Nindu Noorella Saavasam 24th: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: అరుంధతిని తలుచుకొని అంజు పాప కన్నీళ్లు, తాళిబొట్టుని చూసేసిన నీల!
Nindu Noorella Saavasam Today Episode: భాగమతి పిన్నికి భాగమతి అరుంధతి ఇంట్లో పని చేస్తుందని తెలియటంతో కథ కొత్త మలుపు తిరుగుతుంది.
Nindu Noorella Saavasam 24th: ఈరోజు ఎపిసోడ్ లో మాంత్రికుడిని బయటికి పంపించేసిన తర్వాత ఎవరికి ఎలాంటి అనుమానం రాలేదు అని రిలాక్స్ ఫీల్ అవుతాడు చిత్రగుప్తుడు. మనోహరి మాత్రం ఆలోచనలో పడుతుంది.
నీల: ఏం ఆలోచిస్తున్నారు అమ్మ.
మనోహరి : ఈ ఇంట్లో నిజంగా ఆత్మ ఉందంటావా?
నీల : ఊరుకోండి అమ్మగారు, వాడేదో డబ్బులు కోసం
అరుస్తున్నాడు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత అలాంటి వాళ్ళని లోపలికి రానిచ్చినందుకు సెక్యూరిటీని తిట్టుకుంటూ అంజు చదువుతుందో లేదో అని రూమ్ దగ్గరికి వస్తుంది మిస్సమ్మ. తలుపు వేసి ఉండటం చూసి డోర్ ఓపెన్ చేయమంటుంది. డోర్ ఓపెన్ చేసిన అంజుతో..
మిస్సమ్మ : డోర్ క్లోజ్ చేసి ఆడుకుంటున్నా?
అంజు: లేదు, చదువుకుంటున్నాను.
మిస్సమ్మ: మరి డోర్ ఎందుకు క్లోజ్ చేసావ్.
అంజు: నాకు పిడుగులు అంటే భయం ఎప్పుడూ పురుగులు పడినా అమ్మ ఇలాగే డోర్ క్లోజ్ చేసి అమ్మ నీ పక్కనే ఉంది భయపడొద్దు అంటూ ఓదార్చేది అంటూ ఎమోషనల్ అవుతుంది.
మిస్సమ్మ : ఇప్పుడు నీకు భయం వేస్తుందా?
అంజు : లేదు అమ్మకి భయం వేసినట్లుగా అనిపించింది అంటూ కన్నీరు పెట్టుకుంటుంది.
మిస్సమ్మ : నీ పక్కన మిస్సమ్మ ఉంది నువ్వేమీ భయపడకు అంటూ అంజూని హగ్ చేసుకుంటుంది.
ఇద్దరూ ఎమోషనల్ అవుతారు. ఇదంతా చూస్తున్న అరుంధతి నా బాధ నీ మనసుకి అర్థమవుతుందా అంటూ తను కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. మరోవైపు అరుంధతి ఇల్లు వెతుక్కుంటూ మంగళ, కాళీ భాగమతి పనిచేస్తున్న ఇంటికి వస్తారు. ఆ ఇల్లు భాగమతి పనిచేస్తున్న ఇల్లు అని తెలుసుకొని ఇద్దరూ షాక్ అవుతారు.
మంగళ : ఆమె పనిచేస్తున్న ఇల్లు ఇది అన్నీ తెలుసుకొని ఇక్కడికి వచ్చిందా అని కాళీతో అంటుంది.
ఇంతలో వాళ్ళని చూసిన మిస్సమ్మ కంగారుపడుతూ బయటికి వస్తుంది. బయటికి వచ్చి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది.
మంగళ: ఈ ఇంట్లో మిలిటరీ ఆయన భార్య చనిపోయింది అంట కదా ఆవిడ నీకు తెలుసా?
మిస్సమ్మ : నాకెలా తెలుస్తుంది.
మంగళ : మరి నువ్వు ఎందుకు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నావు?
మిస్సమ్మ : నాన్నకి ట్రీట్మెంట్ కావాలంటే మిలిటరీ అండ్ సంతకం ఉండాలి అన్నారు కదా అందుకే.
మంగళ: అంతేనా, నీకు ఇంకేమీ తెలియదా?
మిస్సమ్మ ఇంకేమీ తెలియదు అని చెప్పటంతో అక్క, తమ్ముడు అక్కడినుంచి వెళ్ళిపోతారు. మిస్సమ్మ వెనక్కి తిరిగేసరికి అక్కడ మనోహరి ఉంటుంది.
మనోహరి: ఎవరు వాళ్ళు?
మిస్సమ్మ: ఎవరు అడ్రస్ అడిగితే చెప్పి పంపించేసాను.
మనోహరి మేడం కి ఫోన్ చేసి అక్కడికి వెళ్లిన వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరే అని నిర్ధారించుకుంటుంది. వాళ్లకి అరుంధతికి, వాళ్లకి భాగమతికి ఉన్న సంబంధం ఏమిటో అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది.
మరోవైపు పిల్లలు ముగ్గురు వాచ్మెన్ తాతయ్యని తమతో పాటు లంచ్ చేయడానికి ఒప్పించి తీసుకువస్తారు. తమ తీసుకువచ్చిన లంచ్ అతనితో తినిపించి మిస్సమ్మ గురించి చెప్తూ ఉంటారు.
వాచ్ మెన్ : మీరు మీ మిస్సమ్మ గురించి చెప్తున్నట్లుగా లేదు మా అమ్మాయి గురించి చెప్పినట్లుగా ఉంది తను కూడా ఇలాగే నాకు క్యారియర్ కట్టి పంపించేది.
పిల్లలు: అయితే మీరు మా మిస్సమ్మతో మాట్లాడండి అని చెప్పి వినిపించుకోకుండా మిస్సమ్మకి ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసిన మిస్ అమ్మతో వాచ్మెన్ తాతయ్య మాట్లాడతారు అని చెప్తుంది అను. కానీ అతను బాగా దగ్గుతూ ఉండటంతో తన తండ్రి ఏమో అని అనుమాన పడుతుంది. తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అదే విషయాన్ని పిల్లలు వాచ్మెన్ తో చెప్తారు.
వాచ్మెన్ : అయ్యో, మా అమ్మాయి ఏది కూడా అన్ని నీ అలవాట్లే అని చేద్దాం అనుకున్నాను పోనీలే తర్వాత మాట్లాడతాను అనటంతో అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు చిరాకు పడుతూ ఇల్లు తుడుస్తున్న నీల చీపురు తగిలి మిస్సమ్మ బ్యాగ్ కిందన పడుతుంది. అందులోంచి జారిన తాళిబొట్టుని చూసి షాక్ అవుతుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply