అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today April 15th: నువ్వుంటే నా జతగా సీరియల్: మీరు కొడుకులా.. అమ్మ మీద మీ ప్రేమ నాటకం.. అసలైన ప్రేమ అంటే ఇది కాదు! 

Nuvvunte Naa Jathaga Today Episode ముగ్గురు కొడుకులు ఉన్నా ఎవరూ కనీసం వంద రూపాయల చీర తీసుకురాలేదని శారద పెళ్లి రోజు గురించి మిధునకు చెప్పి బాధ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఆనంద్ ఇంటికి వస్తాడు. శ్రీరంగం, సూర్యకాంతం వచ్చి బావ గారి ముఖం వెలిగిపోతుంది అంటే జాబ్ దొరకలేదని అర్థమవుతుందని అంటుంది. ప్రమోదిని వచ్చి జాబ్ దొరకలేదా అని అడిగితే దొరికింది రోజూ వెళ్లాలి అని చెప్తాడు. ప్రమోదిని సంతోషంతో భర్తకి కాఫీ తీసుకొస్తానని అంటుంది. 

రేపు మా పెళ్లి రోజు..

సత్యమూర్తి బయటకు వెళ్తాను అని శారదతో చెప్తే శారద భర్తతో రేపటి రోజు విశేషం గుర్తుంది కదా అంటుంది. సత్యమూర్తి గుర్తుంది అనడంతో రేపు గుడికి వెళ్లాలి పూజ సామాను తీసుకురమ్మని  చెప్తుంది. తర్వాత మిధున వచ్చి రేపు ఏదో స్పెషల్ డే అని చెప్పారు ఏంటి అమ్మా అని అడుగుతుంది. ఏం లేదు అని శారద అనేస్తుంది. అయినా మిధున చెప్పమని అడగటంతో శారద రేపు తమ పెళ్లి రోజు అని చెప్తుంది. అందరూ చాలా సంతోష పడతారు. ఆనంత్, రంగం వాళ్ల అమ్మతో ముందే చెప్తే మేం గ్రాండ్‌గా చేసేవాళ్లం అని అంటారు. దానికి శారద పండగలే డబ్బులు లేక సరిగా చేసుకోవడం లేదు ఇక పెళ్లి రోజు ఎందుకులే అంటుంది. ప్రమోదిని పాయసం చేస్తాను అన్నా వద్దు అనేస్తుంది. 

రేపు మీకు చాలా గిఫ్ట్‌లు వస్తాయి కదా..

మిధున అత్తతో అమ్మ అయితే రేపు మీకు చాలా గిఫ్ట్‌లు వస్తాయి కదా అంటుంది. గిఫ్ట్‌లా అని శారద అంటే మా ఇంట్లో ఏం జరిగినా బాగా సెలబ్రేట్  చేసుకుంటాం కేక్ కట్ చేస్తాం. అందరూ గిఫ్ట్‌లు ఇస్తారు అంటుంది.  మీ ఇంట్లో కూడా అంటేనే అంటే దానికి శారద గిఫ్ట్‌లు అదొక్కటే తక్కువ మా పెళ్లి రోజు ఎప్పుడో కూడా ఈ ఇంట్లో ఎవరికీ తెలీదు. మేం సైలెంట్‌గా గుడికి వెళ్లి వస్తాం అంటుంది. దానికి మిధున మీరు అలా అంటే ఆశ్చర్యంగా ఉంది వీళ్లు అమ్మానాన్నల పెళ్లి రోజు జరపరా గిఫ్ట్‌లు ఇవ్వారా అని షాకింగ్‌గా మాట్లాడుతుంది. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రలు పెళ్లి రోజుల్ని పుట్టిన రోజుని పండగా చూసుకుంటారు కదా అంటుంది. 

వీళ్లు మమల్ని అడుక్కు తినేలా చేసేవాళ్లు..

దానికి శారద వీళ్లా కనీసం వీళ్లు ఒక పండగకు కూడా ఒక్క చీర కూడా కొనివ్వలేదు. ఈ చీరలన్నీ మా ఆయన రిటైర్ అయినప్పుడు కొనుకున్నా నేను పోయే వరకు వీటినే కట్టుకోవాలి అని అంటుంది. ఒక్కర్ని కంటే నడి వీధిలో పడేస్తారు. అదే నలుగురిని కంటే నట్టింట్లో కుర్చీలో కూర్చొపెట్టి దర్జాగా బతుకుతారు తల్లిదండ్రలు అంటారు. కానీ నేను ఆయన అనాథల్లా బతుకుతున్నాం. ఒకవేళ ఆయన ఫెంక్షన్ డబ్బులు రాకపోతే వీళ్లు ఎప్పుడో మమల్ని రోడ్డున పడేసి అడుక్కుతినేలా చేసేవాళ్లు అని ఏడుస్తూ వెళ్లిపోతుంది. 

అర్జెంటుగా ఎందుకు రమ్మన్నావ్..

దేవా మిధున దగ్గరకు వచ్చి ఏంటి అర్జెంట్‌గా రమ్మని కాల్ చేసి బుర్ర తింటున్నావ్ ఏంటి మ్యాటర్ ఏంటి అని అడుగుతాడు. మిధున దేవాతో  ఈ సృష్టిలో ప్రేమ చాలా పవిత్రమైనది అని ప్రేమని మంచి మరొకటి లేదని అంటారు కదా ప్రేమకు అర్థం నీకు తెలుసా అని అడుగుతుంది. దానికి దేవా ఎన్నాళ్లు నీకు మంచి డౌట్ వచ్చింది చెప్తా అని అంటాడు. మీ అమ్మానాన్నలకు నువ్వంటే ఆకాశం అంత ప్రేమ ఇక మీ నాన్నకి అయితే పంచ ప్రాణాలు నువ్వే. ఇక నిన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న  ఆ వకీల్ సాబ్ ఆదిత్యకి నువ్వు అంటే చచ్చేంత ప్రేమ వాళ్లందరూ ఇక్కడికి వచ్చి వాయిదా పద్ధతుల్లో కన్నీరు పెట్టుకొని మరీ నిన్ను ఇంటికి రమ్మని బతిమాలారు కనీసం నువ్వు వెళ్లలేదు అంటాడు. దానికి మిధున అవన్నీ సరే ప్రేమ అంటే అసలైన నిర్వచనం చెప్పు అంటుంది.  

