అన్వేషించండి

Nuvvunte Naa Jathaga Serial Today April 11th: నువ్వుంటే నా జతగా సీరియల్: మీకు సిగ్గుందా బావగారు.. మీ మీద మీకే అసహ్యం రావాలి.. ఆనంద్‌లో మార్పు!

Nuvvunte Naa Jathaga Today Episode మిధున ఆనంద్‌ని తిట్టి ఆనంద్ జాబ్ చేయకుండా చేస్తున్న తప్పును కళ్లకు కట్టేలా చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిధున ప్రమోదినితో బావగారు ఇలా అవ్వడానికి సగం కారణం నువ్వే అని అంటుంది. ఎప్పుడూ నువ్వు వెనకేసుకొని రావడంతోనే బద్ధకం పెరిగిందని అంటుంది. ప్రమోదిని మిధునతో నిజం చెప్పకుండా ఆయన ఈ సారి జాబ్‌కి వెళ్తారని అంటుంది. ఇక ఆనంద్ కనిపించిన అందరికీ 500 కోసం అడుగుతూనే ఉంటారు. ఎవరూ సాయం చేయరు.  

ఆనంద్: సారీ ప్రమోదిని నీకు జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ కూడా తీసుకురాలేకపోతున్నాను. ఇంటికి వచ్చి ఈ అసమర్ధుడి ముఖం నీకు ఎలా చూపించగలను. 
ప్రమోదిని: ఏంటి ఈయన ఇంకా ఇంటికి రాలేదు పాపం ఎంత ఇబ్బంది పడుతున్నారో. 
ఆనంద్: ప్రమోదిని.
ప్రమోదిని: ఏవండీ వచ్చారా మీ కోసమే ఎదురు చూస్తున్నాను. నాకు తల పగిలిపోతుంది. జ్వరం తట్టుకోలేకపోతున్నా త్వరగా ట్యాబ్లెట్స్ ఇవ్వండి. మందులు అడిగితే అలా ఏడుస్తున్నారేంటి.
ఆనంద్: మందులు తీసుకురాలేదు. నేనే కొనలేకపోయాను. ఎంతో మందికి అప్పు అడిగాను ప్రమోదిని కానీ 60 రూపాయల ట్యాబ్లెట్స్ 50 రూపాయల బ్రెడ్ ప్యాకెట్ కొనలేకపోయాను. 110 రూపాయల కోసం ఎవరూ నన్ను నమ్మలేదు. సత్యమూర్తి మాస్టారి కొడుకుగా గౌరవం ఉంది కానీ ఉద్యోగం లేదని అందరూ నన్ను అవమానించారు ప్రమోదిని. నాకు ఉద్యోగం లేదు కాబట్టి నా క్లోజ్ ఫ్రెండ్ కూడా నాకు 200 వందలు ఇవ్వడానికి నమ్మలేదు ప్రమోదిని.
ప్రమోదిని: మీ క్లోజ్ ఫ్రెండ్ కూడా మీకు నమ్మకపోవడానికి కారణం ఏంటో అర్థమైందా.
ఆనంద్: ఈ రోజే ఆ విషయం నాకు అర్థమైంది ప్రమోదిని. ఉద్యోగం చేతకాని బద్ధకస్తుడు అని అందరూ నన్ను అవమానించారు. దాని కంటే కూడా నా భార్య కోసం మందులు తీసుకురాలేకపోయాను అనే అవమానం నన్ను ఇంకా తొలచేస్తుంది. నీ కోసం ఎలా మందులు తేవాలో నాకు అర్థం కావడం లేదు ప్రమోదిని. ఓడిపోయాను నీ విషయంలో భర్తగా ఓడిపోయాను నా మీద నాకే సిగ్గుగా అసహ్యంగా ఉంది. కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నా. నీ ఎదురుగా నిల్చొలేకపోతున్నా. అని వెళ్లిపోతాడు. దేవా మిధున మొత్తం వింటారు. మిధున కూడా వెళ్తుంది. ఆనంద్ బయట ఏడుస్తాడు. 
మిధున: ఏడిస్తే మీ భార్యకి జ్వరం తగ్గిపోతుందా. మీ కన్నీటికి మెడిసిన్ వస్తుందా.
ఆనంద్: మరేం చేయను మెడికల్ షాపు వాడికి అప్పు అడిగాను నా ఫ్రెండ్స్‌ని అడిగాను ఎవరూ ఇవ్వను అన్నారు. రెండు వందల రూపాయలకు నన్ను ఎవరూ నమ్మలేదు తెలుసా.
మిధున: ఎందుకు మిమల్ని నమ్మలేదో తెలుస్తుందా.
ఆనంద్: నేను సంపాదించడం లేదని.
మిధున: మరి అందుకు మీకు సిగ్గుగా అనిపించడం లేదా. 
ఆనంద్: అదేంటమ్మా నువ్వు కూడా వాళ్లలాగే అంటున్నావ్. 
మిధున: నేను మాత్రమే కాదు బావగారు జాబ్ చేయాల్సిన వయసులో చేయకుండా ఇలా సోమరిగా ఉంటే ఎవరైనా ఇలాగే అడుగుతారు. మిమల్ని 200 రూపాయలకే ఎవరూ నమ్మలేదు. మీ భార్య కోసం మీరు  మందులు కొనడానికి కూడా మీ దగ్గర డబ్బు లేదు అంటే మీకు సిగ్గు కాదు బావగారు మీ మీద మీకు అసహ్యం రావాలి.
ఆనంద్: నువ్వు అలా అనకు మిధున నాకు బాధ వేస్తుంది.
మిధున: బాధ కాదు బావగారు ఇది నిజం. వంద రూపాయలకే మందులు కొనలేని మీరు రేపు ఏదైనా ప్రమాదం జరిగి లక్షలు లక్షలు అవసరం అయితే ఏం చేస్తారు. నా భార్య చనిపోతే చనిపోయింది అని వదిలేస్తారా. 
ఆనంద్: అదేంటి అమ్మ అంత దారుణంగా మాట్లాడుతున్నావ్.
మిధున: కానీ నేను అడిగిన దానికి మీ దగ్గర సమాధానం లేదుగా. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మిమల్ని పెళ్లి చేసుకున్న పాపానికి ఆమె దిక్కులేని చావు చావాలా. సరే మీకు ఏమైనా అయితే అక్క ఎవరిని అడిగి డబ్బు తెస్తుంది. పొరపాటున మీకు ఏమైనా అయితే అక్క పరిస్థితి ఏంటి. మీకు అలాంటి పరిస్థితి రాదని గ్యారెంటీ ఏంటి. చూడండి బావగారు ప్రతీ ఆడపిల్ల పెళ్లితో అయిన వాళ్లందరినీ వదిలేసి భర్త అనే నమ్మకంతో వస్తుంది. కానీ ఆ నమ్మకం నందన వనం అవ్వకపోయినా పర్లేదు కానీ నరకం అవ్వకూడదు. మిమల్ని పెళ్లిచేసుకున్న పానానికి అక్క నరకంలో బతకాలా. మీ ప్రతీ చిన్ని అవసరానికి మీ నాన్న డబ్బు మీద ఆధారపడి బతకడం కూడా ఒక బతుకేనా. అమ్మానాన్నలకు అండగా ఉండాల్సిన మీరు మీ నాన్నరక్తం పీల్చుకు బతకడం ఏంటండి సిగ్గు లేకుండా. మీరు అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటి మర్చిపోతున్నారు. మీకు ఒక కూతురు ఉంది. మీ కూతురు వేరే వాళ్ల దగ్గర ఉండటం వల్ల అమ్మని ఆంటీ అని పిలుస్తుంది. రేపటి రోజున మిమల్ని అంకుల్ అంటుంది. అంత కంటే సిగ్గు మీకు మరొకటి ఉండదు. మీరు అప్పు తీసుకుంటున్నారు అనుకుంటున్నారు కానీ మీకు ఇచ్చేవాళ్ల దృష్టిలో మీరు అడుక్కోవడం. చదువు తెలివి ఉండి అడుక్కునే వాడిలా ఉండకండి. వెళ్లి మీ భార్యకి మందులు తీసుకువచ్చి ఇవ్వండి అని 200 ఇస్తుంది. 

ఆనంద్ వెళ్తాడు. మీ కన్నీరే చెప్తున్నాయ్ బావగారు మీలో మార్పు కనిపిస్తుందని అని మిధున అనుకుంటుంది. కాంతం భర్త దగ్గరకు వచ్చి మన కొంప మునిగిపోయేలా ఉందని అంటుంది. ఏమైందని రంగం అడుగుతాడు. దాంతో కాంతం మిధున దేవా కలిసి మీ అన్నయ్యని ఉద్యోగానికి వెళ్లేలా ప్లాన్ చేశారని మీ అన్నయ్య జాబ్‌కి వెళ్లేలా ఉన్నాడని అంటుంది. వాడు వెళ్లడని వాడికి చాలా బద్ధకం అని రంగం అంటాడు. దాంతో కాంతం మీ అన్నయ్య జాబ్‌కి వెళ్తాడో వాళ్లు ఎక్కడ బాగు పడిపోతారో అని టెన్షన్‌తో చచ్చానని అంటుంది. 

ఆనంద్ ప్రమోదిని కోసం మందులు బ్రెడ్ తీసుకొస్తాడు. మిధున చాటుగా చూస్తుంది. ఎలా తీసుకొచ్చారని ప్రమోదిని అడుగుతుంది. మిధున డబ్బులిచ్చిందని అంటాడు. తన దగ్గర ఎందుకు తీసుకొచ్చారు ఇది మీకు గౌరవంగా ఉందా అని అంటుంది. దాంతో ఆనంద్ ఇంటా బయట నాకు గౌరవం లేదు నేనేం తప్పు చేశానో ఒక వ్యక్తి నా కళ్లు తెరిపించారు.. నాకు బుద్ధి వచ్చేలా చేశారు. నేను ఉద్యోగానికి వెళ్తాను అని ఆనంద్ చెప్తాడు. ప్రమోదిని, మిధున చాలా సంతోషపడతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: "అత్యాచారయత్నం కేసులో సీఎం అరెస్ట్.. పదవికి రాజీనామా"!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget