Nuvvunte Naa Jathaga Serial Today April 28th: నువ్వుంటే నా జతగా సీరియల్: మీ నాన్నని చంపేస్తావా మిధున.. వెళ్లిపో ఇక్కడి నుంచి: మిధునని గెంటేసిన త్రిపుర
Nuvvunte Naa Jathaga Today Episode జడ్జికి హర్ట్ అటాక్ రావడం హాస్పిటల్‌లో జాయిన్ చేయడంతో మిధున చూడటానికి వెళ్లడం త్రిపుర అడ్డుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode శారద పూజ చేసి దేవా, మిధున కలిసిపోవాలి అని కోరుకుంటుంది. పూజ చేసి హారతి తీసుకెళ్లి మిధునకు ఇవ్వడంతో కాంతం గోల చేస్తుంది. మిధుననే పట్టించుకుంటున్నారు మమల్ని పట్టించుకోవడం లేదని అత్తతో కయ్యానికి దిగుతుంది. ప్రమోదిని వచ్చి ఈ మధ్య నువ్వు ప్రతీదాన్ని పోల్చి చూస్తున్నావని కాంతం మీద కోప్పడుతుంది.
నిన్న మంట పెట్టి ఇప్పుడు హారతి ఇస్తున్నావా..
మిధునకు హారతి తీసుకెళ్లి దేవాకి ఇవ్వమని అంటుంది. గొడవ జరిగిందని దూరం పెడితే అది ఇంకా దూరం అవుతుందని శారద చెప్పి మిధునని పంపుతుంది. మిధున హారతి తీసుకొని దేవా దగ్గరకు వెళ్తుంది. దేవా సీరియస్‌గా చూస్తాడు. దేవా మిధునతో నిన్న మంట పెట్టి ఇప్పుడు శాంతంగా పూజ చేసి హారతి ఇస్తున్నావా అని అడుగుతాడు. మంట పెట్టడం ఏంటి అని మిధున అడిగితే ఏం తెలీనట్లు మాట్లాడకు. మా నాన్నని ఎదురించావ్ నన్ను తిట్టించావ్ అని అంటాడు. మా వాళ్లని తిడితే ఊరుకుంటానా అని మిధున అంటే నీకు నిజంగా మీ వాళ్లు అంటే అంత ఇష్టం ఉంటే వెళ్లిపో అని అంటాడు.
మీ నాన్న మీద నీకు ప్రేమ ఉందా..
నీ కోసం మీ నాన్న వచ్చి గుమ్మం దగ్గరే చాలా సార్లు ఏడ్చాడు. కనీసం ఒక్క సారి కూడా నువ్వు ఆలోచించకుండా ఆయన దగ్గరకు వెళ్లకుండా ఆయన్ని బాధ పెట్టడం తప్పు కాదా నీకు ఎక్కడ ప్రేమ ఉంది అంటాడు. నువ్వు నా మెడలో తాళి కట్టకపోతే నేను రాను కదా అంటుంది. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు నీ వల్ల మీ వాళ్లలో ఎవరికో ఏదో ఒకటి అవుతుంది చూడు అంటాడు. ఇంతలో మిధునకు కాల్ వచ్చి తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారు. మిధున షాక్ అయిపోతుంది.
మా నాన్నకి హార్ట్ అటాక్..
దేవా ఏమైందని అడిగినా మిధున చెప్పకుండా శారదతో అమ్మ మా నాన్నకి హర్ట్ అటాక్ వచ్చింది నేను హాస్పిటల్‌కి వెళ్తాను అని పరుగులు తీస్తుంది. హరివర్దన్‌కి ట్రీట్మెంట్ జరుగుతుంటుంది. లలిత ఏడుస్తుంటే త్రిపుర అత్తతో మీరు, మిధున చావు బతుకులో పడేసి ఏడుస్తారేంటి అని అడుగుతుంది. అలా అంటావేంటి త్రిపుర అని అంటుంది. కూతురే ప్రాణంగా బతుకుతున్న ఆ తండ్రిని కాదని ఎవడో రౌడీతో వెళ్లిపోయింది మీరు కూడా వాడిని అల్లుడిగా అంగీకరించారని త్రిపుర, రాహుల్ లలితను కోప్పడతారు. ఏ కూతురు ప్రాణం అని మురిసిపోయారో ఆ కూతురే ప్రాణాలు తీయడానికి కారణం అవుతుందని అంటుంది.
ఇక్కడి నుంచి వెళ్లిపో మిధున..
డాక్టర్ వచ్చి జడ్జి గారికి ఏం ప్రమాదం లేదని ఇబ్బంది పెట్టకుండా చూడమని చెప్తారు. అందరూ లోపలికి వెళ్తారు. త్రిపుర బయట ఉంటుంది. ఇంతలో మిధున వస్తుంది. వదిన నాన్నని చూడాలి అంటుంది. త్రిపుర మిధునని ఆపి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపో అని అరుస్తుంది. మిధున షాక్ అయిపోతుంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్ ఏ ముఖం పెట్టుకొని వచ్చావ్ అని అంటుంది. నాన్నకి ఏ ప్రాబ్లమ్ లేదని తెలిశాకే కదా నా ప్రాణం కుదుట పడుతుంది అని అంటుంది. మీ నాన్నకి ఈ పరిస్థితి రావడానికి నువ్వే కారణం నీ మీద బెంగతోనే ఆయనకు హర్ట్ ఎటాక్ వచ్చిందని అంటుంది. మిధున షాక్ అయిపోతుంది.
మీ నాన్నని చంపేయాలి అని వచ్చావా..
మీ నాన్నకి ఇలా చావు బతుకుల్లో ఉండే పరిస్థితి రావడానికి కారణం నువ్వే. ఇప్పుడు ఆయనకు తగ్గింది అని తెలిస్తే పూర్తిగా చంపేయాలి అని వచ్చావా అని మిధునని త్రిపుర అడుగుతుంది. దాంతో మిధున ఏడుస్తుంది. ప్లీజ్ వదిన దయచేసి అలా మాట్లాడకు అని అంటుంది. మీ నాన్న కోసం వచ్చే అర్హత నీకు లేదు అని త్రిపుర అంటుంది. కేర్ ఆఫ్ లేని వాడితో వెళ్లిపోయినప్పుడే మీ నాన్నని చూసే అర్హత కోల్పోయావు అని అంటుంది. నాన్నని చూస్తాను వదినా అని మిధున ఏడుస్తుంది. నువ్వు ఆయన్ను చూడటానికి వచ్చావని తెలిస్తే కొన ఊపిరితో ఉన్న ప్రాణం పోతుందని అంటుంది. చేయాల్సింది అంతా చేసి చూడటానికి వచ్చావ్ సిగ్గు లేదా అని తిడుతుంది. త్రిపుర మిధునని రెండు చేతులు జోడించి దండం పెట్టి పంపేస్తుంది. మిధునని తోసేయడంతో మిధున వెళ్లిపోతుంది.
మిధున దగ్గరకు వెళ్లరా..
మిధున ఇంట్లో లేదని కాంతం చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ప్రమోదినితో చెప్పి హ్యాపీగా ఫీలవుతుంది. మిధున వాళ్ల నాన్నకి బాలేదనే బాధతో వాళ్ల ఇంటిలోనే ఉండిపోతుంది ఇక్కడికి రాదు అని అనుకుంటుంది. ప్రమోదిని కాంతాన్ని తిడుతుంది. శారద వాళ్లు కంగారు పడతారు. దేవాకి శారద విషయం చెప్తుంది. ఒకసారి వెళ్లమని అంటుంది. దేవా వెళ్లను అని అంటాడు. నా మీద వాళ్లందరికి పీకల్లోతు కోపం అక్కడికి వెళ్తే తిడతారు ఎందుకు వెళ్లడం అంటాడు. దేవాని శారద, ప్రమోదిని ఒప్పిస్తారు. దేవా వెళ్తాడు. మిధున హాస్పిటల్ దగ్గరున్న దేవుడిని దండం పెట్టుకుంది. అంతా నా వల్లే అని ఎందుకు మమల్ని ఇలా శిక్షిస్తున్నావ్ అని ఏడుస్తుంది. అక్క దేవుడికి దండం పెట్టుకోవడం మిధున చెల్లి చూస్తుంది. అక్క దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. నాన్నకి ఎలా ఉందిరా అని అడుగుతుంది. ప్రాబ్లమ్ లేదని చెప్పారని అంటుంది. ఇక మిధునని తీసుకొని లోపలికి వెళ్లబోతే మిధున వద్దు అంటుంది. అలంకృత తీసుకెళ్లి మిధునని చూపిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నాతో వచ్చేయ్ కావేరి మనం దూరంగా వెళ్లిపోదాం.. రాజుని కావేరి క్షమిస్తుందా!





















