అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial January 6th: మనోహరిని హెచ్చరించిన ఘోర - సడన్ గా ఇంటికి వచ్చిన పోలీసులు

Nindu Noorella Saavasam Serial Today Episode: ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులు అమర్ ఇంటికి రావడంతో అసలు వాళ్ళు ఎందుకు ఇంటికి వచ్చారు అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది.

Nindu Noorella Saavasam Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కారెక్కి వెళ్ళిపోతున్న ఆత్మని చూసి బంధించలేకపోతున్నందుకు కోపంతో రగిలిపోతాడు ఘోర. అదే సమయంలో మిస్సమ్మ తండ్రిని గుర్తు చేసుకుని బాధపడుతుంది.

మరోవైపు నీలని ఆటపట్టించడం కోసం ఆత్మతో మాట్లాడుతున్నట్లు నటిస్తాడు చిత్రగుప్తుడు.

నీల: ఇదేమిటి ఆత్మతో మాట్లాడుతున్నారు ఆత్మ స్కూల్లో కదా ఉంది ఈయన ఎవరితో మాట్లాడుతున్నారు అర్జెంటుగా ఈ విషయం అమ్మగారికి చెప్పాలి అనుకొని లోపలికి వెళుతుంది.

అదే సమయంలో ఘోర మనోహరికి కి ఫోన్ చేస్తాడు.

ఘోర : మనోహరికి ఫోన్ చేసి నేను మాట్లాడింది మీరు వినండి మీరు ఏమి మాట్లాడకండి అని హెచ్చరిస్తాడు.

మనోహరి: ఎందుకు అని అనుమానంగా అడుగుతుంది.

ఘోర: ఎందుకంటే నిజం తెలిసిపోతుంది కాబట్టి అంటాడు.

మనోహరి : అరుంధతి తన పక్కనే ఉందని అర్థం చేసుకుంటుంది భయంతో షాకయ్యి కారు సడన్ బ్రేక్ వేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం అని అరుంధతికి వినిపించకుండా అడుగుతుంది.

ఘోర: మీ వెనుక ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళు ఉండగా నేను ఆమెను ఏమీ చేయలేను మీరు ఇంటికి వెళ్లిపోండి అని చెప్తాడు. భయంగా కారు డ్రైవ్ చేస్తుంది మనోహరి.

నీల : ఇంతలో నీల ఫోన్ చేసి ఆత్మ ఇక్కడే ఉంది అమ్మగారు గుప్తా మాట్లాడటం నేను చూశాను అంటుంది.

ఘోర ఆత్మ నా పక్కన ఉంది అంటున్నాడు నీల అక్కడ ఉంది అంటుంది అంటూ కన్ఫ్యూజ్ అవుతుంది మనోహరి.

మనోహరి : అరుంధతి తన పక్కన ఉందో లేదో తెలుసుకోవడం కోసం పిల్లల్ని తిడుతుంది. పిల్లల్ని తిడుతున్నందుకు కోప్పడుతుంది అరుంధతి. ఆ వైబ్రేషన్ మనోహరి కి తెలుస్తుంది. అరుంధతి నా పక్కనే ఉంది అనుకోని మరింత కంగారుగా, ఫాస్ట్ గా కారు నడుపుతుంది.

మరోవైపు సరదాగా మాట్లాడుకుంటున్న చిత్రగుప్తుడు నీల దగ్గరికి వచ్చిన రాథోడ్ మీ ఇద్దరినీ ఇలా చూస్తుంటే ఒంటినిండా తేళ్లు జెర్రులు పాకినట్లుగా ఉంది మీ పత్తి వ్యాపారాలు చూడలేకపోతున్నాను అయినా మీ ఇద్దరికీ ఇదేం పని. నీల నీకు ఈమధ్య బద్ధకం ఎక్కువైంది లోపలికి వెళ్లి పని చూడు అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది నీల. 

ఇంతలో అమర్ వాళ్ళు రావడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ అలర్ట్ అవుతారు.

మనోహరి: చిత్రగుప్తుడి వైపు అనుమానంగా చూస్తూ వెళుతుంది భాగమతికి అరుంధతి చెల్లెలు కాబట్టి కనిపిస్తుంది ఇతనికి ఎందుకు కనిపిస్తుంది అని అనుమాన పడుతుంది. చిత్రగుప్తుడు దగ్గరికి వెళ్లి నీ పేరేంటి అని అడుగుతుంది. కానీ సమాధానాలు నీల చెప్పడంతో నీలమీద కోప్పడిన మనోహరి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది

అరుంధతి: గుప్తా గారు ఎందుకు మనోహరీ మిమ్మల్ని అలా అడుగుతుంది అని అడుగుతుంది.

చిత్రగుప్తుడు : ఆవిడకి అనుమానం వచ్చింది. నేను నీకు చెప్పాను కదా ముందు ముందు నీకు చాలా గండాలు ఉన్నాయి నా మాట విని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంటాడు. అయినా అరుంధతి పట్టించుకోకపోవడంతో అయితే నా అంగుళీకము నాకు ఇచ్చివేయము అంటాడు.

అరుంధతి నా దగ్గర లేదు అని చెప్తుంది.

చిత్రగుప్తుడు : అదే విషయం మీ పిల్ల పిచ్చుకల మీద ఒట్టేసి చెప్పు అంటాడు.

అరుంధతి: పిల్లల మీద ఎవరైనా ఒట్టు వేయమంటారా అని అక్కడి నుంచి పరిగెట్టి పారిపోతుంది.

చిత్రగుప్తుడు: బ్రతిమిలాడి అడిగినా ఇవ్వటం లేదు కోప్పడినా అంగుళీకం ఇవ్వడం లేదు ఇలా నా బ్రతుకంతా ఈ లోకంలో గడిచి పోవాల్సిందేనా అనుకొని బాధపడతాడు.

మరోవైపు అరుంధతిని ఎలాగైనా వదిలించుకోవాలనుకుంటున్న మనోహరికి అరుంధతిని చంపిన హంతకుడు ఫోన్ చేస్తాడు. సిటీ దాటి వెళ్ళిపోతాను ఇంకొంచెం అమౌంట్ కావాలి అంటాడు.

మనోహరి: మొన్నే కదా ఇచ్చాను ఇప్పుడు నా దగ్గర లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది.

అదేంటి అలా ఫోన్ పెట్టేసింది ఇప్పుడు ఏం చేస్తాం అని హంతకుడి ఫ్రెండ్ అడిగితే ఆవిడకి కొంచెం భయం తగ్గినట్లుగా ఉంది ఈ రాత్రికే భయాన్ని పరిచయం చేస్తాను అంటాడు హంతకుడు.

మరొకవైపు ఇంటికి పోలీసులు రావడానికి చూసి షాక్ అవుతుంది అరుంధతి. వీళ్ళు ఎందుకు ఇంటికి వచ్చారు అనుకుంటుంది. పోలీసులు నేరుగా వెళ్లి అమర్ ని విష్ చేస్తారు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Also Read: అమ్మాయిని అలా టచ్ చేస్తావా? ధనుష్ మూవీ ఈవెంట్‌లో ఆకతాయిని చితకబాదిన యాంకర్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vikatakavi Web Series: 'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
'వికటకవి' టైటిల్ ఎందుకు... సిరీస్‌లో ఏం చేశారు? ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన దర్శకుడు ప్రదీప్ మద్దాలి
Embed widget