Nindu Noorella Saavasam Serial February 6th: 'నిండు నూరేళ్లు సావాసం' సీరియల్: మిస్సమ్మని మోటివేట్ చేసిన అమర్.. మొగుడ్ని చంపేస్తానంటూ బెదిరిస్తున్న మంగళ!
Nindu Noorella Saavasam Serial Today Episode: కూతురు పెళ్లి అయ్యేవరకు నోరు విప్పావంటే మొగుడువని కూడా చూడను చంపేస్తాను అంటూ మంగళ రామ్మూర్తిని హెచ్చరించడంతో కధ లో కీలక మలుపులు ఏర్పడతాయి.
Nindu Noorella Saavasam Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో భాగీ ఫ్రెండ్ మళ్లీ భాగి ని కలవటానికి హాస్పిటల్ కి వస్తుంది.
ఇంతలో అమర్ భాగికి కాల్ చేస్తాడు. నేను గుర్తున్నానా అంటూ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెప్తాడు.
భాగీ : మీరు గుర్తున్నారు అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపు ఆమె ఫ్రెండ్ లోపలికి వస్తుంది. అవార్డు తీసుకోవటానికి వెళ్ళను అంటున్నావ్ అంట ఏమైంది, తలకి ఏమైనా దెబ్బ తగిలిందా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అంటుంది.
భాగీ : నువ్వు ఎన్ని చెప్పు నా మనసు ఎందుకో నాన్నను వదిలి వెళ్ళటానికి అంగీకరించడం లేదు అంటుంది.
ఫ్రెండ్: నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఈ మాటలు అన్నీ ఫోన్లో వింటాడు అమర్. తర్వాత హలో అనటంతో ఫోన్ చెవి దగ్గర పెట్టుకున్న భాగి నా ఫ్రెండ్ వచ్చేసరికి మీరు లైన్లో ఉన్నారని కూడా మర్చిపోయాను అని చెప్పి సారీ చెప్తుంది.
అమర్: పర్వాలేదు కానీ నేను మీ పర్సనల్ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే మీరు అవార్డు తీసుకోవడానికి వెళ్లటమే మంచిది. మీ ఫాదర్ ఎలాంటి కండిషన్ లో ఉన్నారో నాకు తెలియదు కానీ అవార్డు తీసుకొని ఆయన ఎదురుగా నిలబడితే ఆయనకి అంతకు మించిన మెడిసిన్ ఉండదు అని మోటివేట్ చేస్తాడు.
ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పటివరకు వెళ్ళకూడదు అని అనుకున్నాను కానీ ఇప్పుడు వెళ్లడానికి డిసైడ్ అయ్యాను అని తండ్రితో చెప్తుంది మిస్సమ్మ.
మరోవైపు పిల్లలు ఆకలితో అలమటిస్తూ ఉంటారు.
ఆకాష్ : మనం ఆకలికి ఉండగలం కానీ ఆనంద్ ఉండలేడు. డాడీని కనీసం ఆనంద్ కైనా భోజనం పెట్టమని అడుగుదామా అంటాడు.
అమ్ము : వద్దు, ఇప్పటికే డాడీ మన మీద కోపంగా ఉన్నారు ఇప్పుడు మనం వెళ్లి అడిగితే మరింత కోప్పడతారు అంటుంది.
ఆకలితో బాధపడుతున్న ఆనంద్ ని పట్టుకొని ఎమోషనల్ అవుతుంది అమ్ము. వాళ్ళిద్దర్నీ పట్టుకొని ఆకాష్, అంజు కూడా బాగా ఎమోషనల్ అవుతారు.
అదే సమయంలో అమర తండ్రికి అమర్ మీద చాలా కోపం వస్తుంది. నేరుగా అమర్ దగ్గరికి వెళ్తాడు.
అమర్ తండ్రి: నువ్వు చేస్తున్నది ఏమీ బాగోలేదు అమర్, ఇంతవరకు నువ్వు పిల్లల మీద పెడుతున్న కండిషన్స్ కి నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదు కానీ ఈసారి ఊరుకోలేకపోతున్నాను అంటూ పిల్లల్ని గట్టిగా పిలిచి కిందికి రమ్మంటాడు.
వాడిపోయి ఉన్నా వాళ్ళ మొఖాలని చూపించి చూశావా వాళ్ళ ముఖాలు ఎలాగ వాడిపోయాయో, పిల్లలు దగ్గరగా వచ్చే అంత ప్రేమ లేకపోయినా పర్వాలేదు కానీ దూరంగా పారిపోయేటంత ప్రేమ ఉండకూడదు అంటాడు.
నిర్మల: అవున్రా చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేరు, ఈ ఒక్కసారికి క్షమించు ఎలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను అంటుంది.
అమర్ ఏమి మాట్లాడకపోవటంతో ఏమీ మాట్లాడవేంటి అని అడుగుతారు.
రాథోడ్: మీ మనవడి ఆకలి బాధ తెలిసిన మీకు మీ కొడుకు ఆకలి బాధ తెలియలేదా అంటాడు.
ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యంగా అమర్ ని చూస్తారు.
రాథోడ్: అవును బాబు పిల్లలు తినేవరకు సార్ కూడా ఏమీ తినలేదు వాళ్లతో పాటు తింటానని పచ్చి మంచినీళ్లు తాగలేదు అని చెప్తాడు.
పిల్లలు ఎమోషనల్ అవుతూ వెళ్లి తండ్రిని హగ్ చేసుకుంటారు. మళ్లీ ఇలాంటి తప్పు చేయము అని చెప్పి తండ్రికి సారీ చెప్తారు. మేమునిజం చెబుదామనుకున్నాము డాడీ కానీ మిస్సమ్మని తిడతారేమో అని నిజం చెప్పలేదు. మేము తాతయ్యని చూడడానికి వెళ్ళాము అంటారు.
అమర్ : తాతయ్యకి ఏం జరిగింది, అయినా నేనెందుకు మిస్సమ్మని తిడతాను అంటాడు.
ఎక్కడ మిస్సమ్మ, భాగి ఒక్కరే అని పిల్లలు చెప్పేస్తారో అని భయపడిన మనోహరి కంగారుగా అక్కడికి వెళ్లి ఆ మిస్సమ్మ గురించి ఇంక మాట్లాడకండి, తన వల్లే మీరు ఇలా తయారయ్యారు అని కోప్పడుతుంది.
వీళ్ళు అబద్ధం చెప్పటానికి మిస్సమ్మకి ఏంటి సంబంధం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటూ మనోహర్ని కోప్పడతాడు అమర్ తండ్రి.
అమర్: ఏది ఏమైనా మిస్సమ్మ టాపిక్ ఇంక వద్దు అని చెప్పి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటాడు.
మరోవైపు తండ్రి దగ్గర ఉన్న భాగిని పెళ్లికి నచ్చిన బట్టలు కొనుక్కో అని కాళీ తో పంపిస్తుంది మంగళ. ఇష్టం లేకపోయినా కన్నీటితో కాళీ వెనుక వెళుతున్న కూతుర్ని చూసి బాధపడతాడు రామ్మూర్తి.
మంగళ: వాళ్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఏంటి అలా చూస్తున్నావు, పెళ్లాపేద్దామనే.. కామ్ గా ఒక మూలన కూర్చుని పెళ్లి చూడు లేదంటే మొగుడివి అని కూడా చూడను నేరుగా పైకి పంపించేస్తాను అంటూ మొగుణ్ణి హెచ్చరిస్తుంది. కాళీ వెనుక ఏడుస్తూ షాపింగ్ కి వెళుతూ ఉంటుంది భాగి.. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.