ప్రేమకు అసలైన నిర్వచనం..

అసలైన ప్రేమ అంటే ఒక చిన్న స్పర్శతో తల్లిదండ్రులకు పిల్లల మీద ఏర్పడే నూరేళ్ల మానసిక బంధం అని అంటాడు. తల్లిదండ్రులది చాలా విలువైన వెలకట్టలేని ప్రేమ అంటాడు. మా నాన్న నన్ను లక్షలు సార్లు వెళ్లిపోమని చెప్పిన వాళ్లంటే నాకు ప్రాణం కాబట్టి వెళ్లడం లేదని అంటాడు. నీకు ప్రేమ అంటేనే తెలీదు అని అంటాడు. 

తల్లి బాధని కథగా చెప్పిన మిధున..

మిధున దేవాతో ఒక తల్లికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. అందరూ ఆమెతో నీకేంటి అమ్మనీకు 3 కొడుకులు ఉన్నారు అనేవాళ్లంట. ఒక రోజు ఆమె దగ్గరకు మిధున వెళ్లి రేపు మీ పెళ్లి రోజు కదా మీ ముగ్గురు కొడుకులు ఏం చేస్తారు అని అడిగిందంట. దానికి ఆ తల్లి ఏడుస్తూ ఈ లోకంలో నా కంటే దురదృష్ట తల్లి మరొకరు ఉండరు. నా కొడుకులు పెళ్లి రోజు గొప్పగా చేసి గిఫ్ట్‌లు ఇవ్వడం తర్వాత సంగతి కనీసం 100 రూపాయలతో ఎప్పుడూ ఒక చీర కూడా కొనివ్వలేదని అంటుంది అని దేవాకి తల్లి బాధ అర్థమయ్యేలా చెప్తుంది.  ఆ మాటలు విని దేవా వెళ్లిపోతాడు. 

మిధున మాటలకు దేవా మనసు మారుతుందా..
 
ఆనంద్ కూలి పని చేసి 150 రూపాయలు తీసుకొచ్చి భార్యకి ఇవ్వడంతో ప్రమోదిని వాటిని లెక్క పెట్టి ఏవండీ అత్తయ్యకి చీర కొందామనుకున్నా 150తో ఏం చీర వస్తుందండీ సాదా సీదా చీర వస్తుంది అని బాధ పడుతుంది. తక్కువ డబ్బులతో చీర ఇస్తే ఏం బాగుంటుందని అంటుంది. ఇక రంగం తల్లికి ఒక వేయి రెండు పెట్టి చీర కొందామని అంటే కాంతం ఒప్పుకోదు. 5 రూపాయలతో చాక్లెట్ ఇద్దామని అంటుంది. ఇక మిధున దేవా దగ్గరకు వెళ్తుంది. చీరలు లేక పని మనిషిలా ఉన్నారని తల్లి బాధ పడుతుంది అని మిధున దేవాతో చెప్తుంది. నిజమైన ప్రేమ ఎక్కడుంది అని అడుగుతుంది. రేపు మీ అమ్మానాన్నల 30 వ పెళ్లి రోజు అని రేపు ఆ పెళ్లి రోజుని మీరు గొప్పగా చేయాలి కానీ మీతల్లి గుడికి వెళ్లి దండం పెట్టుకొని రావాలి అనుకుంటుంది ఇదేనా నీ ప్రేమ అని అంటుంది. 

అమ్మ మీద నీ ప్రేమ నాటకం..

మా నాన్న నా చేతితో రూపాయి ఇచ్చినా తీసుకోడు ఒకే అంటే ఇప్పటికి ఇప్పుడు 100 చీరలు తీసుకొస్తా అంటాడు. మీ నాన్న తీసుకొడు అని కొనివ్వవా అంటుంది. సందర్భం వచ్చింది కదా అని చెప్తున్నా ఆ రోజు నేను నిన్ను మా ఇంటికి దింపే అయి చెప్పాను కదా నువ్వు సంతోషంగా దింపేశావ్ అసలు ఎందుకు వెళ్లానో తెలుసా ఆ రోజు మా నాన్న పుట్టిన రోజు అని వెళ్లాను. మా నాన్న తిట్టి నన్ను పంపారు కానీ నేను వెళ్లాను ఎందుకంటే అది మా నాన్న మీద నా ప్రేమ  అని అంటుంది. తిట్టినా కొట్టినా అదే అసలైన ప్రేమ అని నీలో ఉన్న ప్రేమ నాటకం అని అంటుంది. మిధున వెళ్లిపోతుంటే దేవా ఆపి నా ప్రేమ నాటకం అంటావా అని అంటాడు. నీకు నిజంగా మీ అమ్మ మీద అంత ప్రేమ ఉంటే ఆవిడ తీసుకుంటారో లేదో తర్వాత సంగతి ముందు ఒక చీర తీసుకు రండి అని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కొన ఊపిరితో కొట్టుకుంటున్న దశరథ్.. దీప వల్ల సుమిత్ర జీవితం అన్యాయం అయిపోతుందా!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget