Nindu Noorella Saavasam November 28th Episode: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: తెలియకుండానే తల్లిని కాపాడుకున్న అంజు, అరుంధతి గురించి నిజం తెలిసి తీరాలన్నా అమరేంద్ర!
Nindu Noorella Saavasam November 28th Episode: అరుంధతి మాంత్రికుడు నుంచి త్రుటిలో తప్పించుకోవటంతో కధ మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది.
Nindu Noorella Saavasam November 27th Episode: అడ్డంగా దొరికిపోయాను, పొద్దున్న ఎక్కడ తిట్లు ఆపారో మళ్ళీ అక్కడ నుంచి మొదలు పెడతారేమో అని భయపడుతుంది.
మిస్సమ్మ : చిన్న పని ఉండి బయటకు వెళ్లాను లేట్ అయిపోయింది.
అమరేంద్ర: నువ్వు నా పిల్లల బాధ్యత చూస్తున్నావు.. నీ బాధ్యత చూడవలసిన అవసరం నాకు ఉంది నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు.
ఇదే మంచి సమయం అనుకొని నాకు ఒక ఫేవర్ కావాలి అని అడుగుతుంది మిస్సమ్మ.
అమరేంద్ర: ఏంటో చెప్పు.
మిస్సమ్మ తన తండ్రి గురించి చెబుదాం అనుకునే సమయానికి రాథోడ్ వచ్చి మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైల్ లో ఉంది అని చెప్తాడు.
అమరేంద్ర: నేను క్రాస్ చెక్ చేస్తాను ఫైల్ టేబుల్ మీద పెట్టు.
రాథోడ్ : అలాగే సార్ అంటూ శ్రీకాంత్ సార్ ఆయన రికమండేషన్ గురించి మీకు ఒకసారి గుర్తు చేయమన్నారు.
అమరేంద్ర కోపంగా నాకు ఇలాంటివి నచ్చవని తెలుసు కదా, చేయనన్నానని చెప్పు.
రాథోడ్: అలాగే సార్ అని చెప్తూ మిస్సమ్మ ఏంటి ఈ సమయంలో ఎక్కడ ఉంది అంటాడు.
అమరేంద్ర: తనకి ఏదో ఫేవరెర్ కావాలంట అంటూ ఏం కావాలి అని మిస్సమ్మని అడుగుతాడు.
రికమండేషన్ అంటే తనని కూడా తిడతారేమో అనుకొని ఏం లేదు, మీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పిచ్చి హాస్పిటల్ నుంచి తప్పించుకుని మన ఇంటికి వచ్చినట్లుగా ఉంది అనుకుంటూ అమరేంద్ర కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రాథోడ్: మిస్సమ్మ ఎందుకు కంగారుపడుతుంది అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్లి నువ్వు ఏం చెప్పాలనుకున్నావో ఏం అడిగావు అని అడుగుతాడు.
మిస్సమ్మ: మా నాన్నగారి గురించి ఫైల్ మీద సంతకం పెట్టమని అడుగుదామనుకున్నాను.
రాథోడ్: అడిగి ఉంటే తిట్లు తినేదానివి రేపు అంజుకి అడ్మిషన్ వచ్చాక అడిగితే ఆ ఆనందంలో సంతకం పెట్టేస్తారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాథోడ్.
అందరూ పడుకున్న తర్వాత మాంత్రికుడు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఆ శబ్దానికి చిత్రగుప్తుడు లేస్తాడు కానీ ఎవరూ కనిపించకపోవడంతో మళ్లీ పడుకుండిపోతాడు. చిత్రగుప్తుడికి కనిపించకుండా ఆత్మని వాసన చూస్తూ నేరుగా పిల్లలు పడుకునే గదిలోకి వెళ్తాడు అక్కడ ఉన్న అరుంధతి ఆత్మని తన గాజు సీసాలో బంధించాలి అనుకుంటాడు. సరిగ్గా అదే సమయానికి అంజు నిద్ర లేస్తుంది. మాంత్రికుడుని చూసి దయ్యం అని భయపడుతూ గట్టిగా కేకలు వేస్తుంది.
మాంత్రికుడు: అరవకండి నాకు కావలసింది నేను తీసుకొని వెళ్ళిపోతాను అంటాడు.
అయితే మాంత్రికుడు వేషధారణ చూసి భయపడిన పిల్లలతో పాటు అరుంధతి కూడా అరుస్తుంది. ఆ అరుపులకి ఇంట్లో వాళ్ళందరూ పిల్లల గదిలోకి వస్తారు. అప్పటికే మాంత్రికుడు అక్కడి నుంచి తప్పించుకుంటాడు.
అమరేంద్ర: తనని అల్లుకుపోయి భయపడుతున్న పిల్లలతో ఏమైంది ఎందుకు అలా భయపడుతున్నారు.
పిల్లలు: ఒక వ్యక్తి వచ్చాడు చూడటానికి చాలా భయంకరంగా ఉన్నాడు అంటూ ఆనవాళ్లు చెప్తారు.
మనోహరి: అయితే పొద్దున్న వచ్చిన వ్యక్తి అయి ఉంటాడు.
అమరేంద్ర: ఎవరు వచ్చారు.
అమరేంద్ర తల్లిదండ్రులు: మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చాడు ఈ ఇంట్లో ఆత్మ ఉంది పట్టుకోవాలి అంటున్నాడు.
రాథోడ్: మేము వాడిని తన్ని తరిమేసాము, కానీ మళ్ళీ రూమ్ లోకి ఎలా వచ్చాడో అర్థం కావడం లేదు.
పిల్లల్ని పడుకోమని చెప్తుంది మిస్సమ్మ. తండ్రి దగ్గరే పడుకుంటాము అంటారు పిల్లలు.
మనోహరి అమర్ ని ఇబ్బంది పెట్టవద్దు నేను మీ దగ్గర పడుకుంటాను అంటుంది.
అమరేంద్ర: ఇప్పుడు వాళ్లకి నేను ఉన్నాను అని ఒక ధైర్యం కావాలి నేను వాళ్ళ దగ్గర పడుకుంటాను. అయినా వాడు ఇంట్లోకి ఎలా వచ్చాడు. ఇలాంటి సెక్యూరిటీతో నా నేను ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను. నాకు రేపు టైట్ సెక్యూరిటీ కావాలి అని రాథోడ్ తో చెప్తాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: ‘జై బాబు’ అంటూ స్పీచ్‌ను ప్రారంభించిన రణబీర్, ‘పోకిరి’ డైలాగ్‌తో అదరగొట్టేశాడు
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply