Nuvvunte Naa Jathaga Serial Today April 8th: నువ్వుంటే నా జతగా సీరియల్: మూర్ఖత్వంతో బంగారంలాంటి అవకాశం నాశనం చేసుకున్న మిధున!
Nuvvunte Naa Jathaga Today Episode మిధునకు తల్లిదండ్రులు వచ్చి ఇంగ్లండ్ ప్రయాణం గురించి చెప్తే మిధున వద్దని వదిలేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధునకు దేవా తన అన్నయ్యని మార్చే ఐడియా అడుగుతాడు. టీ తీసుకొస్తే చెప్తానని మిధున దేవాతో చెప్తుంది. దేవా మిధునని తిట్టుకొని టీ తీసుకొని రావడానికి వెళ్లగానే మిధున గెంతులేస్తుంది. దేవా కిచెన్‌లో టీ చేయడం కాంతం చూసి షాక్ అయిపోతుంది.
దేవా టీ ఇవ్వడం చూసి షాక్‌లో కాంతం..
కిచెన్ వైపు చూడని దేవా ఇంత శ్రద్ధగా ఎవరి కోసం టీ చేస్తున్నాడని ఫాలో అవుతుంది. దేవా మిధునకు టీ ఇవ్వడం చూసి దేవా ఇలా మారిపోయి ఆ పిల్ల దగ్గర ఇలా మారిపోయాడేంటి అని అంటుంది. వెంటనే ఈ విషయం ఆటో బేబీ భానుమతికి చెప్పి మంట పెట్టాలని వెళ్తుంది. ఇక మిధున టీ తాగుతూ దేవాని పొగిడేస్తుంది. ఐడియా చెప్పమని దేవా అడిగితే టీ తాగి చెప్తా అంటుంది.
భానుకి తగిలించిన కాంతం..
కాంతం భానుమతికి కాల్ చేసి నీ జీవితంలో సునామి, తుఫాను వచ్చేశాయి. దేవా, మిధున ఇద్దరూ నీకు నేను నాకు నువ్వు అని సాంగ్స్ వేసుకుంటున్నారు. దేవా మిధున కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అని టీ విషయం చెప్తుంది. వెంటనే వచ్చి ఇద్దరి మధ్య దూరం పెంచకపోతే ఇక నీ బతుకు గోవింద చెల్లాయ్ అని అంటుంది. నా రాజా నాకే సొంతం అవ్వాలి అని భాను బయల్దేరుతుంది.
మిధున అత్తింట్లో తల్లిదండ్రలు..
మిధున అత్తింటికి హరివర్దన్, లలిత వస్తారు. ఈరోజుతో మిధునకు మంచి రోజులు వచ్చాయని తమతో పాటు వచ్చేస్తుందని అనుకుంటారు. లోపలికి వెళ్లి సంతోషంగా మిధునని పిలుస్తారు. శారద, సత్యమూర్తి వచ్చి నమస్కారం పెడతారు. మిధునని పిలవమని చెప్తారు. శారద మిధునని పిలుస్తుంది. తల్లిదండ్రుల్ని చూసి మిధున చాలా సంతోష పడుతుంది. అమ్మానాన్న అని పరుగులు తీసి ఇద్దరినీ హగ్ చేసుకుంటుంది. దేవా కూడా బయటకు వచ్చి చూస్తాడు.
వెంటనే బయల్దేరు మిధున..
హరివర్దన్ కూతురితో వెంటనే బయల్దేరు మిధున అని అంటారు. మిధున షాక్ అయిపోతుంది. ఎక్కడికి నాన్న అని అడుగుతుంది. దాంతో హరివర్దన్ రేపే నీ ఇంగ్లండ్ ప్రయాణం అని చెప్తాడు. మిధున షాక్ అయిపోతుంది. దేవా హ్యపీగా ఫీలవుతాడు. ఇంగ్లండ్ పేరు చెప్పినా అర్థం కాలేదా నీకు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో సీట్ వచ్చిందని అంటాడు. మిధున చాలా సంతోష పడుతుంది. సత్యమూర్తి మాస్టారు కూడా సంతోషపడతారు. దేవా మనసులో ఇక నాకు తన టార్చర్ ఉండదు అనుకుంటాడు. దేవా వైపు మిధున చూడగానే దేవా బాయ్ చెప్తాడు. మిధున వెళ్లిపోతుందని శారద బాధ పడుతుంది.
