అన్వేషించండి

Nindu noorella savaasam Serial Weekly Roundup  August 25th to 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: గడచిన వారం ఏం జరిగిందో మొత్తం ఎపిసోడ్స్‌ హైలెట్స్‌

Nindu nooleralla savaasam serial weekly episode August 25th to 30th: నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఈ వారంలో చాలా ఆసక్తికరంగా జరిగింది.

Nindu noorella savaasam Serial weekly Episode:  ఆరు ఆత్మను ఎలాగైనా టార్చర్‌ చేయాలని మనోహరి డిసైడ్‌ అవుతుంది. అందుకోసం పిల్లలతో కలిసి గార్డెన్‌లో  పుట్‌బాల్‌ ఆడాలనుకుంటుంది. పిల్లలను పిలిచి బయట బాల్‌ ఆట ఆడుదామటుంది. పిల్లలు కూడా హ్యాపీగా సరే అంటూ మనోహరి వెంట వెళ్తారు. అందరూ కలిసి ఆడుతుంటే మనోహరి కావాలనే పదే పదే బాల్‌ను ఆరు ఉన్న వైపు వేస్తుంది. కానీ ప్రతిసారి పిల్లలు ఎవరో ఒకరు ఆరు వైపు బాల్‌ వెళ్లకుండా అడ్డుపడుతుంటారు. ఇంతలో రాథోడ్‌ పంతులుగారిని తీసుకుని వస్తాడు. మనోహరి వెంటనే కారు దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి ఎవరు రాథోడ్‌ ఇతను అని అడుగుతుంది.

దీంతో పంతులు గారు మేడం అమర్‌ సార్ తీసుకురమ్మన్నారు అని చెప్తాడు. ఎందుకు అని మనోహరి అడిగితే తనకు తెలియదని పంతులును తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు రాథోడ్‌. మనోహరి కూడా పిల్లలను ఆడుకోమ్మని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది. పై నుంచి అంతా చూస్తున్న గుప్త తూనీగ రూపంలో వచ్చి ఆరు బంధనాన్ని తెంపేసి ఆరుకు విముక్తి కల్పిస్తాడు. తన మీద కూర్చోబెట్టుకుని మొత్తం తిప్పేస్తుంటాడు. ఇంతలో ఆరు బంధ విముక్తి అయిన విషయం చంభాకు తెలుస్తుంది. వెంటనే చంభా గట్టిగా అరుస్తూ ఆ ఆత్మ తప్పించుకుంది రణవీర్ అని చెప్తుంది. వెంటనే రణవీర్ మనోహరి కి ఫోన్‌ చేసి అక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఏం లేదు ఒక పంతులును అమర్ ఇంటికి పిలిపించారు అని చెప్తుంది. అయితే ఆత్మ తప్పించుకుందని చంభా చెప్తుంది అనగానే మనోహరి షాక్‌ అవుతుంది. తర్వాత మాట్లాడతానని కాల్‌ కట్‌ చేస్తుంది.

అమర్‌ ఇంటికి వచ్చి పంతులు ఆరు ఆత్మ కోసం ఇంట్లో హోమం చేయమని చెప్తాడు. సరేనని ఏర్పాట్లు చేస్తుంటారు. విషయం తెలిసిన చంభా హోమం జరగకుండా ఆపాలని మనోహరికి చెప్తుంది. మనోహరి చిత్ర ఇద్దరూ కలిసి ఎంత ప్రయత్నించినా అమర్‌ హోమం అపడు. హోమం విజయవంతంగా పూర్తి చేస్తారు.  హోమం పూర్తి చేశాక పిల్లలందరినీ  తీసుకుని వినాయక చవితి షాపింగ్‌కు వెళ్లాలని అనుకుంటారు. అమర్ వచ్చి కారు దగ్గర నిల్చుని ఉంటాడు. పిల్లల కోసం వెయిట్ చేస్తుంటాడు. గార్డెన్‌లో కూర్చున్న ఆరు అమర్‌ను చూస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లోంచి పిల్లలు రాగానే అమర్‌ కారు స్టార్ట్‌ చేసి వెళ్లబోతుంటే.. అప్పుడే ఆరును గుప్త కారు దగ్గరకు తీసుకొస్తాడు. దగ్గరకు వచ్చిన ఆరు ఏవండి ఆగండి నేను వస్తున్నాను షాపింగ్‌కు అంటుంది. దీంతో అమర్‌ ఎమోషనల్ గా గార్డెణ్ వైపు చూస్తూ ఉంటాడు.

ఇంతలో చిత్రగుప్తుడు ఆరు దగ్గరకు వచ్చి నీకు ఇంకా గండం పూర్తిగా పోలేదని.. రేపు మీ ఇంట్లో గణపతి పూజ అయ్యాకే పూర్తిగా పోతుందని చెప్తాడు. అయితే మా వాళ్లు కచ్చితంగా గణపతి పూజ పూర్తి చేస్తారని ఆరు అంటుంది. ఇక అమర వాళ్లు షాపింగ్‌కు వస్తున్నారని తెలుసుకున్న చిత్ర.. మేనేజర్‌కు బిల్లు వేయమని చెప్తుంది. వినోద్‌ వద్దని చెప్పగానే.. వినోద్‌తో గొడవ పడుతుంది. వాళ్లు అశ్రమం పిల్లలకు కూడా కొంటున్నారు అందుకే బిల్లు వేయమని చెప్పాను అంటూ చిత్ర వెళ్లిపోతుంది. ఆశ్రమం పిల్లల బట్టల కోసం షాపింగ్‌ మాల్‌కు వస్తుంది వార్డెన్‌ సరస్వతి. అక్కడ మనోహరి, చిత్రను చూసి భయంతో పక్కకు వెళ్లి దాక్కుంటుంది. అయితే అమర్‌ను కలవమని ఒక పేపర్‌ మీద రాసి అక్కడే ఉన్న సేల్స్‌ గర్ల్‌ కు ఇస్తుంది. ఆ పేపర్‌ మనోహరి చూస్తుంది. కిందకు వెళ్లి వార్డెన్‌ను చంపాలనుకుని గొంతు నులుముతుంది. ఇంతలో మనోహరి నుంచి తప్పించుకుని పారిపోతుంది. దీంతో ఈ వారం నిండు నూరేళ్ల సావాసం అయిపోతుంది.

ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget