Nuvvunte Naa Jathaga Serial Today April 24th: నువ్వుంటే నా జతగా సీరియల్: మిధున పుట్టింటి వాళ్లని ఘోరంగా అవమానించి పంపేసిన సత్యమూర్తి, దేవా!
Nuvvunte Naa Jathaga Today Episode మిధున కోసం పుట్టింటి నుంచి సారె రావడం సత్యమూర్తి, దేవా వాళ్లని తిట్టి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ప్రమోదిని మిధునతో నువ్వు రావడంతో దేవాతో పాటు మన ఇంటికి కూడా అదృష్టం అని చెప్తుంది. ప్రమోదిని మాటలు విన్న సూర్యకాంతం కోపంతో రగిలిపోయి సూట్ కేస్ పడేసి మా పుట్టింటివాళ్లు సారె పెట్టినవి అని అన్నీ చూపిస్తుంది. ఇన్ డైరెక్ట్‌గా మిధునకు పుట్టింటి సారె రాలేదని అంటుంది.
మిధునని ఏడ్పించని కాంతం
మిధున కన్నీరు పెట్టుకుంటుంది. మీ పుట్టింటి వాళ్లు సారె తీసుకొస్తేనే నీకు కోడలిగా గుర్తింపు వస్తుందని లేదంటే నువ్వు ఎప్పటికీ కోడలు కాలేవని అంటుంది. దాంతో మిధున ఏడుస్తూ వెళ్లిపోతుంది. లలిత, బామ్మ మిధున కోసం సారె తీసుకొని వస్తారు. ముత్తయిదువులతో వాళ్ల స్థాయికి తగ్గట్టు తీసుకొస్తారు. కాంతం చూసి ప్రమోదినితో మేడంని తీసుకెళ్లిపోవడానికి వచ్చినట్లు ఉన్నారు అనుకుంటుంది. లలిత బామ్మ గుమ్మ ముందు నిల్చొని మిధున అని పిలవడంతో ఏడుస్తున్న మిధున సంతోషంతో లేచి వస్తుంది. తల్లిని బామ్మని హగ్ చేసుకుంటుంది. అమ్మ నేను ఇంటికి రాను మీరు నన్ను పిలవడానికి రావొద్దు అని అంటుంది. దాంతో లలిత తాను సారె తీసుకొని వచ్చానని అంటుంది. మిధున చాలా సంతోష పడుతుంది.
మా అమ్మాయి ఆలోచించే నిర్ణయం తీసుకుంటుంది..
కాంతం కడుపు మంటతో అత్తామామల్ని అందర్ని పిలుస్తుంది. శారద వాళ్లని చూసి చాలా సంతోష పడుతుంది. సత్యమూర్తి మాత్రం ఇదంతా ఏంటి అని ప్రశ్నిస్తాడు. పుట్టింటి సారె అని లలిత, బామ్మ చెప్తే ఆపండమ్మా గొడవతో జరిగిన దాన్ని పెళ్లి అంటారా. మీరు అంగీకరిస్తున్నారా అని కోప్పడతాడు. నా కూతురు నమ్ముతుందని తన నిర్ణయాన్ని మేం అంగీకరిస్తున్నామని లలిత అంటే పిల్లలు తప్పు చేస్తే వాళ్ల నిర్ణయాన్ని తప్పు అని చెప్పి వాళ్ల భవిష్యత్ నాశనం చేస్తున్నారు మీరే అని అంటాడు. మా అమ్మాయి అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది మా అమ్మాయి పొరపాటున కూడా తప్పు నిర్ణయం తీసుకోదు అని లలిత చెప్తుంది.
మేం మీ అమ్మాయిని కోడలిగా అంగీకరించలేదు..
నన్ను నా ఫ్యామిలీని అవమానించడానికే ఇవన్నీ తీసుకొచ్చారా అని ప్రశ్నిస్తాడు. అలా మాట్లాడుతున్నారేంటి అని బామ్మ అంటే నన్ను అవమానించడానికే ఇవన్నీ తీసుకొచ్చారు మీరు అంటాడు. మీ ఆస్తి కోసమే మేం మీ అమ్మాయిని మా ఇంటికి తీసుకొచ్చామని అంటున్నారు. ఇప్పుడు అందరితో మీరు అది చెప్పాలనే తీసుకొచ్చారా అంటే ఇది సారె అని అంటుంది. ఇక సత్యమూర్తి లలితతో మేం మీ అమ్మాయిని కోడలిగా అంగీకరించలేదు. ఎప్పుడెప్పుడు వెళ్లిపోతుందా అని ఎదురు చూస్తున్నాం మరి ఎలా వీటిని తీసుకుంటామని అంటారు. మీ అమ్మాయే కాదు మీ వస్తువులు కూడా మాకు అక్కర్లేదు. మీ సారె సంప్రదాయాలు మీ అమ్మాయితో పాటు మీ ఇంటికి తీసుకెళ్లండి అని సత్యమూర్తి తెగేసి చెప్తాడు. ఇంతలో దేవా వస్తాడు.
నీకు సారె తీసుకునే హక్కు ఉంటే నా ఇంట్లో పెట్టకు
రంగం దేవా దగ్గరకు వెళ్లి నువ్వు ఈ అమ్మాయి మెడలో తాళి కట్టావ్ అని తన కోసం సారె తీసుకొచ్చారు అంటాడు. దేవా మిధునతో అసలు నువ్వు ఎవరు నీకు నాకు ఏం సంబంధం. నువ్వు నాకు ఓ గొడవలో పరిచయం అయిన మనిషివి మాత్రమే. నేను నిన్ను భార్యగా ఎలా అనుకుంటా అనుకున్నావ్. మరి నా ఇంటి వాళ్లు ఎలా తీసుకుంటారు అనుకుంటావ్. అని ప్రశ్నిస్తాడు.. నీకే సంబంధం లేదు ఈ ఇంటితో అంటే ఇంక నీకు ఓ సారె ఆ చెత్తతో పాటు ఈ చెత్తని కూడా తీసుకెళ్లండి అని దేవా నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతాడు. నన్ను ఏమన్నా పడతా కానీ నా వాళ్లని ఏమైనా అంటే బాగోదు అని మిధున అంటుంది. అది తన పుట్టింటి సారె అని తీసుకొనే హక్కు నాకు ఉంది అని అంటుంది. ఇక సత్యమూర్తి మిధునతో నీకు వాటిని తీసుకొనే హక్కు ఉంటే వాటిని తీసుకొని ఓ ఇళ్లు అద్దె కి తీసుకొని అందులో ఉంచుకో కానీ నా ఇంట్లో ఉంచకు అంటాడు..ఈ సమస్యలన్నీంటికి నువ్వు కారణం అంటారు. ఇక మిధున దేవాతో ఈ సమస్యలు అన్నీంటికి నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్లే అని అంటుంది. ఆ సామను ఇంట్లోకి వస్తే అన్నీ ఇక్కడే తగలబెట్టేస్తా అని దేవా వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. మిధునతో పాటు లలిత కూడా బాధ పడతారు. మిధున తల్లితో ఏదో ఒక రోజు వాళ్లే దగ్గరుండి సారె తీసుకెళ్లారు మీరు జాగ్రత్తగా వెళ్లండి అమ్మా అని మిధున తల్లిని పంపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఇక నుంచి నువ్వు దేవా భార్యవి.. ఈ ఇంటి చిన్న కోడలివి.. ఓర్నీ ఇదంతా కలా!





















