అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today April 14th: నువ్వుంటే నా జతగా సీరియల్: నా కూతురుని తెచ్చుకోవడానికే నిన్ను టార్గెట్ చేశా: పురుషోత్తానికి జడ్జి వార్నింగ్

Nuvvunte Naa Jathaga Today Episode ఆనంద్ జాబ్ చూసుకుంటా అని వెళ్లి రోజు కూలీలా కర్రల మిల్లులో పని చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

 Nuvvunte Naa Jathaga Serial Today Episode శ్రీరంగం పేపర్ చదువుతూ ఉంటే సత్యమూర్తి అక్కడే కూర్చొని ఉంటారు. ఇక ప్రమోదిని భర్త కోసం బాక్స్ రెడీ చేస్తుంది. ఆనంద్ చక్కగా టక్ వేసుకొని బయల్దేరుతాడు. ఆనంద్‌ని చూసి నువ్వా అన్నయ్య అని రంగం సెటైర్లు వేస్తాడు. అందరూ ఆనంద్ దగ్గరకు వస్తారు. మిధున చాలా సంతోష పడుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు.

మా ఆయన ఉద్యోగానికి వెళ్తున్నారు..

ప్రమోదిని భర్తకి బాక్స్ ఇస్తుంటే కాంతం చూసి ఏంటి అక్కాయ్ స్కూల్ పిల్లాడికి బాక్స్ ఇస్తున్నట్లు బావగారికి బాక్స్ ఇస్తున్నావ్.. పనీ పాట లేనట్లు ఎప్పుడూ ఇంట్లో ఉండే బావగారు ఈ రోజు టిప్ టాక్‌గా రెడీ అయ్యారు ఏంటి అని అడుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం అపశకునం అని తెలీదా అని అంటుంది. దానికి ప్రమోదిని ఆయన ముఖ్యమైన పని మీద వెళ్తున్నారు మీ వెటకారాలు ఆపండి అని ప్రమోదిని అంటుంది. సత్యమూర్తి కూడా ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అంటే ప్రమోదిని సంతోషంగా ఆయన ఉద్యోగానికి వెళ్తున్నారు మామయ్య అని చెప్తుంది. సత్యమూర్తి చాలా సంతోషపడతాడు. రంగం, కాంతం ఆనంద్ సంపాదించి ఎదిగిపోతాడని కుళ్లుతో బెంగ పెట్టుకుంటారు.

అదే నా చివరి అవమానం..

శారద కొడుకుతో నీలో ఇంత మార్పు వచ్చింది అంటే ఏ దేవుడో దేవతో నీ మనసు మార్చారు అనుకోవాలి అంటుంది. దానికి ఆనంద్ అమ్మ నిన్న ప్రమోదిని విషయంలో జరిగింది నా చివరి అవమానంగా మిగిలిపోవాలని అనుకున్నాను అమ్మ. ఇంకోసారి నాన్న ముందు అసమర్థ కొడుకుగా తల దించుకోకూడదు అనుకున్నా అమ్మ ఈ రోజు ఏదో ఒక ఉద్యోగంలో కచ్చితంగా చేరుతాను. శారద అమితానందంతో నీలో ఈ మార్పే మాకు కావాలిరా. దేవుడి దగ్గర 50 రూపాయలు ఉన్నాయి  వెళ్లి తీసుకొస్తా అంటే ఆనంద్ వద్దని ప్రమోదిని వంద రూపాయలు ఇచ్చిందని చెప్పి తల్లిని తండ్రి పక్కన నిల్చొపెట్టి ఆశీర్వాదం తీసుకుంటాడు. నాన్న మీరు ఎన్ని సార్లు జాబ్‌కి వెళ్లమన్నా వెళ్లలేదు కానీ నిన్న కొన్ని సంఘటనలు వల్ల బుద్ధి వచ్చిందని ఇకపై జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను అని చెప్తాడు.

ఈ నాన్న కంటే సంతోషించే వాళ్లు ఎవరూ లేరురా..

ఆనంద్ నువ్వు ప్రయోజకుడు అయితే నా కంటే సంతోషించేవాడు ఎవరూ లేరురా అని అంటాడు. దేవా అన్నయ్యని పిలిచి వదిన ముఖంలో నిజమైన సంతోషం ఈ రోజు చూస్తున్నారా అది ఎప్పటికీ అలాగే ఉండేలా చూసుకోరా అంటాడు. సరేరా అని ఆనంద్ అంటాడు. అందరూ నవ్వుకుంటారు. ఇక మిధున మంచి జాబ్ రావాలి అని ఆల్‌ది బెస్ట్ చెప్తుంది. ఇక ఆనంద్ అందరికీ చెప్పి వెళ్తుంటే సత్యమూర్తి డబ్బులు జేబులో పెడతాడు. ఆనంద్ జాబ్‌ వెతుక్కోవడానికి వెళ్తాడు. మిధున దేవాతో తనకు థ్యాంక్స్ చెప్పమని అంటాడు. దాంతో దేవా మొత్తం నువ్వు చేసినట్లు మాట్లాడకు నువ్వు సలహా ఒక్కటే ఇచ్చావ్ మా వదినతో మాట్లాడింది నేను. బయట మా అన్నయ్యకి డబ్బులు ఎవరూ ఇవ్వకుండా చేసి వాడికి బుద్ధి వచ్చేలా చేసింది నేను అని అంటాడు. శారద సంతోషంతో భర్తతో ఏ దేవత వరమో కానీ మన ఇంటికి మంచి రోజులు వచ్చేశాయ్ అని అంటుంది. 
 
పురుషోత్తానికి హరివర్దన్ వార్నింగ్..

జడ్జి హరివర్దన్ పురుషోత్తాన్ని ఇంటికి పిలిపిస్తాడు. పురుషోత్తం చేతులు కట్టుకొని సార్ నేను పూర్తిగా మారిపోయాను. ప్రజలకు మంచి చేయాలి అని రాజకీయాల్లోకి వస్తున్నాను మీరు నా మీద ఉన్న పాత కేసులు ఎందుకు తిరగేస్తున్నారో అర్థం కావడం లేదు సార్ అని అంటాడు. హరివర్దన్ పురుషోత్తంతో నా కూతురుని నా ఇంటికి తెచ్చుకోవడానికే నిన్ను టార్గెట్ చేశా అని అంటాడు. మీ కూతురి కోసం నన్ను ఇబ్బంది పెట్టారు ఏంటి సార్ అంటే ఆ రౌడీ దేవా నీ మనిషే కదా అందుకే ఇందంతా అంటాడు. మీ అమ్మాయి గారు ఎవరి మాట వినడం లేదు అని పురుషోత్తం అంటాడు. వాడు బలవంతంగా తాళి కట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని నా కూతురు నా ఇంటికి రావాలి లేదంటే నువ్వు ఎమ్మెల్యే  అవ్వవు శిక్ష పడి జైలుకి వెళ్తావ్ లైఫ్‌లో బయటకు రావు అని అంటాడు. 

మిధునకు ఎలా థ్యాంక్స్ చెప్పాలి..

పెద్దన్నయ్య జాబ్‌కి వెళ్లాడు అంటే మిధున వల్లే అని మిధునకు థ్యాంక్స్ చెప్పాలి అని దేవా అనుకుంటాడు. ఎలా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుంటే మిధున ఎదురు పడి భర్త తలచుకుంటావా అని అంటుంది. ఇక దేవాతో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన పని లేదు ఇది నా ఇళ్లు ఇదంతా నా బాధ్యత అని అంటుంది. రాక్షసికి బుర్రంతా వెటకారమే అని అనుకుంటాడు. నా ఐడియా విన్నందుకు మీ వదినతో చెప్పినట్లు థ్యాంక్స్ అని అంటుంది. ఆ మాట ప్రమోదిని వింటుంది. ఇక దేవా ఐడియా ఇచ్చినందుకు మిధునకు థ్యాంక్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తాడు. ఇక దేవాని కాల్ రావడంతో వెళ్లిపోతాడు. మిధున వద్దని ఎంత బతిమాలినా దేవా వినకుండా వెళ్లిపోతాడు.

ప్రమోదిని కృతజ్ఞతలు..

ప్రమోదిని మిధునని హగ్ చేసుకొని ఏడుస్తూ థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు ఇంట్లో పస్తులు ఉంటే కనీసం నేను గ్లాస్ మంచి నీరు ఇవ్వలేదు కానీ నువ్వు మాత్రం నా భర్త జాబ్‌కి వెళ్లేలా చేశావ్ ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను అంటుంది. దానికి మిధున నేను ఈ ఇంట్లో ఉండటానికి నువ్వే ఒక కారణం అక్క నువ్వు బస్తీ వాళ్లకి నేను దేవా భార్య అని చెప్పడం వల్లే నేను ఈ రోజు ఇంట్లో ఉన్నాను అని అంటుంది. ప్రమోదిని మిధునతో ఈ రోజు నుంచి నువ్వు నా తోబట్టువే కాదు సొంత చెల్లివి కూడా అని అంటుంది. 

కర్రల పనిలో ఆనంద్..

ఆనంద్ ఓ చెక్కల కొట్టుకు వెళ్లి పని అడగుతాడు. అక్కడ కర్రల మిల్‌లో పని ఇస్తారు. దాంతో చెక్కలు మోయడం, దుమ్మలో కర్రలు కోయడం వంటి పనులు చేస్తూ చాలా కష్టపడతాడు. మరోవైపు పురుషోత్తం వస్తుంటే ఆయన కటౌట్ పడిపోబోతుంటే మనుషులు పట్టుకుంటారు. మొదలు పెట్టకుండానే నా రాజకీయం జీవితం నాశనం అయిపోయిందని పురుషోత్తం ఆవేశపడతాడు. దాంతో లాయర్ దేవా వల్లే ఈ ప్రాబ్లమ్ వచ్చింది కాబట్టి దేవా భార్యని వాళ్ల ఇంటికి పంపేయాలి అంటాడు. దాంతో పురుషోత్తం దేవా వైపు నుంచే నరుక్కురావాలి అంటాడు. ఇంతలో దేవా వస్తాడు. నీ కోసం నేను ప్రాణం ఇస్తాను అన్న అని దేవా అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget