని అత్తకి ధైర్యం చెప్తుంది. వెంటనే అమ్మవారి దగ్గరకు వెళ్లి నా కొడుకుకి ఏం కాకుండా కాపాడు తల్లీ అని వేడుకుంటుంది.
మిథున దేవాని హాస్పిటల్‌కి తీసుకొస్తుంది. ఐసీయూలోకి దేవాని తీసుకెళ్తుంటే మిథున తాళి, దేవా చేతికి ఉన్న బ్రేస్‌లెట్‌కి అతుక్కుంటుంది. మిథున దాన్ని తీస్తూ ఎమోషనల్ అయిపోతుంది. దేవాని లోపలికి తీసుకెళ్తారు. దేవాకి ట్రీట్మెంట్ జరుగుతుంటే మిథున చూసి చాలా బాధ పడుతుంది. గతంలో తన కోసం దేవా నిప్పుల మీద నడవడం అన్నీ గుర్తు చేసుకుంటుంది. డాక్టర్ వచ్చి బ్లడ్ చాలా పోయింది.. కండీషన్ కాస్త క్రిటికల్‌గానే ఉందని చెప్తారు.
మిథున అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరకు వెళ్లి ఎందుకు ఇలా చేస్తున్నావ్.. నువ్వే ముడి వేస్తావ్,, నువ్వే విడదీస్తావ్.. నా మెడలో పడిన ఈ తాళి కూడా నీ ఆజ్ఞ అనుకున్నా.. అసలు దేవా ఎవరో నాకు తెలీదు కానీ అతనితో నువ్వు నన్ను ముడి వేశావని వచ్చేశా.. ఇప్పుడు దాదాపు మా బంధం దూరం చేసేశావ్.. ఇప్పుడు మనిషిని కూడా దూరం చేస్తావా అని ఏడుస్తుంది. దేవా చాలా మంచి వాడు అలాంటి మంచి వాడి ప్రాణాలు తీయకు అని అంటుంది.
ఆదిత్య దగ్గరకు అతని మనుషులు వచ్చి దేవా పారిపోయాడని చెప్తారు. ఆదిత్య వాళ్లని కొట్టి వాడి కాలికి బులెట్ తగిలిందిరా.. అడుగు కూడా వేయలేని స్థితిలో ఉన్నాడు మరి ఎలా పారిపోతాడురా.. వాడు బతికితే నేను చచ్చిపోతాను.. పోస్టర్లు దగ్గర మొదలు పెట్టి నా నిజస్వరూపం మొత్తం తెలుసుకుంటాడు. అప్పుడు వాడు నన్ను బతకనివ్వడు.. వాడు అక్కడ లేడు అంటే కచ్చితంగా వాడిని ఎవరో ఒకరు కాపాడుంటారు. దగ్గర్లోని హాస్పిటల్‌లో చేర్పించుంటారు.. ఆ హాస్పిటల్‌లోనే లేపేయండి అని చెప్తాడు.
మిథున దేవాకి కాలికి తగిలిన బులెట్ డాక్టర్లు తీయడం చూసి చాలా బాధ పడుతుంది. డాక్టర్లు వచ్చి బులెట్ తీసేశాం.. ఇంకేం ప్రాబ్లమ్ లేదు అని చెప్తారు. మిథున చాలా హ్యాపీగా ఫీలవుతుంది. దేవా దగ్గరకు నీ ప్రాణానికి ఏం ప్రమాదం లేదని డాక్టర్ చెప్పగానే నాకు ప్రాణం లేచివచ్చినట్లు ఉంది దేవా.. నువ్వు ఎప్పుడెప్పుడు లేస్తావా అని ఎదురు చూస్తున్నా అని అనుకుంటుంది. ఇక ఆదిత్య మనుషులు దేవా ఉన్న హాస్పిటల్‌లోకి వస్తారు. మిథున దగ్గరకు ఓ నర్స్ వచ్చి మందులు తీసుకురమ్మని పంపిస్తుంది. మిథున బయటకు వెళ్తుంటే ఆదిత్య మనిషి డాక్టర్ గెటప్‌లో వచ్చి ఐసీయూ ఎక్కడ ఉంది అని మిథుననే అడుగుతారు. మిథున చెప్పి వెళ్తుంది.
మిథున మందులు కోసం వెళ్లగానే ఆదిత్య మనిషి దేవా దగ్గరకు వెళ్తాడు. దేవాని కత్తితో పొడవడానికి చాకు తీయగానే మిథున వచ్చి అడ్డుకుంటుంది. నువ్వు ఐసీయూ ఎక్కడ అనే విధానంలోనే అర్థమైంది నువ్వు డాక్టర్ కాదు అని అంటుంది. రౌడీ మిథునని తోసేసి దేవాని చంపడానికి ప్రయత్నించడంతో మిథున ఆక్సిజన్ సిలెండర్‌తో రౌడీని కొట్టి తరిమేస్తుంది. డాక్టర్‌ని పిలిచి విషయం చెప్పగానే ఇతను కోసం వచ్చారు అంటే ఇతను చాలా ప్రమాదంలో ఉన్నాడని చెప్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















