అన్వేషించండి

Nindu Noorella Saavasam Serial January 25th - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మిస్సమ్మపై కాళీ అత్యాచారయత్నం.. అరుంధతిని బంధించిన ఘోర!

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మని కాళీ నుంచి కాపాడిన అమర్ ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనే ఉత్కంఠత కథలో ఏర్పడుతుంది. 

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మని వెయిటర్ వెంబడించడం చూస్తుంది అరుంధతి. ఎందుకు మిస్సమ్మని వెంబడిస్తున్నాడు అనుకుంటూ వాళ్లని ఫాలో అవుతుంది. రూమ్ లోకి వెళ్లిన మిస్సమ్మ డోర్ వేసుకోబోతే కాలు అడ్డుపెట్టి మరీ గదిలోకి వెళ్లిన కాళీ మిస్సమ్మ ని బలాత్కరించబోతాడు.

మరోవైపు అంజు వచ్చి తండ్రిని మిస్సమ్మ ని చూసారా అని అడుగుతుంది. ఇంతలో అంజు అన్న వచ్చి  మిస్సమ్మ పై రూమ్ కి వెళ్ళటం నేను చూశానని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు డాడీని అడుగుతున్నావు అని అంటాడు.

అంజు : నువ్వు చార్జర్ కోసమే అబద్ధం చెప్తున్నావు కదా నేను నమ్మను అంటుంది.

అమర్: మిస్సమ్మ గదిలోకి ఎవరో వెళ్ళటానికి ప్రయత్నించటం గుర్తుకు వస్తుంది. వెంటనే ఏ గదిలోకి వెళ్ళింది అని కొడుకుని అడుగుతాడు. కొడుకు పై గది అని చెప్పడంతో నేను చూస్తాను మీరు వెళ్లి ఆడుకోండి అని చెప్తాడు.

అప్పటికే కాళీ తో పెనుగులాడుతూ ఉంటుంది మిస్సమ్మ. అరుంధతి పైనుంచి కేకలు వేస్తుంది కానీ ఆమె మాటలు ఎవరూ వినిపించుకోరు.

మిస్సమ్మని వెతుకుతూ వచ్చిన అమర్ కి కేకలు వినిపిస్తాయి. వెంటనే గది తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్తాడు. వెంటనే ఖాళీ అక్కడనుంచి పారిపోతాడు. అమర్ పట్టుకోవాలనుకుంటాడు కానీ మిస్సమ్మ భయంతో అమర్ ని హత్తుకుపోతుంది. మిస్సమ్మని  సేవ్ చేసినందుకు అరుంధతి కూడా సంతోషిస్తుంది. 

అరుంధతి వెనక్కి తిరిగేసరికి ఘోర ఉంటాడు. ఆమెపై విభూది జల్లి గాజు సీసాలో బంధించేస్తాడు. ఆ విషయం మనోహరికి చెప్తాడు.

మనోహరి : ఆనంద పడిపోతుంది. నాకు భర్త కావలసిన వాడిని నువ్వు చేసుకొని నా జీవితాన్ని లాక్కున్నావు ఇప్పుడు అమర్ నా వాడు కాబోతున్నాడు అని అనుకుంటుంది.

ఘోర గాజు సీసాలో ఉన్న అరుంధతిని తనతో పాటు తీసుకు వెళ్లిపోతుంటే ఆడుకుంటూ వచ్చిన అంజు ఘోరని గుద్దేస్తుంది. వెంటనే ఘోర చేతిలో ఉన్న గాజు సీసా జారిపోయి అరుంధతి బయటికి వచ్చేసి అక్కడ నుంచి పారిపోతుంది.

ఆ తర్వాత పిల్లల్ని స్కూల్ లో డ్రాప్ చేస్తాడు అమర్.

అమర్ : చూడు అమ్ము ఎలక్షన్ రిజల్ట్స్ ఎలా వచ్చినా కూడా పాజిటివ్ గా తీసుకో. గెలిస్తే ఆనందమే ఓడిపోయినా పర్వాలేదు అనుభవం వస్తుంది ఆ అనుభవం నెక్స్ట్ టైం ఎలక్షన్స్ కి పని చేస్తుంది అని చెప్పి కూతురికి ధైర్యం చెప్తాడు. అలాగే ఎలక్షన్స్ లో పడి చదువుని నెగ్లెట్ చేయొద్దు అని కూడా చెప్తాడు.

అమ్ము తండ్రి పాదాల దగ్గర ఆశీర్వచనం తీసుకుంటుంది.

అమర్: ఎమోషనల్ అవుతాడు. ఇలాంటి సందర్భాలలో ఎప్పుడూ అరుంధతి నా పక్కన ఉండేది ఇప్పుడు నేను ఒంటరిగా దీవించవలసి వస్తుంది అని కన్నీరు పెట్టుకుంటాడు.

అది గమనించిన అరుంధతి నేను మీ పక్కనే ఉన్నానండి  అని చెప్పి భర్త పక్కన వెళ్లి నిల్చుంటుంది.

అమ్ము : తండ్రికి నమస్కరించిన తర్వాత పక్కనే ఖాళీ ప్లేస్ కి కూడా నమస్కరిస్తుంది. అక్కడ ఎందుకు నమస్కరించావు అక్కడ ఎవరూ లేరు కదా అని అడుగుతాడు తండ్రి.

అమ్ము : అక్కడ అమ్మ ఉండేది కదా నాన్న ఇప్పుడు కూడా అమ్మ అక్కడ ఉన్నట్లు అనిపించింది అందుకే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అంటుంది.

ఒక్కసారిగా అందరూ ఎమోషన్ అవుతారు అరుంధతి కూడా ఆనందం పట్టలేక కన్నీరు పెట్టుకుంటుంది. తర్వాత పిల్లలు స్కూల్లోకి వెళ్తే అక్కడ రామ్మూర్తి నువ్వు ఎలక్షన్స్ లో గెలవాలని పూజ చేయించాను అని చెప్పి అమ్ముకి బొట్టు పెడతాడు. అతని అభిమానానికి అరుంధతి ఆనందపడుతుంది. ఇంతలో ఆనంద్, ఆకాష్ పరిగెత్తుకుంటూ వస్తారు.

ఆనంద్: అక్కడ మనం అనుకున్నట్లు ఏమీ జరగటం లేదు అందరూ ఆ బంటి గాడికి సపోర్ట్ గా ఉన్నారు. స్కూల్ కి  ముందుగా వచ్చి అందరిని కలిసి మాట్లాడాడంట అని చెప్తాడు. అందరూ డిప్రెస్ అయిపోతారు కానీ అంజు ఆలోచనలో పడుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prisoners in Telangana: 213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
213 మంది ఖైదీల‌కు తెలంగాణ ప్రభుత్వం క్ష‌మాభిక్ష‌, బుధవారం విడుదలకు జీవో
Kasthuri Shankar: ‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
‘భారతీయుడు 2’పై అంచనాలు మంచిది కాదనిపిస్తోంది, తాగుతూ కూర్చుంటే అవ్వదు - కస్తూరి శంకర్
Hyderabad Rains Alert: హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం, అర్ధరాత్రి వరకు మోస్తరుగా కురిసే ఛాన్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
Embed widget