Nindu Noorella Saavasam Serial January 16th - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: పిల్లల ప్రవర్తన చూసి షాకైన మిస్సమ్మ, డబ్బు దొంగిలించే ప్రయత్నంలో మనోహరి!
Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ అమర్ తల్లికి ఇచ్చిన డబ్బుని మనోహరి కొట్టేసే ప్రయత్నం చేయటంతో కథలో తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠత ఏర్పడుతుంది.
![Nindu Noorella Saavasam Serial January 16th - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: పిల్లల ప్రవర్తన చూసి షాకైన మిస్సమ్మ, డబ్బు దొంగిలించే ప్రయత్నంలో మనోహరి! Nindu Noorella Saavasam telugu serial January 16th episode written update Nindu Noorella Saavasam Serial January 16th - 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: పిల్లల ప్రవర్తన చూసి షాకైన మిస్సమ్మ, డబ్బు దొంగిలించే ప్రయత్నంలో మనోహరి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/16/699c2393db5c6b2bf12f99567fc533891705381921873891_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో వాళ్ల మనసులో ఎలాంటి ఆలోచన ఉన్న నా మనసులో మాత్రం మంచి ఆలోచన వచ్చింది అంటుంది మిస్సమ్మ.
నీల: ఏం చేయబోతున్నారు అంటుంది. చూస్తూ ఉండు అంటుంది మనోహరి.
ఆ తర్వాత డబ్బు తీసుకొని అమర్ తల్లికి ఇవ్వబోతుంది మిస్సమ్మ. ఆమె బాగా ఎమోషనల్ అవుతుంది.
మిస్సమ్మ : కంగారుగా ఏం జరిగింది అని అడుగుతుంది.
అమర్ తల్లి: ప్రతి సంవత్సరం మా ఆయన ఈ డబ్బులు తీసుకొని వచ్చి మా కోడలికి ఇచ్చేవారు. ఈ ఇంటికి కళ మా కోడలితోనే వచ్చింది మా కోడలితోనే వెళ్లిపోయింది అని కన్నీరు పెట్టుకుంటుంది.
మిస్సమ్మ : భార్యని మరిచిపోలేని భర్త, తల్లి కోసం తపన పడుతున్న పిల్లలు, కోడల్ని పొగుడుతున్న అత్తమామలు. నిజంగా మీలాంటి మంచి మనుషుల ప్రేమకి దూరమైన ఆమె నిజంగా దురదృష్టవంతురాలు అంటుంది.
అమర్ తల్లి : నిజంగా మళ్లీ జన్మంటూ ఉంటే ఆమెకి తల్లి లేని లోటు తీర్చాలని ఉంది అంటూ ఎమోషనల్ అవుతుంది.
ఈ మాటలన్ని అరుంధతి కూడా వింటుంది ఆమె కూడా ఎమోషనల్ అవుతుంది.
మిస్సమ్మ: నేను మీ కోడలు ఫోటో చూడవచ్చా అని అడుగుతుంది.
అమర్ తల్లి: అదేంటి ఇప్పటివరకు నువ్వు మా కోడల్ని చూడలేదా అమర్ దగ్గర ఉంటుంది వెళ్లి చూడు అంటుంది.
మిస్సమ్మ: ఆయన దగ్గరికి వెళ్తే 100 ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానం చెప్పమంటారు చెప్పకపోతే పెద్ద క్లాసు తీసుకుంటారు వద్దులేండి ఆంటీ మీ దగ్గర ఉంటే చూపించండి అంటుంది.
ఎక్కడ తన ఫోటో మిస్సమ్మ చూసేస్తుందో అని కంగారుపడుతుంది అరుంధతి.
అమర్ తల్లి : సరే చూపిస్తాను అని కబోర్డ్స్ లో నెలుకుతుంది. ఎక్కడా దొరకకపోవటంతో ఇక్కడే ఉండాలమ్మా కనిపించడం లేదు. తర్వాత వెతికిస్తాను అంటుంది.
మిస్సమ్మ సరే అని చెప్పి డబ్బుని ఆమె చేతికి ఇస్తుంది. అమర్ తల్లి డబ్బుని కబోర్డ్ లో పెట్టి ఆ కీస్ తలకడ కింద పెడుతుంది.
మిస్సమ్మ : అదేంటండీ అంత డబ్బు బీరువాలో పెట్టి ఆ తాళాలు తలగడ కింద పెడుతున్నారు వేరే ఎక్కడైనా దాయండి అంటుంది.
అమర్ తల్లి: ఈ ఇంట్లో ఎక్కడ పెట్టిన వస్తువులు అక్కడే ఉంటాయి అయినా అలాంటి భయం ఈ ఇంట్లో లేదు అంటుంది.
తన ఫోటో మిస్సమ్మ చూడలేదని రిలాక్స్ ఫీల్ అవుతుంది అరుంధతి.
మిస్సమ్మ అక్కడ నుంచి నేరుగా పిల్లల దగ్గరికి వచ్చేసరికి అక్కడ అరుంధతి ఉంటుంది.
మిస్సమ్మ : హాయ్ అండి అని అరుంధతిని పలకరిస్తుంది.
అంజు: ఏంటి నాకు హాయ్ చెప్తుంది పైగా అండి అంటుంది అనుకుంటుంది.
మిస్సమ్మ: నేను లేకపోతే మీరు హోంవర్క్ చేయకుండా ఎక్కడ అల్లరి చేస్తారో అనుకున్నాను. పోనీలెండి ఆంటీ ఉన్నారు కాబట్టి మీరు చక్కగా హోంవర్క్ చేసుకుంటున్నారు అంటుంది.
పిల్లలందరూ షాక్ అవుతారు అంజూనే మిస్సమ్మ ఆంటీ అంటుంది అని అనుకుంటారు.
అరుంధతి ఎక్కడ పిల్లలకి ఎలాంటి అనుమానం వస్తుందో అని నేను బయలుదేరుతాను అంటుంది కాసేపు ఆగండి మాట్లాడుకుందాం అంటుంది మిస్సమ్మ.
అరుంధతి: నువ్వు మాట్లాడుతున్నది ఒక ఆత్మతో అని తెలిస్తే ఏమైపోతావో అనుకుంటూ పిల్లలకి హోంవర్క్ చేయించాలి అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతున్న అరుంధతికి బాయ్ చెప్తుంది.
మిస్సమ్మ ప్రవర్తనకి నవ్వుకుంటారు పిల్లలందరూ.
అంజు : నేనే అనుకున్నాను నా కన్నా లూజ్ అని మనసులో అనుకొని పర్వాలేదులే మిస్సమ్మ బాగైపోతుంది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది కదా అని నవ్వుతూ అంటుంది.
మిస్సమ్మ: కన్ఫ్యూజ్ అవుతుంది. అంజు ఏ మందో మీకు అర్థమైందా అని అయోమయంగా ఆకాష్ వాళ్ళని అడుగుతుంది.
పిల్లలు: మాకు అర్థమైంది ఇంకా అర్థం అవ్వవలసింది నీకే అని నవ్వుతారు.
వాళ్ల ప్రవర్తనకి ఆశ్చర్య పోతుంది మిస్సమ్మ.
మరోవైపు ఇంట్లో అందరూ పడుకోవటం చూసి అమర్ తల్లిదండ్రుల గది దగ్గరికి వెళ్తారు మనోహరి,నీల. మనోహరి బలవంతం చేయటం మీద భయంగా నీల తాళాలు దొంగిలించడానికి ప్రయత్నిస్తుంది కానీ భయపడి పోయి బయటికి వచ్చేస్తుంది.
మనోహరి: సరే నువ్వు బయట ఉండు ఎవరైనా వస్తే నాకు చెప్పు అని చెప్పి ఆమె వెళ్లి తలగడ కింద ఉన్న తాళాలు తీసుకుని బీరువాలోంచి డబ్బు తీసేస్తుంది.
అక్కడితో ఈరోజు కధ ముగుస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)