Nindu Noorella Saavasam 23rd : అమర్ చెప్పింది విని షాకైన రాథోడ్.. మాంత్రికుడి బారి నుంచి అరుంధతి తప్పించుకోగలుగుతుందా?
Nindu Noorella Saavasam Today Episode : అమరేంద్ర అరుంధతి యాక్సిడెంట్ మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడంతో కథ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.
Nindu Noorella Saavasam 23rd Episode : ఈరోజు ఎపిసోడ్ లో మాంత్రికుడిని బయటికి పంపించేసి ఈ బాలిక ఎక్కడ ఉందో ఏమో ఈ మాంత్రికుడు కంటపడిందంటే ఆమెకి చాలా ప్రమాదం. అమావాస్య వరకు నేను కూడా ఆమెకి ఎలాంటి సహాయం చేయలేను అని మనసులో అనుకుంటాడు చిత్రగుప్తుడు.
చిత్రగుప్తుడు: బాలికా..నీవు ఎక్కడ ఉన్నా నా మాటలు నీకు వినిపిస్తున్నట్లయితే జాగ్రత్తగా విను, ఆ మాంత్రికుడు కంటపడకుండా జాగ్రత్తపడు అనుకుంటూ లోపలికి వస్తాడు.
అతనికి ఎదురు వచ్చిన మనోహరి అతను ఎవరు అని చిత్రగుప్తుడిని అడుగుతుంది.
చిత్రగుప్తుడు: అతను ఎవరో నాకు ఎలా తెలుస్తుంది.
మనోహరి: అతను నీకు బాగా తెలిసిన వ్యక్తి లాగా అనిపించాడు అంటూ అనుమానంగా చూస్తూ చిత్రగుప్తుడిని హెచ్చరించి లోపలికి వెళ్ళిపోతుంది.
చిత్రగుప్తుడు: మనోహరి వైపు కోపంగా చూస్తూ నీ పాపం పండే రోజు దగ్గరికి వచ్చింది. నువ్వు దాచినవి, చేసినవి అన్నీ బయటపడే రోజులు దగ్గరపడ్డాయి. నీ పతనం మొదలైంది అనుకుంటాడు.
మరోవైపు తలనొప్పి నుంచి తేరుకున్న మిస్సమ్మ అంజు చదువుతుందో లేదో అనుకుంటూ కంగారుగా ఆమె రూమ్ కి వెళ్తుంది. అప్పటివరకు చదివిన అంజు అప్పుడే హెడేక్ గా ఉంది అని పడుకుంటుంది. అది చూసిన మిస్సమ్మ కోపంతో అరుస్తుంది.
అంజు: ఇప్పటివరకు చదివాను మిస్సమ్మ, ఇప్పుడే హెడేక్ గా ఉందని పడుకున్నాను.
మిస్సమ్మ: నేను లేకపోయినా నువ్వు చదువుతావని నిన్ను నమ్మాను, అయినా నువ్వు చదవటం లేదు. మీ అమ్మ అంటే ఇష్టం ఉంటే చదువుతాను అన్నావు కదా.
అంజు: కోపంగా నీకు నేను చదవటమే కదా కావాల్సింది, చదువుతాను అంతేకానీ అమ్మని ఏమీ అనకు అంటూ కోపంగా చదువుకుంటుంది.
మిస్సమ్మ : నన్ను క్షమించు అంజు, నువ్వు బాగా చదివి ఆ స్కూల్లో అడ్మిషన్ సంపాదిస్తేనే మీ అక్క వాళ్ళతో పాటు ఆ స్కూల్లో చదవగలవు. అప్పుడు నేను మీ డాడీని సంతకం చేయమని అడగగలను. ఇదంతా జరగాలంటే నువ్వు ఆ స్కూల్లో అడ్మిషన్ సంపాదించాలి అని మనసులో బాధపడుతుంది.
మరోవైపు అరుంధతి యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ రాథోడ్ కి ఫోన్ చేస్తాడు అమర్.
అమర్: మా యానివర్సరీకి మూడు రోజులు ముందు నుంచి కొడైకెనాల్ కి ట్రావెల్ చేసిన అందరి డీటెయిల్స్ సంపాదించి అందులో క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ళ ఫోటోలు నాకు సెండ్ చెయ్యు.
రాథోడ్: అలాగే సార్, కానీ ఇదంతా ఎందుకు.
అమర్: యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు ఎవరో కావాలనే చేశారు.
రాథోడ్: షాక్ అవుతూ మేడంని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, అయినా డీటెయిల్స్ అన్ని ఇప్పుడే కనుక్కుంటాను అని బయలుదేరుతాడు.
మరోవైపు తన భర్త తనని గుర్తించలేదని కోప్పడుతూ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది అరుంధతి. మళ్లీ తనలో తానే నువ్వు ఆత్మవి కదా ఎవరికీ కనిపించవు కదా అనుకుంటూ మాంత్రికుడు ముందు నుంచే వెళ్తుంది. అది గమనించిన మాంత్రికుడు ఆమె వెనకే వస్తాడు. అరుంధతి ఆమె ఇంటి లోపలికి వెళ్లే సమయానికి ఆమెని అడ్డగించి ఏవో మంత్రాలు జపిస్తూ ఉంటాడు.
అరుంధతి: పై లోకంలో ఉన్న రాక్షసుల కంటే ఈ లోకంలో ఉన్న మాంత్రికుల వల్లే నీకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది అన్న చిత్రగుప్తుడి మాటలు గుర్తుకు వచ్చి భయపడుతూ అక్కడ నుంచి తన ఇంటిలోకి పరిగెట్టుకుంటూ వెళ్లిపోయి అంజలి గదిలో దాక్కుంటుంది.
గదిలో చదువుకుంటున్న అంజలి ఏదో ఫీల్ అయ్యి తలుపు గడియ వేసేస్తుంది. అది చూసిన అరుంధతి అమ్మ నీకు కనిపించిందా, అమ్మ భయపడుతుందని డోర్ క్లోజ్ చేశావా అంటూ బాగా ఎమోషనల్ అవుతుంది.
మాంత్రికుడు ఇంట్లోకి రావడం గమనించిన చిత్రగుప్తుడు వీడు పరిగెడుతున్నాడు అంటే బాలిక అతని ముందు ఉన్నట్లుంది అనుకుంటూ మాంత్రికుడిని అడ్డగిస్తాడు. మాంత్రికుడు చిత్రగుప్తుడని పక్కకి నెట్టేసి ఇంట్లో అడుగు పెట్టబోతాడు.
మిస్సమ్మ : అతడిని అడ్డుకొని బయటికి నెట్టేసి ఏంటి అలా లోపలికి వచ్చేస్తున్నావు అని నిలదీస్తుంది.
మాంత్రికుడు ఆమెని తప్పించుకుని ఇంట్లోకి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు. ఏంటి అలా ఇంట్లోకి వచ్చేస్తున్నావ్ అని అందరూ అడుగుతారు.
మాంత్రికుడు : నాకు ఆత్మ కావాలి. ఇంట్లో ఆత్మ ఉంది లోకాధిపతిని కావాలంటే నాకు ఆ ఆత్మ కావాలి.
మిస్సమ్మ: ఈ ఇంట్లో ఆత్మ ఉండటం ఏమిటి
రాథోడ్: వీళ్ళు ఇలాగే ఆత్మ ఉందని చెప్తారు తర్వాత ఆత్మను బయటికి పంపిస్తాను అంటూ డబ్బులు వసూలు చేస్తారు అంటూ కోపంగా మాంత్రికుడుని బయటికి నెట్టేస్తాడు. బయట ఉన్న చిత్రగుప్తుడు కూడా రాథోడ్ కి తోడుగా వెళ్లి ఇద్దరూ కలిపి మాంత్రికుడుని బయటికి నెట్టేస్తారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.