Nuvvunte Naa Jathaga Serial Today April 1st: నువ్వుంటే నా జతగా సీరియల్: "ఏం పాపం చేస్తే ఇలాంటి కొడుకులు పుడతారు" కళ్లు చెమర్చిన రిటైర్డ్ టీచర్ ఆవేదన
Nuvvunte Naa Jathaga Today Episode ముగ్గురు కొడుకులు సక్రమంగా లేరని సత్యమూర్తి, శారదలు బాధపడటం వాళ్లని తానే చక్కదిద్దాలని మిధున నడుం భిగించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఆనంద్ కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ ఆఫీస్‌లో చెప్పడంతో సత్యమూర్తి ఫుల్ కోపంగా వచ్చి ఆనంద్‌ని పిలుస్తారు. ఆనంద్ చాలా భయపడతాడు. అందరూ సత్యమూర్తి దగ్గరకు వస్తారు. కరెంట్ బిల్ కట్టావా అని సత్యమూర్తి ఆనంద్‌ని అడుగుతారు. ఏమైందని శారద అడిగుతుంది.
సత్యమూర్తి: వీడు ఇన్ని రోజులు బద్ధకిస్తుడే అనుకున్నా కానీ కన్నతండ్రికి టోకరా వేసి మోసం చేశాడు. అబద్ధాలు చెప్పి నాటకాలు ఆడటం మొదలు పెట్టాడు. మన ఇంట్లో కరెంట్ పోవడానికి కారణం ఏంటో తెలుసా వీడు బిల్ కట్టకపోవడం. లాస్ట్ డేట్ అని డబ్బులు ఇచ్చి కరెంట్ బిల్ కట్టమన్నాను. కానీ ఈ ఇడియట్ బిల్ కట్టకుండా డబ్బు వాడుకున్నాడు.
శారద: ఏంట్రా మీ నాన్న చెప్పింది నిజమా నువ్వు అబద్ధాలు చెప్పి మోసం చేయడం నేర్చుకున్నావా.
రంగం: నేర్చుకుంటాడమ్మా ఈ మధ్య ఆ దేవా గాడితో కలిసి మెలసి ఉన్నాడు కదా వాడి దగ్గరే మోసాలు చేయడం దొంగ బుద్ధులు అన్నీ నేర్చేశాడు. అప్పటికీ నేను లక్ష సార్లు చెప్పాను అమ్మా అయినా వాడితో తిరగడం మానలేదు.
దేవా: ఏమైంది అమ్మ.
కాంతం: ఏంటి బావగారు మీ తమ్ముళ్లకు మంచి నేర్పాల్సిన మీరు ఇలా చేయడం వెరీ బ్యాడ్.
సత్యమూర్తి: నిన్నరాత్రి కరెంట్ పోయినప్పుడే అడిగాను బిల్ కట్టావా అప్పుడే కదా నిజమే చెప్పుంటే నేను ఎలక్ట్రీషియన్‌ని అడిగేదాన్ని కాదు నాకు ఈ అవమానం కూడా ఉండేది కాదు. కరెంట్ బిల్ కట్టక సత్యమూర్తి మాస్టారు ఇంట్లో కరెంట్ కట్ చేశారు అంటే ఎంత చెడ్డ పేరురా. అరేయ్ నువ్వు ఉద్యోగం చేయకపోయినా నా పింఛన్ డబ్బుతో నిన్ను, నీ భార్యని పోషిస్తున్నాను. మరి అబద్ధం చెప్పి మోసం చేయడానికి సిగ్గు అనిపించడం లేదా.
శారద: రేయ్ మీ ప్రతీ అవసరానికి చివరకు మీ ఖర్చులకు కూడా మీ నాన్న డబ్బులు ఇస్తున్నారు కదా. ఈ ఇంటిని నెట్టుకురావడానికి మీ నాన్న రోజు రోజుకు అప్పుల పాలవుతున్నారు అది తెలిసి కూడా మీ నాన్నకి అబద్ధాలు చెప్పడానికి సిగ్గు అనిపించడం లేదా.
ఆనంద్: అమ్మా నేను ఆ డబ్బు ఖర్చు పెట్టలేదు. మా ఫ్రెండ్ ఒకడి దగ్గర గతంలో నేను 2 వేలు అప్పు తీసుకుంటే కరెంట్ బిల్ డబ్బులు నా జేబు నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయాడు అమ్మా. నేను ఎంత చెప్పినా వినలేదు.
శారద: రాత్రే ఈ విషయం చెప్పాల్సింది కదరా మీ నాన్న ఏదో చేసేవాడు.
ఆనంద్: చెప్పడానికి భయం వేసింది అమ్మా వేరే ఫ్రెండ్‌ని అడిగితే ఈ రోజు ఇస్తా అన్నాడు. ఈ లోపు విషయం తెలిసిపోయింది. వాడు ఇస్తాడు ఈ రోజు కట్టేస్తానమ్మా.
సత్యమూర్తి: నోర్ముయ్ వాడి ఎవడి దగ్గరో డబ్బు తీసుకుంటే వాడు ఇప్పుడు లాక్కున్నాడు ఇప్పుడు మరోకడి దగ్గర అప్పు చేస్తావా.. ఓరేయ్ ఇంటి పెద్ద కొడుకుగా నువ్వు నీ తల్లిదండ్రులకు ఓ ముద్ద పెట్టాలి కానీ రిటైర్ అయిపోయిన నీ తండ్రి దగ్గర డబ్బు తీసుకొని బతకడానికి సిగ్గు లేదారా. ఆడపిల్లల తల్లిదండ్రులకు బాధ్యతలు ఎక్కువ అంటారు. నేను 3 కొడుకుల్ని కన్నా నాకు ఇంకా బాధ్యతలు తగ్గలేదు. నా ముగ్గురు కొడుకులు నా రక్తం పీల్చుకొని బతుకుతున్నారు. మాస్టారుగా రిటైర్ అయ్యాను కానీ ఈ కష్టాల నుంచి ఇంకా రిటైర్ అవ్వలేదు. ఇదంతా నా ఖర్మ. నేనే పాపం చేసుంటే నా కడుపున వీళ్లు పుడతారు.
దేవా అన్నయ్యకి సర్దిచెప్పి నేను వెళ్లి బిల్ కట్టేస్తానని అంటే సత్యమూర్తి దేవాని తిట్టి నీ పాపపు సొమ్ము నాకు వద్దని నేను కట్టుకుంటానని అంటాడు. ఈయన ఈ జన్మలో మారడు అనుకొని దేవా వెళ్లిపోతాడు. ప్రమోదిని చాలా ఏడుస్తుంది. ఇక బట్టలు ఉతుకుతూ మామయ్య మాటలు తలచుకొని ఏడుస్తుంది. తన భర్తకి ఇప్పటి వరకు ఉద్యోగం చేయన బద్ధకస్తుడనే పేరు ఉంది ఇప్పుడు కరెంట్ బిల్ కట్టకుండా డబ్బులు కొట్టేసిన దొంగ అనే అవమానం కూడా భరించాలని ఏడుస్తుంది. ప్రమోదిని దగ్గరకు మిధున వస్తుంది. మిధున చూడకుండా ప్రమోదిని కన్నీరు తుడిచేస్తుంది. త్వరలోనే కష్టాలు తలగిపోతాయని చెప్తుంది. అలాంటి ఆశే లేదని ఈ బాధలు అలవాటు అయిపోయిందని చెప్తుంది.
శారద ఆరు బయట కూర్చొని ఏడుస్తుంటే మిధున వెళ్తుంది. తనకు ముగ్గురు కొడుకులు ఏం ప్రాబ్లమ్ లేదు అనేవాళ్లు ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ ముగ్గురు పనికి రాకుండా పోయారని ఏడుస్తుంది. చాలా మంది పిల్లలకు రూపాయి కూడా తీసుకోకుండా చదువు చెప్పారు ఆ పుణ్యం వల్ల కనీసం ఒక్క కొడుకు అయినా బాగు పడుంటే బాగుండేదని ఏడుస్తుంది. బాగా చదువుకున్న ఆనంద్ ఎందుకు ఉద్యోగం చేయడం లేదని ఏడుస్తుంది. పాపం ప్రమోదిని భర్తకి ఉద్యోగం లేక ఒక చీర కొనుక్కోలేదు కనీసం ఆడపిల్లలకు అవసరమైన చిన్న చిన్న వస్తువులు కూడా కనుక్కోదు. ఇప్పుడు అయితే అయిపోతుంది కానీ మేం పోతే పెద్దోడు భార్యని కూతుర్ని ఎలా పోషిస్తాడు. వాడిని నమ్మని పాపానికి పాపం ప్రమోదిని అన్యాయం అయిపోతుందని ఏడుస్తుంది. శ్రీరంగం, కాంతం ఎలాగోలా బతికేస్తారు కానీ వీడి గురించి బెంగ అని ఏడుస్తుంది. అంతా మంచే జరుగుతుంది మీరు బాధ పడకండి అని మిధున అత్తని ఓదార్చుతుంది. ప్రమోదిని అత్త మాటలు విని ఏడ్వడం మిధున చూస్తుంది. ఇక మిధున ఇప్పటి వరకు దేవా తనని భార్యగా అంగీకరించాలి.. ఇంట్లో అందరూ తనని కోడలిగా అంగీకరించాలి అదే నా బాధ్యత మాత్రమే అనుకున్నా కానీ ఇప్పుడు ఫ్యామిలీని చక్కదిద్దడం నా బాధ్యత అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: ఉష, చిన్నిలకు డీఎన్‌ఏ టెస్ట్.. ఈసారి కావేరి దొరికిపోవడం ఖాయం.. చేతులెత్తేసిన రాజు!





















