అన్వేషించండి

New Challan Rules: ట్రాఫిక్‌ చలాన్లను లైట్‌గా తీసుకోవద్దు మామా - 5 దాటితే లైసెన్సు రద్దు, వాహనం స్వాధీనం!

కేంద్రం ప్రకటించిన కొత్త ముసాయిదా ప్రకారం, 45 రోజుల్లో చెల్లించకపోతే వాహనం స్వాధీనం, ఐదుకి మించి చలాన్లు ఉంటే లైసెన్సు రద్దు వంటివి ఉన్నాయి. ప్రతి డ్రైవర్‌ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన మార్పులు ఇవే.

New Challan Rules 2025: కారు, బైకు లేదా మరేదైనా మోటారు వాహనాన్ని నడిపినప్పుడు ట్రాఫిక్‌ రూల్స్‌ బ్రేక్‌ చేస్తే, ట్రాఫిక్‌ పోలీసులు చలాన్‌ రాస్తారు. కొంతమంది ఈ చలాన్లను తేలిగ్గా తీసుకుంటారు, ట్రాఫిక్‌ పోలీసులు పట్టుకున్నప్పుడు చూద్దాంలే అని ఆ మ్యాటర్‌ని అక్కడితో వదిలేస్తారు. మరికొందరు, 'తర్వాత చెల్లిద్దాం' అని వాయిదాలు వేస్తుంటారు. ఇకపై, ఈ పప్పులు ఉడకవు, చలాన్‌ చెల్లింపులను వాయిదా వేయడం ఇక కుదరదు. చలాన్లను 45 రోజుల్లోగా క్లియర్‌ చేయకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే వరకు వెళ్లే కొత్త కఠిన నిబంధనల 'ముసాయిదా'ను కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది.

45 రోజుల్లో చెల్లించకపోతే కఠిన చర్యలు
ఇప్పటి వరకు, చలాన్‌ చెల్లించడానికి 90 రోజుల సమయం ఉండేది. కానీ కొత్త నిబంధనల్లో ఆ గడువు సగానికి సగం, అంటే 45 రోజులకు తగ్గింది. ఈ గడువు దాటితే, వాహనంపై ఎలాంటి లావాదేవీలను సంబంధిత RTO అంగీకరించరు. అంటే.. మీరు ఆ వాహనాన్ని అమ్మలేరు, లైసెన్సు రెన్యువల్‌ చేసుకోలేరు, పేరు లేదా చిరునామా మార్చుకోవడం కూడా కుదరదు.

గడువు లోగా చలాన్‌ చెల్లించకపోతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం ట్రాఫిక్‌ పోలీసులకు ఉంటుంది. మీ బండిపై చలాన్‌ జారీ అయితే, సంబంధిత అధికారి మూడు రోజుల్లో ఎలక్ట్రానిక్‌ నోటీసు, పదిహేను రోజుల్లో ఫిజికల్‌ నోటీసు పంపాలి.

"5" కు మించి చలాన్లు ఉంటే లైసెన్సే పోతుంది!
ఒక వాహనంపై 5 లేదా అంత కంటే ఎక్కువ చలాన్లు ఉంటే, సంబంధిత డ్రైవింగ్‌ లైసెన్సు సస్పెండ్‌ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. సెంట్రల్‌ మోటార్‌ వెహికిల్స్‌ రూల్స్‌-1989లో చేసిన కీలక సవరణల్లో భాగం ఇది ఒక భాగం.

నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి
'వాహనం నేను నడపలేదు, నా డ్రైవర్‌, స్నేహితుడు లేదా మరొకరు నడిపారు. చలాన్‌ నేనెందుకు చెల్లించాలి' అని చెప్పడం కూడా ఇకపై కుదరదు. వాహన యజమాని తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటేనే, అంటే ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేసిన సమయంలో ఆ వాహనాన్ని తాను నడపలేదు అని నిరూపించుకుంటేనే, వాహనం నడిపిన వ్యక్తిని బాధ్యుడిగా పరిగణిస్తారు. లేదంటే, బండి ఇచ్చినందుకు ఆ చలాన్‌ను వాహన యజమానే చెల్లించాలి.