నేను ఇంగ్లండ్ వెళ్లను..
హరివర్దన్ వెళ్దామని మిధునని పిలుస్తారు. మిధునని తీసుకెళ్తే మిధున ఆగిపోతుంది. ఏమైందని తల్లిదండ్రులు అడిగితే ఇంగ్లండ్ వెళ్లను అని చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఇక నేను చదవాలి అనుకోవడం లేదని చెప్తుంది. సత్యమూర్తి కూడా షాక్ అవుతారు. ఆ యూనివర్సిటీలో చదవాలి అన్నది నీ కల నీ జీవితాశయం అది మర్చిపోయావా.. నీ కల నీ కళ్ల ముందుకు వస్తే వెళ్లను అంటావేంటి అని అడుగుతారు. దానికి మిధున అక్కడకు వెళ్లి చదవాలి అనుకున్నది నా కల కానీ నేను ఈ ఇంట్లో ఉండాలి అన్నది దేవుడి నిర్ణయం అంటుంది. మిధున సెన్స్ ఉందా ఇలాంటి దిక్కుమాలిన లైఫ్ కోసం బంగారం లాంటి అవకాశం వదిలేస్తున్నావా మైండ్ పని చేస్తుందా అని తిడతాడు. ఎంత చెప్పినా మిధున వినదు.
సత్యమూర్తి మాట కూడా వినని మిధున..
సత్యమూర్తి మిధునతో ఏమ్మా నీకు తెలివి ఉందా.. జీవితం అంటే జాగ్రత్త ఉందా ఆ యూనివర్సిటీలో నూటికో కోటికో ఒక్కరికి సీటు దొరుకుతుంది. అందులో సీటు దొరకడం కంటే అదృష్టం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ అలాంటి అదృష్టం వస్తే కాలదన్నేస్తావేంటి అని అడుగుతారు. మామయ్య మాటలు కూడా మిధున వినదు. ఈ అవకాశం వదిలేస్తే కోరుకున్నట్లు చదువుకోలేదని జీవతాంతం బాధ పడతావని జడ్జిగారు చెప్తారు. చావు అయినా బతుకు అయినా ఈ ఇంట్లోనే అర్థం చేసుకోండి అనేస్తుంది. తను శాశ్వతంగా ఈ గుమ్మం దాటేది గొంతులో ప్రాణం పోయిన తర్వాతే అని తేల్చేస్తుంది. మిధున తల్లిదండ్రులు షాక్ అయిపోతారు.
ఏవండీ వెళ్దాం పదండి...
హరివర్దన్ మిధునని ఒప్పించే ప్రయత్నం చేస్తే లలిత మాత్రం వెళ్దాం పదండి. ఇప్పుడు తన జీవితాశయం ఏంటో చెప్పేసింది కదా పదండి అంటుంది. భర్తని తీసుకొని ఏడుస్తూ లలిత వెళ్లిపోతుంది. మిధున జరిగింది తలచుకొని ఏడుస్తుంది. తండ్రి తనని ఎలా చూసుకునే వాడే గుర్తు చేసుకొని ఏడుస్తుంది. నా చిన్ని లోకమే చేజారిపోయేనే.. నా కలల వెలుగులే అదృశ్యమాయేనే అని పాట వస్తుంది. మిధున బాధ పడటం దేవా చూస్తాడు. మిధునని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. మంచి అదృష్టం అని అంత అద్భుతమైన అవకాశం దూరం చేసుకోవద్దని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాగవల్లిని దొంగని చేసిన ఉష.. చెల్లికి చీర గిఫ్ట్ ఇచ్చిన సత్యంబాబు!





