డిజిటల్‌ మానిటరింగ్‌తో కఠినంగా అమలు
ఈసారి ముసాయిదా రూల్స్‌లో చలాన్‌ జారీ, చెల్లింపు, అప్పీల్‌ వంటి ప్రక్రియలను పూర్తిగా డిజిటల్‌ మానిటరింగ్‌, ఆటోమేషన్‌ ఆధారంగా చేయాలని కేంద్రం సూచించింది. దీని వల్ల ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు సంబంధించిన రికార్డులు వెంటనే అప్‌డేట్‌ అవుతాయి, ఎలాంటి సడలింపులు ఉండవు.

రూల్స్‌ జంప్‌ చేసేవాళ్లకు కఠిన హెచ్చరిక
ముసాయిదాలో ఉన్న నిబంధనలు చట్ట రూపంలో అమల్లోకి వస్తే, ట్రాఫిక్‌ నియమాలు పాటించని వాహనదారులకు ఇక మన్నింపు దొరకడం కష్టమే. చలాన్‌ పడిన వెంటనే 45 రోజుల్లో చెల్లించాలి లేదా అప్పీల్‌ చేసుకోవాలి. ఆలస్యం చేస్తే వాహనం స్వాధీనం, లైసెన్సు రద్దు తప్పదని అధికారులు చెబుతున్నారు. అంటే, “పోలీసులు ఆపినప్పుడు చెల్లిస్తాం” అనడం పాత కథ!. ఇప్పుడు చలాన్‌ పడితే వెంటనే రెస్పాన్స్‌ ఇవ్వడం తప్ప మరో మార్గం లేదు. ట్రాఫిక్‌ నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయడమే లక్ష్యంగా ఈ కొత్త సవరణలను ప్రతిపాదించారు.

ఈ కొత్త ముసాయిదా నిబంధనలపై అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ మీకు ఉంది. ఒకవేళ, ప్రతిపాదిత నిబంధనలపై మీకు అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ ఉంటే.. కేంద్ర రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శికి వాటిని పోస్ట్‌ చేయవచ్చు. లేదా, comments-morth@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయొచ్చు.

టాప్ హెడ్ లైన్స్

రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కేవలం రూ.21,000తో Renault Duster hybrid బుకింగ్స్ ప్రారంభం.. లీటర్‌కు 29 కి.మీ. అదిరిపోయే మైలేజ్!
లీటర్‌కు 29 కి.మీ. మైలేజ్ ఇచ్చే సూపర్‌ SUV.. రెనాల్ట్‌ డస్టర్ హైబ్రిడ్ బుకింగ్స్ ప్రారంభం, రూ.21,000 చాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
IND VS WI Indore 2nd T20 Updates: బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
బౌలర్లకు నరకం చూపించే చిన్న మైదానం.. నేడు ఇండోర్‌లో మూడో టీ20 సమరం, 250 కొట్టినా గ్యారెంటీ లేదు..!!
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Horror Thriller OTT : మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
మనుషుల్ని తినేసే దెయ్యం - ఓటీటీలోకి సూపర్ నేచరల్ హారర్ థ్రిల్లర్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
Bollaram Kidnap Case: బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
బొల్లారంలో ఆరేళ్ల బాలిక కిడ్నాప్ విషాదాంతం.. కాళ్ల చేతులు కట్టి నీళ్ల సంపు పడేసి హత్య, సెక్యూరిటీ గార్డే కిరాతకుడు?
CM Revanth Reddy On El Nino Crisis: రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
రానున్న 8 నెలల్లో ఎల్‌నినో సవాళ్లు.. ముందస్తు కార్యాచరణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Dussehra Navratri Day 1 : దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
దసరా నవరాత్రుల్లో మొదటిరోజు బాల త్రిపుర సుందరికి పెట్టాల్సిన నైవేద్యాలు.. రెసిపీలు ఇవే
Embed widget